అన్వేషించండి
Telangana News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి- 25 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా మరో పథకం
Solar Pumps For Farmers: తెలంగాణలో రైతుల మోటార్లకు సోలార్ పంపుసెట్లు బిగించనున్నట్లు డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్ ఎనర్జిని విరివిగా వినియోగించుకుంటామన్నారు.

ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్న భట్టి విక్రమార్క
Source : X
Telangana News: తెలంగాణలో రైతుల మోటార్లకు సోలార్ పంపుసెట్లు(Solar Pump Sets) అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramaka) తెలిపారు. ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ చుట్టూ తిరుగుతోందని....కాబట్టి మనమూ దాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా 25 గ్రామాల్లో రైతులకు సోలార్ పంపుసెట్లు అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
రోజురోజుకు పెరుగుతున్న కర్బన్ ఉద్గారాలను నిరోధించడంతోపాటు ..విద్యుత్ డిమాండ్‌ను తగ్గించేందకు గ్రీన్‌ఎనర్జీని(Green Energy) వీలైనంత వరకు వాడుకోవాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. పొరుగు రాష్ట్రాలతోపాటు దేశం మొత్తం సోలార్(Solar Power), పవన్ విద్యుత్(Wind Power) వినియోగం దిశగా అడుగులు వేస్తోందన్న ఆయన.....తెలంగాణ(Telangana) సైతం గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో కొత్త ఎనర్జీ పాలసీనే తీసుకురాలేదని ఆయన విమర్శించారు. అలాగే దేశంలోనూ ఇంధనరంగానికి సంబంధించిన సరైన పాలసీ లేకపోవడంతో సోలార్,ఫ్లోటింగ్,పంప్ స్టోరేజ్, హైడ్రోజన్ పవర్ వంటి రకరకాలుగా గ్రీన్ ఎనర్జీ లభిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎనర్జీ పాలసీని తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు.
తెలంగాణలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం కానీ...భవిష్యత్‌లో తెలంగాణ విద్యుత్ డిమాండ్ 22,400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటిలో కల్పించాల్సిన మౌలిక వసతులకు తోడు...ఎత్తిపోతల పథకాలకు భారీగా విద్యుత్ అవసరం కానుందన్నారు. వచ్చే పదేళ్లలో పెరిగే అవసరాలను దృష్టిలో ఉంచుకుని 31వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు భట్టి వెల్లడించారు. 2035 కల్లా 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని వివరించారు. ఉచిత విద్యుత్ కోసమే ప్రతినెలా విద్యుత్‌శాఖకు రూ.148 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క....ఈ ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు విద్యుత్ డిమాండ్‌ను తగ్గించేందుకు రైతుల మోటార్లకు సోలార్ పంపుసెట్లు బిగిస్తున్నట్లు వెల్లడించారు.
TGNPDCL సంస్థలో ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఆయన హైదరాబాద్‌లో నియామకపత్రాలు అందజేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రత్యేకంగా దృష్టిసారించామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 56వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందజేసినట్లు భట్టి గుర్తు చేశారు. విద్య, మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. బీఆర్‌ఎస్(BRS) పాలనలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని....గ్రూప్ పరీక్షలంటేనే హాస్యాస్పందంగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నా...యువతకు కనీసం ఉపాధి కల్పించలేకపోయారని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించే....యువత కాంగ్రెస్ పక్షాన నిలిచిందని భట్టి విక్రమార్క అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్న ఆయన...క్రమం తప్పకుండా ఉద్యోగ క్యాలెండర్‌ను అనుసరించి ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రైవేట్‌రంగంలోనూ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. చదువుకున్న ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఉద్యోగం,ఉపాధి లభించేలా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Also Read: హైదరాబాద్లో రూ. 3,500 కోట్లతో ఏఐ బేస్డ్ డేటా సెంటర్ - రెండో రోజు సింగపూర్ లో పర్యటించిన సీఎం
ఇంకా చదవండి





















