ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ప్రభాస్ టార్గెట్ ఎంత? ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా హిట్? తెలుగులోనే 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ. ఏపీ, తెలంగాణలో 125 కోట్లకు ఏరియాల వారీగా రైట్స్ అమ్మారు. 'ఆదిపురుష్' తెలుగు స్టేట్స్ రైట్స్ 165 కోట్లకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుని 125 కోట్లకు ఇచ్చారు. హిందీలోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. బాలీవుడ్ మార్కెట్, రెస్టాఫ్ ఇండియా హిందీ కలిపి 75 కోట్లు లెక్క కట్టారు. 'ఆదిపురుష్' ఓవర్సీస్ రైట్స్ రూ. 21.50 కోట్లకు విక్రయించినట్టు తెలిసింది. కర్ణాటకలోనూ 'ఆదిపురుష్'కు మంచి బజ్ నెలకొంది. థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 16.50 కోట్లు వచ్చాయి. తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ద్వారా 'ఆదిపురుష్'కు రూ. 5 కోట్లు వచ్చాయి. కేరళలో 'ఆదిపురుష్'కు అంత బజ్ లేదు. అక్కడ థియేట్రికల్ రైట్స్ నుంచి జస్ట్ రూ. 2 కోట్లు వచ్చాయి 'ఆదిపురుష్' వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 245 కోట్లు అని ట్రేడ్ వర్గాల టాక్. థియేటర్ల నుంచి రూ. 248 నుంచి రూ. 250 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందట. ప్రభాస్ ముందు టార్గెట్ 250 కోట్లు ఉంది.