Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Trump Release Immigrant Households Data: ట్రంప్ కఠిన వలస విధానం, ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్.. వెనిజులాపై ఉక్కుపాదం మోపిన సమయంలో అమెరికాలో 120 దేశాల వలసదారులకు అందిన సాయమని ఓ జాబితా విడుదల చేశారు.

Trump Release Immigrant Households Data: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల జాబితాను విడుదల చేశారు. ఆ దేశాల ప్రజలు అమెరికాలో సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం పొందుతున్నారని పేర్కొన్నారు. ట్రంప్ ఈ డేటాను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. ట్రంప్ షేర్ చేసిన ఈ జాబితాలో ప్రపంచంలోని సుమారు 120 దేశాల పేర్లు ఉన్నాయి. అయితే, ఆశ్చర్యకరంగా ఆ జాబితాలో భారతదేశం పేరు లేదు. భారతదేశంతో పాటు, దాని పొరుగు దేశాలైన పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనా పేర్లు ఈ జాబితాలో స్పష్టంగా ఉన్నాయి.
120 దేశాల జాబితాను విడుదల చేసిన అమెరికా
ట్రంప్ విడుదల చేసిన ఈ జాబితా.. అమెరికా వెనిజులాపై కఠిన వైఖరి తీసుకుని, అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అరెస్ట్ చేసే చర్యలు చేపట్టిన సమయంలో విడుదల చేశారు. మదురోను అరెస్ట్ చేసి అమెరికాకు తరలిస్తున్న సమయంలో అమెరికా ఈ జాబితా రిలీజ్ చేసింది. ఇది రాజకీయ, దౌత్యపరమైన ప్రాముఖ్యతను మరింత పెంచింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్యను ట్రంప్ తన కఠినమైన వలస విధానం, దేశీయ రాజకీయాల కోణంలో చూడాలి. ముఖ్యంగా అమెరికాలో వలసలు, ప్రభుత్వ ఖర్చులపై చర్చ తీవ్రమవుతున్న సమయంలో లిస్ట్ విడుదల చేయడంపై చర్చ జరుగుతోంది.
వాస్తవానికి, ఈ జాబితాలోని వివిధ దేశాల వలసదారులకు అమెరికా ప్రభుత్వం అందించిన సహాయాన్ని శాతాలలో చూపించారు. అయితే, ఈ సహాయం ఏ రకమైనదో అమెరికా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు. అది నగదు రూపంలో లభించిన ప్రయోజనమా, ఆహార సహాయమా, ఆరోగ్య సేవలా లేక మరేదైనా సంక్షేమ పథకానికి సంబంధించినదా అనేది తెలియదు.
గందరగోళాన్ని సృష్టించేలా జాబితా
అంతేకాకుండా, 120 దేశాల జాబితాలో ఈ సహాయం ఏ సమయంలో అందించారు, వలసదారులకు ఈ ప్రయోజనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందించారు. ఈ సహాయం ఇంకా కొనసాగుతోందా లేక ఇప్పటికే నిలిపివేశారా అనే సమాచారం కూడా లేదు. ఈ కారణంగానే నిపుణులు, విశ్లేషకులు ఈ డేటా పారదర్శకత, సందర్భంపై ప్రశ్నలు లేవనెత్తారు. స్పష్టమైన కాలపరిమితి, పథకం వారీగా వివరాలు లేకుండా కేవలం శాతాల ఆధారంగా నిర్ధారణలకు రాలేమన్నారు. మొత్తానికి ఈ వలస దేశాల సహాయం జాబితా ఒక రాజకీయ సందేశాన్ని ఇస్తుంది. కానీ వాస్తవాల పూర్తి వాస్తవాలను ప్రపంచానికి చెప్పడం లేదు. దీనివల్ల ట్రంప్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలపై పలు దేశాలలో గందరగోళం నెలకొంది.






















