1992లో ‘నాలయ్య తీర్పు’లో హీరోగా నటించడానికి ముందే విజయ్ 1984లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

విజయ్ కి సొంతంగా ఓ సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ విజయ్ మక్కల్ ఇయక్కమ్ ఉంది. ఏటా ఆయన ఫ్యాన్స్ రక్తదానంలో పాల్గొని దాతృత్వాన్ని చాటుకుంటూ ఉంటారు.

రజనీ కాంత్ కు విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అట. ఆయన సినిమాల్లోకి రావడానికి రజనీనే ప్రేరణ అని చెబుతుంటారు కూడా.

విజయ్ కి తన సోదరి అంటే చాలా ఇష్టమట. కానీ ఆమె తన తొమ్మిదేళ్ల వయసులోనే చనిపోయిందట.

సోదరి జ్ఞాపకార్థంగా విజయ్ తన ప్రొడక్షన్ కు వివి ప్రొడక్షన్స్.. అంటే విద్యా-విజయ్ ప్రొడక్షన్ అని పేరు పెట్టారు.

ఈ తమిళ హీరో ఓ బాలీవుడ్ సినిమాల్లో చేయకపోయినప్పటికీ.. ఓ హిందీ సినిమాలో మాత్రం కనిపించారు.

అక్షయ్ కుమార్ నటించిన 'రౌడీ రాథోర్' లో, నటుడు ప్రభుదేవాతో కలిసి చింత టా టా పాట చివర్లో అక్షయ్ తో కలిసి విజయ్ కాలు కదిపారు.

కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక మలయాళీయేతర నటుడు విజయ్ మాత్రమే.

విజయ్ తన కెరీర్ లో మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఒక కలైమామణి, ఎంజీఆర్ వర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.

Image Credits: Instagram