అన్వేషించండి

Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం

Telugu student dies in USA | మాస్టర్స్ చేసేందుకు అమెరికాకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన నిఖితా రావు తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో మృతదేహమై కనిపించింది. ఘటనపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది.

మేరీల్యాండ్: అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఒక తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. సికింద్రాబాద్‌కు చెందిన 27 ఏళ్ల గొడిశాల నికితా రావు తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో చనిపోయింది. న్యూ ఇయర్ వేడుకల టైం నుండి ఆమె ఆచూకీ లేకుండా పోయిన క్రమంలో జనవరి 3న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నికితను మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ(26)నే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

నిందితుడే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడా?
ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  నికిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబరు 31న ఎల్లికాట్ సిటీలోని తన అపార్ట్‌మెంట్‌లో చివరిసారిగా చూశానని  పోలీసులను నమ్మించాలని చూశాడు. చివరకు అతడి అపార్ట్ మెంట్‌లోనే నిఖిత డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. నిఖిత మిస్సింగ్ అని ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ శర్మ భారత్‌కు పారిపోయాడని పోలీసులకు అనుమానం వచ్చి సెర్చ్ వారెంట్ జారీ చేశారు. డిసెంబరు 31నే నిఖితను అతడు హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

నికిత చదువులో మేటి. టాలెంటెడ్ స్టూడెంట్ గా ఉండేది. ఆమె జేఎన్‌టీయూ (JNTU)లో ఫార్మసీ పూర్తి చేసి, భారత్‌లోని ఒక  ఆసుపత్రిలో మూడేళ్లు సేవలు అందించింది. అనంతరం మాస్టర్స్ చేసేందుకు అమెరికాకు వెళ్లిన ఆమె, ప్రస్తుతం మేరీల్యాండ్‌లోని వెడా హెల్త్ కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా చేస్తున్నట్లు సమాచారం. అత్యుత్తమ పనితీరుకు గానూ గతేడాది నిఖిత 'ఆల్-ఇన్ అవార్డు'ను దక్కించుకున్నారు. ఎంతో ప్రతిభావంతురాలైన నిఖిత మాస్టర్స్ చేసేందుకు వెళ్లి హత్యకు గురైందని తెలియగానే కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె హత్యకు గురికావడాన్ని తోటి ఉద్యోగులు, స్నేహితులు సైతం నమ్మకలేకపోతున్నారు. 

నిఖిత హత్య ఘటనపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది. నికిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పింది.  భారత్‌కు పరారైన నిందితుడు అర్జున్ శర్మను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు ఫెడరల్ అధికారుల సాయం కోరుతున్నారు. నిందితుడిని తిరిగి అమెరికాకు తీసుకువచ్చి చట్టపరమైన చర్యలు తీసుకునేలా భారత అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget