తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ చెప్పారు. ఫిల్మ్ నుంచి మెగాస్టార్ కాంప్లిమెంట్ వరకు... 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ హైలైట్స్!

నిజమైన బాహుబలి రాముడే అని ఈ లోకానికి నిరూపించడం కోసమే 'ఆదిపురుష్' చేశారని ముఖ్య అతిథి చిన జీయర్ అన్నారు. 

చిరంజీవి గారిని కలిసినప్పుడు 'రామాయణం చేస్తున్నావా?' అనడిగారు. 'అవును' అని చెప్పాను. 

'రామాయణం చేయడం అందరికీ దొరికే అవకాశం కాదు, నీకు దొరికింది. నిజంగా నీ అదృష్టం' అన్నారు చిరు - ప్రభాస్. 

ప్రభాస్ ఎక్కువ మాట్లాడారని అందరూ చెబుతారని, కానీ అతడు మాట్లాడతాడని, స్వీట్ హార్ట్ అని కృతి పేర్కొన్నారు.   

హీరోగా 20 ఏళ్ళ కెరీర్‌లో ఓం రౌత్ లాంటి దర్శకుడ్ని చూడలేదన్నారు ప్రభాస్. సినిమా కోసం అతడు యుద్ధం చేశాడన్నారు. 

సీత పాత్రే తనను ఎంపిక చేసుకున్నదని, ప్రేమ & ఆశీర్వాదంతో తనకు ఈ ఛాన్స్ వచ్చిందన్నారు కృతి సనన్.

రామాయణంలో అరణ్య, యుద్ధ కాండల్లో ప్రధాన కథను తీసుకుని సినిమా చేశామన్నారు. లోకానికి ఇది మహోపకారం - జీయర్ స్వామి. 

జానకి పాత్రలో కృతి సనన్ కన్నీళ్లు పెట్టుకున్న పోస్టర్ అద్భుతమని ప్రభాస్ పొడిగారు. 

ప్రభాస్ లేకపోతే 'ఆదిపురుష్' సినిమా లేదని దర్శకుడు ఓం రౌత్ పేర్కొన్నారు.