అన్వేషించండి

Honda Dio 125 కొనబోతున్నారా? స్టాండర్డ్, X ఎడిషన్, DLX వేరియంట్ల ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు

హోండా డియో 125 స్కూటర్ రెండు వేరియంట్లు & ఒక స్పెషల్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. స్టాండర్డ్, X ఎడిషన్, DLX మోడళ్ల ధరలు, ఫీచర్లు, హైదరాబాద్ ఆన్ రోడ్ ధరల వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా డియో 125 స్పోర్టీ డిజైన్, 123.9cc ఇంజిన్‌తో వస్తుంది.
  • స్టాండర్డ్ వేరియంట్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, డిస్క్ బ్రేక్ కలిగి ఉంది.
  • X-ఎడిషన్ డ్యూయల్ టోన్, రెడ్ వీల్స్‌తో మరింత స్టైలిష్‌గా ఉంటుంది.
  • DLX వేరియంట్ కీలెస్ ఇగ్నిషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.

Honda Dio 125 price India: తెలుగు రాష్ట్రాల్లో, యువతలో మంచి క్రేజ్ ఉన్న స్కూటర్లలో Honda Dio 125 ఒకటి. స్పోర్టీ డిజైన్, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, హోండా నమ్మకం - ఇవన్నీ కలిసిన ఈ స్కూటర్‌ను కుటుంబ వినియోగానికి కూడా సరిపోయేలా రూపొందించారు.

ఈ స్కూటర్ Honda Activa 125 ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. అయితే డిజైన్, స్టైలింగ్ మాత్రం పూర్తిగా స్పోర్టీగా ఉండేలా రూపొందించారు. ప్రస్తుతం Honda Dio 125 రెండు ప్రధాన వేరియంట్లు & ఒక ప్రత్యేక ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు వాటి ధరలు, ఫీచర్లు ఏమిటో చూద్దాం.

స్టాండర్డ్ (Standard) వేరియంట్

Honda Dio 125లో స్టాండర్డ్ వేరియంట్ బేసిక్ మోడల్. అయితే ఫీచర్ల విషయంలో ఇది కూడా మంచి స్థాయిలో ఉంటుంది.

ఈ స్కూటర్‌లో 123.9cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8.3 hp పవర్ & 10.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ Activa 125లో కూడా ఉపయోగిస్తున్నారు.

స్టాండర్డ్ వేరియంట్‌లో కూడా కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. వాటిలో

ఇంజిన్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ

ఫ్రంట్ డిస్క్ బ్రేక్

4.3 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే

అయితే ఈ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు.

ఈ మోడల్ మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి గ్రే, గ్రే/బ్లాక్, బ్లాక్, బ్లూ, యెల్లో & రెడ్.

ధర: ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.86,733; హైదరాబాద్ ఆన్ రోడ్ ధర: సుమారు రూ.1,16,200

X ఎడిషన్ (X-edition)

Honda Dio 125లో X ఎడిషన్ ఒక ప్రత్యేక స్టైల్ వేరియంట్. ఫీచర్లు & ఇంజిన్ పరంగా ఇది స్టాండర్డ్ వేరియంట్‌తో దాదాపు ఒకేలా ఉంటుంది.

అయితే దీనిలో ముఖ్యమైన తేడా డిజైన్ & కలర్ స్కీమ్. ఈ వేరియంట్‌లో.... డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ , రెడ్ కలర్ అలాయ్ వీల్స్ లాంటివి ఇచ్చారు. దీంతో స్కూటర్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది.

ధర: ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.87,733; ఇది స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే రూ.1,000 ఎక్కువ.

హైదరాబాద్ ఆన్ రోడ్ ధర: సుమారు రూ.1,17,339

DLX వేరియంట్

Honda Dio 125లో DLX వేరియంట్ టాప్ మోడల్. ఈ వేరియంట్‌లో కొన్ని అదనపు ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ఈ వేరియంట్‌లో ముఖ్యంగా...

కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్

TFT డిస్‌ప్లేకు బ్లూటూత్ కనెక్టివిటీ లాంటివి అందిస్తారు. దీంతో మొబైల్ నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు.

అయితే ఈ మోడల్‌లో కిక్ స్టార్టర్ ఉండదు. ఇది కేవలం ఎలక్ట్రిక్ స్టార్ట్‌తో మాత్రమే వస్తుంది.

ధర: ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.93,062

ఇది Dio 125 లైనప్‌లో అత్యంత ఖరీదైన వేరియంట్.

మొత్తానికి, Honda Dio 125 స్కూటర్‌ స్టైలిష్ డిజైన్‌తో పాటు మంచి ఫీచర్లను అందించే మోడల్‌గా నిలుస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ బడ్జెట్ వినియోగదారులకు సరిపోతే, X ఎడిషన్ స్టైలిష్ లుక్ కోరుకునేవారికి బాగుంటుంది. ఇక DLX వేరియంట్ మాత్రం బ్లూటూత్ కనెక్టివిటీ, కీలెస్ ఫీచర్లు కోరుకునే వారికి సరైన ఎంపికగా చెప్పవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

Honda Dio 125 ఏ ఇంజిన్‌తో వస్తుంది?

Honda Dio 125 స్కూటర్ 123.9cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.3 hp పవర్ & 10.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Honda Dio 125 లో ఏ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి?

Honda Dio 125 లో స్టాండర్డ్, X ఎడిషన్, మరియు DLX అనే మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వేరియంట్ విభిన్న ఫీచర్లతో వస్తుంది.

X ఎడిషన్ మరియు స్టాండర్డ్ వేరియంట్ మధ్య ప్రధాన తేడా ఏమిటి?

X ఎడిషన్, స్టాండర్డ్ వేరియంట్ తో పోలిస్తే డిజైన్ మరియు కలర్ స్కీమ్ లో తేడా కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ మరియు రెడ్ కలర్ అలాయ్ వీల్స్ వంటివి ఉంటాయి.

DLX వేరియంట్ లో అదనపు ఫీచర్లు ఏమిటి?

DLX వేరియంట్ లో కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్ మరియు TFT డిస్ప్లేకు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. అయితే, ఇందులో కిక్ స్టార్టర్ ఉండదు.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget