మీరు కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఈ బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వంటి అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుంది.
గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి లక్షల ఉచిత బీమా! క్లైయిమ్ ప్రాసెస్ గురించి తెలుసుకోండి!
LPG Connection Insurance:LPG గ్యాస్ కనెక్షన్ భారీ బీమాతో వస్తుంది. ఏదైనా ప్రమాదవశాత్తు నష్టానికి కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. దీని ప్రక్రియను గురించి తెలుసుకుందాం.

- గ్యాస్ కనెక్షన్‌తో ఉచితంగా లక్షల బీమా లభిస్తుంది.
- ప్రమాదాలు జరిగినప్పుడు 30 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.
- ప్రమాదం జరిగినప్పుడు డీలర్‌కు సమాచారం అందించి, FIR తీసుకోవాలి.
- బీమా క్లెయిమ్ కోసం కంపెనీ ధృవీకరించిన పరికరాలు వాడాలి.
LPG Connection Insurance:దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు వంట గ్యాస్ కనెక్షన్ ఉంటోంది. కట్టెల పొయ్యి మీద వంట చేసే రోజులు పోయి, సిలిండర్ వాడకం అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రభుత్వం గ్యాస్ వాడకాన్ని సులభతరం చేయడమే కాకుండా వినియోగదారుల భద్రత కోసం కొన్ని ప్రత్యేక సదుపాయాలను కూడా కల్పించింది. అయితే చాలా మంది తెలియని విషయం ఒకటి ఉంది. మీ గ్యాస్ కనెక్షన్‌తోపాటు మీకు లక్షల రూపాయల బీమా ఉచితంగా లభిస్తుంది. దీని కోసం మీరు ఒక్క రూపాయి కూడా అదనంగా కట్టాల్సిన పని లేదు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ బీమా కొండంత అండగా నిలుస్తుంది. ఆ బీమా ఏంటీ? దాన్ని ఎలా పొందాలి? అన్న విషయాలను సులభంగా ఇక్కడ తెలుసుకుందాం.
ఏంటీ ఎల్పీజీ బీమా?
మీరు కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఈ బీమా సౌకర్యం మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాదు, మీరు ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీ సిలిండర్ వాడుతున్నా సరే ఈ బీమా వర్తిస్తుంది. మీరు మీ కనెక్షన్‌ను రెన్యూవల్ చేసుకున్నప్పుడుల్లా ఈ బీమా కూడా ఆటోమేటిక్‌గా కొనసాగుతూనే ఉంటుంది. దీని కోసం మీరు ఎలాంటి అదనపు ఫారాలు నింపాల్సిన పని లేదు. అలాగే ఎలాంటి ప్రీమియం డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.
ఎంత వరకు పరిహారం లభిస్తుంది?
గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు కలిగే నష్టాన్ని బట్టి బీమా మొత్తం మారుతూ ఉంటుంది. సాధారణంగా ఈ బీమా కవరేజ్ 30 లక్షల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కంపెనీ రూల్స్‌ను బట్టి ఈ మొత్తం కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. ప్రమాదంలో ప్రాణాలు పోయినప్పుడు పరిహారం లభించడమే కాకుండా, గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులు, ప్రమాదం వల్ల ఇంటికి జరిగిన నష్టాన్ని కూడా బీమా కింద పరిహారం పొందవచ్చు.
ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి? క్లెయిమ్ ప్రాసెస్ ఏంటీ?
చాలా మందికి ఈ పథకం గురించి తెలియకపోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు గ్యాస్ సిలిండర్ వల్ల లేదా పైపు లీకేజీ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మీరు వెంటనే గ్యాస్ ఏజెన్సీకి, లేదా డీలర్‌కు సమాచారం అందివ్వాలి. దగ్గర లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చి ఉంటే వారి నుంచి కూడా ఫైర్ డిపార్టుమెంట్ రిపోర్టు తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ మీ గ్యాస్ డీలర్‌కు అందజేస్తే వారు బీమా కంపెనీకి పంపిస్తారు. ఆ తర్వాత కంపెనీ పరిశీలించి బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు నేరుగా పరిహారం అందిస్తుంది.
బీమా పొందాలంటే పాటించాల్సిన రూల్స్ ఏంటీ?
ఈ బీమా అందరికీ వర్తించినప్పటికీ కొన్ని రూల్స్ పాటిస్తేనే మీరు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కాకుండా యాక్టివ్‌లో ఉండాలి. మీరు వాడుతున్న గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, గ్యాస్ పైపులు కచ్చితంగా కంపెనీ ధృవీకరించినవి లేదా నాణ్యమైన ఐఎస్‌ఐ ముద్ర ఉన్నవే అయి ఉండాలి. స్థానికంగా దొరికే నాసిరకం పైపులు వాడటం వల్ల ప్రమాదం జరిగితే బీమా రాకపోవచ్చు. పైపులు పాతబడినా లేదా రెగ్యులేటర్‌లో ఏమైనా లోపాలు ఉన్నా వెంటనే వాటిని మార్చుకోవాలి. క్రమం తప్పకుండా మీ గ్యాస్ కనెక్షన్‌ను చెక్ చేయించుకోవాలి.
Frequently Asked Questions
ఎల్పీజీ బీమా అంటే ఏమిటి?
ఎల్పీజీ బీమా కింద ఎంతవరకు పరిహారం లభిస్తుంది?
సాధారణంగా ఈ బీమా కవరేజ్ 30 లక్షల వరకు ఉంటుంది. ప్రమాదంలో ప్రాణాలు పోయినప్పుడు, గాయపడిన వారికి వైద్య ఖర్చులు, ఇంటికి జరిగిన నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది.
ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
గ్యాస్ ఏజెన్సీకి లేదా డీలర్‌కు సమాచారం ఇవ్వాలి. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి FIR కాపీ, ఫైర్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్ తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ డీలర్‌కు అందజేస్తే బీమా కంపెనీ పరిశీలించి పరిహారం అందిస్తుంది.
బీమా పొందడానికి పాటించాల్సిన నియమాలు ఏమిటి?
గ్యాస్ కనెక్షన్ యాక్టివ్‌లో ఉండాలి. వాడే స్టవ్, రెగ్యులేటర్, పైపులు కంపెనీ ధృవీకరించినవి లేదా ISI ముద్ర ఉన్నవి అయి ఉండాలి. నాసిరకం వస్తువులు వాడితే బీమా రాకపోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు


















