సీనియర్ నటి సదా (సదాఫ్ మొహమ్మద్ సయీద్) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.
తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన 'జయం' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల సదాఫ్.
అచ్చ తెలుగమ్మాయిగా లంగా ఓణీలో కనిపించి అందరినీ ఆకర్షించింది. 'వెళ్లవయ్యా వెళ్ళూ' అంటూ యువ హృదయాలను కొల్లగొట్టింది.
'జయం' చిత్రం హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది సదా. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలోనూ నటించింది.
ప్రాణం, నాగ, దొంగ దొంగది, లీలా మహల్ సెంటర్, ఔనన్నా కాదన్నా, వీరభద్ర, చుక్కల్లో చంద్రుడు, క్లాస్ మేట్స్, టక్కరి వంటి చిత్రాల్లో సదా నటించింది.
అయితే టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ ఆశించిన విధంగా సాగలేదు. జూనియర్ ఎన్టీఆర్ - నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించినా, స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది.
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ కు జోడీగా నటించిన 'అన్నియన్' (తెలుగులో 'అపరిచితుడు') మూవీ సదా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం పలు టెలివిజన్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సదా.. సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకుంటోంది.
'హలో వరల్డ్' వంటి వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టిన ఈ సీనియర్ బ్యూటీ.. ఇటీవల 'అహింస' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.