The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
The Raja Saab : డార్లింగ్ ప్రభాస్, మారుతి కాంబో లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్' రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 3 గంటల్లోపే మూవీ ఉండనున్నట్లు సమాచారం.

Prabhas's The Raja Saab Movie Run Time Locked : మరో 5 రోజుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా... మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది.
3 గంటల్లోపే ప్రభాస్ మూవీ
'ది రాజా సాబ్' రన్ టైం 2 గంటల 55 నిమిషాలు అని తెలుస్తోంది. అయితే, దీనిపై మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది. సెన్సార్ రిపోర్ట్ తర్వాత ఫుల్ డీటెయిల్స్ వెల్లడి కానున్నట్లు సమాచారం. మూవీ రన్ టైం దగ్గరగా 3 గంటలు ఉందనే టాక్‌తో డైెరెక్టర్ మారుతి మ్యాజిక్ చేస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సంక్రాంతి మూవీ 3 గంటలంటే పెద్ద 'సాహసమనే చెప్పాలి' అంటూ తమ అభిప్రాయం చెబుతున్నారు.
Also Read : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
మరోవైపు, డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా డిఫరెంట్‌గా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ మూవీలో ప్రభాస్ రోల్‌తో పాటు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు. ఇదివరకు ఎన్నడూ చూడని రోల్‌లో ప్రభాస్‌ను చూడబోతున్నట్లు ఆయన చెప్పారు. ప్రతీ రోల్ చాలా స్పెషల్ అంటూ హైప్ క్రియేట్ చేశారు.
ఆ రోల్... మూవీకే టర్నింగ్ పాయింట్
ఈ సినిమాలో బొమ్మన్ ఇరానీది చాలా ఇంపార్టెంట్ రోల్ అని ఆయన మేకప్, స్క్రీన్ ప్రెజన్స్ చాలా వెరైటీగా ఉంటుందని చెప్పారు మారుతి. 'మూవీలో బొమ్మన్ ఇరానీ ఓ సైక్‌యాట్రిస్ట్ పాత్రలో నటించారు. ఈ రోల్ ఎంటర్ కాగానే మూవీ టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. మూవీలో ఆయన పాత్ర రాగానే హారర్ కామెడీ జానర్ నుంచి కథ ఊహకు కూడా అందని విధంగా ఉంటుంది. సినిమాలో ఆయన రోల్ 15 నుంచి 16 నిమిషాలు ఉంటుంది. ఆయన ఉన్నంత సేపు ఆడియన్స్ ఓ ట్రాన్స్‌లోకి వెళ్తారు.' అంటూ తెలిపారు.
𝐓𝐡𝐞 𝐋𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐓𝐡𝐞𝐑𝐚𝐣𝐚𝐒𝐚𝐚𝐛 - 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒 ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) January 2, 2026
This one’s all about the impact @BomanIrani is going to create 🔥#TheRajaSaab#TheRajaSaabOnJan9th #Prabhas
pic.twitter.com/QF1KUuQfXt
ఈ మూవీలో ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'రెబల్ సాబ్', 'సహనా సహనా'తో పాటు 'రాజే యువరాజే' పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది. ప్రభాస్ లుక్స్ దగ్గర నుంచి విజువల్స్ అద్భుతంగా చూపించారు. చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నానమ్మ, మనవడి మధ్య ఎమోషన్‌తో పాటు చనిపోయిన తర్వాత కూడా తన సంపద కోసం పాకులాడే తాత... వారసుడిగా ఆస్తి కోసం మనవడు ఏం చేశాడు? అనేదే స్టోరీ అని తెలుస్తోంది.
మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే వీటీవీ గణేష్, సప్తగిరి, బొమ్మన్ ఇరానీ, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 9న తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్‌గా 'ది రాజా సాబ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.






















