అన్వేషించండి

Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 

Kavitha Arrest: సోమవారం మధ్యాహ్నం ఖమ్మంలోని జడ్పీ కూడలి వద్ద మొదలైంది. వెలుగమట్ల బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన కవిత, వారితో కలిసి భారీ ఎత్తున నిరసన చేపట్టారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని కవిత నిరసన చేపట్టారు.
  • ఖమ్మంలో నిరసన తెలిపిన కవిత, పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
  • అంబేడ్కర్ భవన్‌లో నిరాహార దీక్ష కొనసాగించారు, ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
  • తెల్లవారుజామున పోలీసులు కవిత, ఇతర నాయకులను అరెస్ట్ చేసి తరలించారు.

Kavitha Arrest: ఖమ్మంలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. వెలుగుమట్ల భూ బాధితుల సమస్య పరిష్కారం కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన పోరాటం తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఆమెను, ఇతర నేతలను అరెస్టు చేసి హైదరాబాద్‌ తరలించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని కవిత స్పష్టం చేశారు. 

జడ్పీ కూడలిలో మొదలైన నిరసన

ఈ వివాదం సోమవారం మధ్యాహ్నం ఖమ్మంలోని జడ్పీ కూడలి వద్ద మొదలైంది. వెలుగమట్ల బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన కవిత, వారితో కలిసి భారీ ఎత్తున నిరసన చేపట్టారు. న్యాయం చేయాలంటూ ఆమె రోడ్డుపైనే బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు ఆమెను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచిన అధికారులు, చీకటిపడ్డాక విడుదల చేశారు. 

అంబేడ్కర్‌ భవన్‌లో నిరవధిక దీక్ష 

పోలీస్ స్టేషన్‌ నుంచి విడుదలైన కవిత నేరుగా ఇంటికి వెళ్లకుండా తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు. రాత్రి సమయంలో ఆమె నేరుగా ఖమ్మంలోని అంబేడ్కర్ భవన్‌కు చేరుకున్నారు.  అక్కడ నిరాహార దీక్షకు దిగారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కవిత విమర్శలు చేశారు. భూదాన్ భూముల బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, వారికి పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. పేదవాడి భూమిని రక్షించుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఆమె ప్రకటించారు. 

తెల్లవారుజామున పోలీసులు మెరుపుదాడి 

మంగళవారం ఉదయం ఖమ్మంలో పరిస్థితి మరో మలుపు తిరిగింది. అంబేడ్కర్‌ భవన్‌లో దీక్ష చేస్తున్న కవిత, విశారదన్ మహరాజ్‌, ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారు జామున జరిగిన ఈ అరెస్టు ఉద్రిక్తతకు దారి తీసింది. అరెస్టు చేసిన నాయకులను పోలీసులు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌  తరలించారు. దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించి, అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్టు అయిన వారిలో జాగృతి నాయకులు, వెలుగుమట్ల బాధితులు ఉన్నారు. 

వెలుగుమట్ల సమస్య ఏంటీ

దశాబ్దాలుగా వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూములు విషయంలో గందరగోళం నెలకొంది. తమకు కేటాయించిన భూములకు సంబంధించిన పట్టాలు రాకపోవడం లేదా ఆ భూములు ఇతరులు ఆక్రమించుకోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి, పేదలకు దక్కాల్సిన హక్కులను కల్పించాలని ఒత్తిడి తెస్తున్నారు.  

 

Frequently Asked Questions

ఖమ్మంలో కవితను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?

వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని కవిత చేపట్టిన నిరసనలో భాగంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ట్రాఫిక్ స్తంభించింది.

కవిత తన నిరసనను ఎలా కొనసాగించారు?

పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేసిన తర్వాత, కవిత నేరుగా ఇంటికి వెళ్లకుండా ఖమ్మంలోని అంబేడ్కర్ భవన్‌లో నిరాహార దీక్షకు దిగారు.

వెలుగుమట్ల భూ సమస్య ఏమిటి?

దశాబ్దాలుగా వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూములకు సంబంధించిన పట్టాలు రాకపోవడం లేదా ఆ భూములు ఇతరులు ఆక్రమించుకోవడం వంటి సమస్యలతో బాధితులు బాధపడుతున్నారు.

కవిత దేనికి డిమాండ్ చేస్తున్నారు?

ప్రభుత్వం మొండి వైఖరి వీడి, పేదలకు దక్కాల్సిన భూ హక్కులను కల్పించాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాలని కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
Tejaswi Surya: ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
Telangana News: ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
MLA Qualifications: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hormuz Strait Open: హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
ISRO High Alert: అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Child born the day after marriage: పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
Embed widget