సిద్ధార్థ్ మాస్ హీరో కావాలని చేసిన ప్రయత్నం 'టక్కర్'. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ : గుణశేఖర్ (సిద్దార్థ్) పేదింటి కుర్రాడు. ధనవంతుడు కావాలని విశాఖ వస్తాడు. అక్కడ బెంజ్ కార్ డ్రైవర్ అవుతాడు. 

విశాఖలో పెద్ద క్రిమినల్ రాజ్ (అభిమన్యు సింగ్) మనుషులను కొట్టి వాళ్ళ కారును గుణశేఖర్ వేసుకుని వెళతాడు. 

కారు డిక్కీలో ఉన్న లక్కీ (దివ్యాంశ కౌశిక్)తో గుణశేఖర్ ప్రేమ ఏమిటి? రాజ్ రౌడీలను ఎందుకు కొట్టారు? అనేది సినిమా.

ఎలా ఉంది? : 'టక్కర్' కథ, కథనాలు కార్తీ 'ఆవారా'ను గుర్తు చేస్తాయి. యాక్షన్ & కామెడీ మిక్స్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. 

సిద్ధార్థ్ కొత్త లుక్ ఆయనకు సెట్ కాలేదు. మాస్ & యాక్షన్ హీరో కావాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

దివ్యాంశ కౌశిక్ బోల్డ్ సీన్స్ చేశారు. నటిగా జస్ట్ ఓకే. అయితే, ఆమె రోల్ గ్లామర్ షోకి మాత్రమే యూజ్ అయ్యింది. 

యోగిబాబు కామెడీ, అభిమన్యు సింగ్ విలనిజం వర్కవుట్ కాలేదు. మిగతా ఆర్టిస్టుల్లో తెలుగు తారలు లేరు. 

'టక్కర్' గతుకుల రోడ్డులో ప్రయాణంలా ఉంటుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్... దేనికీ దర్శకుడు న్యాయం చేయలేదు. 

టక్కర్... థియేటర్లలో ప్రేక్షకులకు రెండు గంటల టార్చర్. యాక్షన్ సీన్లు, కొంత కామెడీ తప్ప మిగతాదంతా బోర్.