నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా 'భగవంత్ కేసరి'. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10న) సందర్భంగా సినిమా టీజర్ విడుదల చేశారు. అందులో ఫైట్స్ బావున్నాయ్! ఈ చిత్రంలో బాలకృష్ణ పూర్తి పేరు నేలకొండ భగవంత్ కేసరి. అంటే... NBK. రియల్ లైఫ్ పేరు గుర్తుచ్చేలా! ఇందులో డైలాగ్స్ చూడండి. రాజు వాడి వెనుకున్న వందల మంది మందను చూపిస్తాడు - అర్జున్ రాంపాల్ క్యారెక్టర్‌ను ఉద్దేశిస్తూ! మొండోడు వాడికి ఉన్న ఓకే ఒక్క గుండెను చూపిస్తాడు - 'భగవంత్ కేసరి'గా తన ధైర్యం గురించి! పతాహై ఖానోం కి బీచ్ మే బేజా క్యూ రహతా హై (చెవుల వెనుక బుర్ర ఎందుకు ఉంటుందో తెలుసా?) జబ్ ఖాన్ బైరీ పడితి హై, బాత్ బేజీ మే గుస్ తి హై (చెవి మీద ఒక్కటి కొడితే మాట బుర్రకు ఎక్కుతుంది) భగవంత్ కేసరి... ఈ పేరు షానా ఏళ్ళు యాది ఉంటుంది! - బాలకృష్ణ విజయ దశమి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.