బాలీవుడ్ భామ దిశా పటానీ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందాల ప్రదర్శన చేస్తున్న ఈ ఫొటోలకు ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దిశా పటానీ చేతిలో ప్రస్తుతం క్రేజీ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’లో కీలక పాత్రలో నటిస్తుంది. తన పాత్రకు సంబంధించిన ప్రీ-లుక్‌ను కూడా విడుదల చేశారు. సూర్య ‘కంగువా’లో కూడా దిశా పటానీనే హీరోయిన్. తమిళనాట క్రేజీ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘యోధ’ అనే సినిమాలో కూడా నటిస్తుంది. అక్టోబర్ 27వ తేదీన ‘యోధ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.