చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్, అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలో ఐటమ్ సాంగ్ చేశారు ఊర్వశి రౌతేలా! ఊర్వశి రౌతేలా పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు స్పెషలిస్ట్ సాంగ్స్ భామ ఇమేజ్ గుర్తుకు వస్తుంది. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ 'బ్రో' సినిమాలోనూ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. గ్లామరస్ గాళ్ ముద్ర పడిన ఊర్వశి రౌతేలాకు ముంబైలో జరిగిన ఓ అవార్డు వేడుకలో స్పెషల్ అవార్డు వచ్చింది. ప్రపంచంలోనే పెళ్లికాని అందగత్తెల జాబితాలో ఆమెకు ప్రథమ స్థానమని ఓ అవార్డు అవార్డు ఇచ్చారు. వరల్డ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్ ఊర్వశి రౌతేలా అని పేర్కొన్నారు. తనకు వచ్చిన అవార్డు పట్ల ఊర్వశి రౌతేలా సంతోషం వ్యక్తం చేశారు. ఊర్వశి రౌతేలా (All Images Courtesy : urvashirautela / Instagram)