India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
భారత్ న్యూజీలాండ్ మధ్య త్వరలోనే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే సిరీస్ కోసం ప్లేయర్స్ ను సెలెక్ట్ చేయడం బీసీసీఐకు పెద్ద సవాలుగా మారింది. దాంతో ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఏ ప్లేయర్ వైపు మొగ్గు చూపుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ప్లేయర్స్ అందరు మంచి ఫార్మ్ లో ఆడుతున్నారు. బ్యాటింగ్ బౌలింగ్ తో ఎవరి టీమ్ తరపున వాళ్లు సత్తా చాటుతున్నారు. ఆలా టీమ్ సెలక్షన్ పై బీసీసీఐ చిక్కులో పడింది. అయితే విజయ్ హజారే ట్రోఫీలో ఫెయిల్ అవుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను ఈ సిరీస్ కు సెలెక్ట్ చేసే ఆలోచనలో లేదట. అలాగే పేసర్ మొహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.
గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్ కు పంత్ ను సెలెక్ట్ చేసినా ఒక్క మ్యాచ్ లోనూ ఆడే ఛాన్స్ దొరకలేదు. దానికి తోడు విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా విఫలమవుతున్నాడు. కాబట్టి అతని స్ధానంలో కీపర్ గా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ను సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో దేవదత్ పడిక్కల్ కు కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. శుబ్మన్ గిల్, రోహిత్, కొహ్లీ, యశస్వీ జైశ్వాల్ అందుబాటులో ఉండటంతో టాప్ ఆర్డర్ ఫుల్ గా కనిపిస్తోంది. దాంతో రుతురాజ్ గైక్వాడ్ ను కూడా జట్టులో తీసుకోవడం కష్టంగానే మారింది.





















