అనసూయ వేశ్య పాత్ర, సముద్రఖని & ప్రచార చిత్రాలు 'విమానం'పై అంచనాలు పెంచాయి. మరి, సినిమా ఎలా ఉంది?
కథ : వీరయ్య (సముద్రఖని) వికలాంగుడు. భార్య మరణంతో బిడ్డ రాజు (ధ్రువన్) జీవితంగా బతుకుతుంటాడు.
రాజుకు విమానం ఎక్కాలని కోరిక. సులభ్ కాంప్లెక్స్ మీద వచ్చే డబ్బులతో వీరయ్య జీవిస్తాడు.
కొడుక్కి ఫ్లైట్ టికెట్ కొనే డబ్బులు వీరయ్యకు ఉండవు. అయినా సరే ఎలాగైనా కొడుకును ఫ్లైట్ ఎక్కించాలని ట్రై చేస్తాడు. ఎందుకు?
వీరయ్యకు సుమతి (అనసూయ), కోటి (రాహుల్ రామకృష్ణ), డేనియల్ (ధనరాజ్), ఎయిర్ హోస్టెస్ (మీరా జాస్మిన్) ఏ సాయం చేశారు? అనేది సినిమా.
ఎలా ఉంది? : తండ్రీ కుమారుల మధ్య భావోద్వేగభరిత ప్రయాణమే 'విమానం' సినిమా. కంటతడి పెట్టిస్తుంది.
సముద్రఖని, ధ్రువన్ సీన్లను హృదయాలకు హత్తుకుంటాయి. స్కూల్‌లో పిల్లల మధ్య సంభాషణలు నవ్విస్తాయి.
సుమతిగా వేశ్య పాత్రకు అవసరమైన శృంగార రసాన్ని అనసూయ పలికించారు. చివర్లో ఏడిపించారు!
దర్శకుడు కథ, ఎమోషనల్ సీన్స్ చక్కగా రాసుకున్నాడు. ఇంకాస్త క్రిస్పీగా తీసి ఉంటే బావుండేది.
పతాక సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. తల్లిదండ్రులకు నచ్చుతాయి. పాటలు బావున్నాయి.
'విమానం' టేకాఫ్‌కి టైమ్ తీసుకున్నా ల్యాండింగ్ పెర్ఫెక్ట్‌గా ఉంది. హార్ట్ టచింగ్ మూవీ.