మెస్మరైజింగ్ ఫోటోస్ తో ఆకట్టుకుంటున్న ‘గబ్బర్ సింగ్’ బ్యూటీ శృతి హాసన్ ‘గబ్బర్ సింగ్’ మూవీ తర్వాత శృతి హాసన్ మళ్లీ ఇప్పుడిప్పుడే హిట్స్ అందుకుంటోంది. కమ్ బ్యాక్ తర్వాత మరోసారి వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఈ ఏడాది ఆరంభంలోనే శృతి రెండు భారీ విజయాలను అందుకుంది. అందులో ఒకటి ‘వాల్తేరు వీరయ్య’, మరొకటి ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాల్లోనూ శృతి హాసన్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ‘సలార్’ సినిమాలో నటిస్తోన్న శృతి హాసన్. శృతి ప్రస్తుతం శాంతను హజారికతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇదివరకు మైకేల్ కోర్ల్సేతో రిలేషన్ షిప్‌లో ఉండేది. మైకేల్ తో బ్రేకప్.. ఆ తర్వాత శృతి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అందుకే కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకుని, మళ్లీ బిజీగా మారిపోయింది. Image Credits : Shruti Haasan/Instagram