అన్వేషించండి

Gadwal Crime News: గద్వాల జిల్లాలో అమానుషం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి, ఇద్దరు నిందితుల అరెస్ట్

Crime News | జోగులాంబ గద్వాల జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కన్న కూతురిపై తండ్రి పలుమార్లు అత్యాచారం చేయగా బాలిక గర్భం దాల్చింది. నిందితుడితో పాటు మొదటి భార్యను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపై తండ్రే పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడు. ఈ అమానుషానికి నిందితుడి మొదటి భార్య కూడా సహకరించింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గద్వాల జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఒక వ్యక్తికి వివాహమైనా పిల్లలు కలగలేదనే కారణంతో,  మొదటి భార్య తన చెల్లెలితో భర్తకు రెండో వివాహం జరిపించింది. రెండో భార్యకు నలుగురు పిల్లలు జన్మించగా, కొన్నేళ్ళ తరువాత మొదటి భార్యకు సైతం ఇద్దరు సంతానం కలిగారు.

నిందితుడు తన రెండో భార్యకు పుట్టిన 16 ఏళ్ల మైనర్ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెదిరింపులకు పాల్పడి కన్నబిడ్డపైనే ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా, విషయం బయటపడకుండా ఉండేందుకు నిందితుడి మొదటి భార్య గుట్టుచప్పుడు కాకుండా బాధితురాలికి  అబార్షన్ చేయించింది. 

కొన్ని రోజులకు బాధిత బాలిక ఈ దారుణాన్ని స్థానికంగా ఉండే మరో మహిళకు వివరించడంతో, ఆమె వెంటనే బాలిక కన్నతల్లికి చెప్పింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై నిందితుడి రెండోభార్య, కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఆమె తండ్రితో పాటు ఆ దారుణానికి సహకరించిన మొదటి భార్యను సైతం అరెస్టు చేశారు.

ఇటువంటి అమానుష ఘటనలు జరిగినప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటారు
పోక్సో (POCSO) చట్టం: మైనర్లపై జరిగే లైంగిక వేధింపుల కేసులను 'ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్' (POCSO) చట్టం కింద పోలీసులు నమోదు చేస్తారు. దీని కింద నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదు లేదా కొన్ని సందర్భాలలో మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.

చైల్డ్ హెల్ప్ లైన్ (1098): పిల్లలపై వేధింపులు లేదా అన్యాయం జరుగుతున్నట్లు తెలిస్తే ఎవరైనా సరే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు. 

బాధితులకు భరోసా: ప్రభుత్వం ఇలాంటి బాధితులకు వైద్య సహాయంతో పాటు, 'సఖి' (One Stop Centre) కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ తో పాటు ఉచిత న్యాయ సహాయం అందిస్తుంది.

నేరానికి సహకరించడం: ఒక నేరం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపకుండా సహకరించినా (అబార్షన్ చేయడం వంటివి చేసినా), సమాచారం దాచిపెట్టినా వారిని కూడా చట్టం దృష్టిలో ప్రధాన నిందితులుగానే పరిగణించి చర్యలు తీసుకుంటారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
FBI Shuts India Call Centre: కాల్ సెంటర్ ఇక్కడ - దోచుకునేది మాత్రం అమెరికన్లను - వేల కోట్లు కొట్టేసిన ముఠాను పట్టేసిన FBI
కాల్ సెంటర్ ఇక్కడ - దోచుకునేది మాత్రం అమెరికన్లను - వేల కోట్లు కొట్టేసిన ముఠాను పట్టేసిన FBI
Attapur Kidnap: అత్తాపూర్ అమ్మాయి కిడ్నాప్ అంతా ఉత్తదే - ఇంత పని చేశారా?
అత్తాపూర్ అమ్మాయి కిడ్నాప్ అంతా ఉత్తదే - ఇంత పని చేశారా?
Hyderabad Airport Drug Bust: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజా పట్టివేత- స్మగ్లర్లు అంతా కవర్ చేశారు కానీ చిన్న తప్పు చేశారు !
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజా పట్టివేత- స్మగ్లర్లు అంతా కవర్ చేశారు కానీ చిన్న తప్పు చేశారు !

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu 2026 Theme: మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్! అరెస్టు ఖాయమంటున్న అభిజీత్! 
బొద్దింక పార్టీకి షాక్, కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత!
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
PoK Terrorist Killings: పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Vaddi Kaasula Vaada Glimpse : కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ - తండ్రిపై మంచు మనోజ్ సెటైర్!
కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ - తండ్రిపై మంచు మనోజ్ సెటైర్!
Bold Comedy Movie : అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
Embed widget