'ఆదిపురుష్' సోసో & జస్ట్ ఓకే ఫిల్మ్ అని విమర్శలు అంటే... సోషల్ మీడియాలో ఫ్లాప్ టాక్ వచ్చింది. ప్రభాస్ సినిమా అసలు బాలేదా? మినీ రివ్యూ చూడండి. 

కథ ఏంటి? : సీతారాములు అరణ్యవాసంలో ఉండగా... సీతను రావణాసురుడు అపహరించుకుని లంకకు తీసుకు వెళతాడు. 

సీత కోసం వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లిన రాముడు... రావణుడితో యుద్ధం చేసి గెలుస్తాడు. అదీ కథ. 

ఎలా ఉందేంటి? : సీతారాముల కథను న్యూ జనరేషన్ ఆడియన్స్‌ సైతం మెచ్చేలా తీయాలని ప్రభాస్, ఓం రౌత్ ప్లాన్ చేశారు. 

రామాయణానికి మోడ్రన్ టచ్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇది రామాయణమేనా? అని డౌట్ వచ్చేలా ఓం రౌత్ సినిమా తీశారు. 

రావణుడి గెటప్, లంక సెటప్, రావణ సైన్యం... అంతా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సిన్మా టైపులో ఉన్నాయి. కొన్ని సీన్స్‌లో ప్రభాస్ లుక్ బాలేదు. 

'ఆదిపురుష్' ఫస్టాఫ్ సోసోగా అలా వెళుతుంది. సెకండాఫ్‌లో వార్ సీక్వెన్సులు 'బాహుబలి'ని గుర్తు చేశాయి.

రాఘవుడిగా ప్రభాస్, జానకిగా సీత, హనుమంతునిగా దేవదత్తా నాగే బాగా చేశారు. లంకేశ్ పాత్రలో సైఫ్ సెట్ కాలేదు.

ఓం రౌత్ చేసిన తప్పులను పాటలు, నేపథ్య సంగీతం చాలా వరకు కవర్ చేశాయి. మ్యూజిక్ చాలా బావుంది. 

అంచనాలు ఏవీ పెట్టుకోకుండా వెళితే 'ఆదిపురుష్' ఓకే అనిపిస్తుంది. లేదంటే బోర్ కొడుతుంది. కష్టమే!