Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Akhanda 2 OTT Platform : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రీసెంట్ బ్లాక్ బస్టర్ 'అఖండ 2' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం.

Balakrishna's Akhanda 2 OTT Release Date Locked : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'అఖండ 2'. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాలు రానుండగా... ఓటీటీలోకి 'అఖండ 2' రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు మూవీ ఇదే అవుతుంది.
ఈ మూవీలో బాలయ్యతో పాటు సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయగా... పూర్ణ, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి అచంట మూవీని నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించారు. సనాాతన హైందవ ధర్మం, సామాజిక అంశాలతో పాటు ఆలయాల విశిష్టతను టచ్ చేస్తూ డైరెక్టర్ బోయపాటి మూవీని అద్భుతంగా రూపొందించారు.
Also Read : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మాస్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది - ఇద్దరు భామలతో రవితేజ మాస్ డ్యాన్స్
స్టోరీ ఏంటంటే?
టిబెట్ సరిహద్దుల్లో ఇండియా, చైనా ఆర్మీకి జరిగిన ఘర్షణల్లో చైనా ఆర్మీ జనరల్ (సంగే ఆల్ట్రామ్) కొడుకు చనిపోతాడు. దీంతో ఇండియాపై పగ సాధించాలన్న పంతంతో మన దేశ మూలాలు, భారతీయుల నమ్మకాల్ని దెబ్బకొట్టేలా ఓ విధ్వంసం ప్లాన్ చేస్తాడు. దీని కోసం ప్రధాని పదవిపై కన్నేసిన పొలీటిషియన్ అజిత్ ఠాకూర్ (కబీర్ సింగ్ దుహాన్)తో చేతులు కలుపుతాడు. ఇండియాపై బయో వార్ ప్లాన్ చేస్తాడు. ఎంతో ప్రతిష్టాత్మకమైన కుంభమేళాలో ఓ డేంజరస్ వైరస్ వ్యాపింపచేస్తాడు.
దీంతో కుంభమేళాలో స్నానం చేసిన వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. అయితే, DRDO సైంటిస్టులు దీనికి వెంటనే వ్యాక్సిన్ కనిపెడతారు. విషయం తెలుసుకున్న అజిత్ తన బలగంతో డీఆర్డీవోపై దాడికి దిగుతాడు. అందరినీ చంపేయగా ఆ వ్యాక్సిన్‌తో యంగ్ సైంటిస్ట్ జననీ (హర్షాలీ మల్హోత్రా) వారి నుంచి తప్పించుకుంటుంది. శత్రువులు ఆమెను వెంబడించగా రుద్ర సికిందర్ అఘోరా (బాలకృష్ణ) రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు. అసలు జననీకి రుద్ర సికిందర్ అఘోరాకు సంబంధం ఏంటి? అనంతపురం ఎమ్మెల్యేకు జననీకి సంబంధం ఏంటి? సనాతన హైందవ ధర్మాన్ని, గొప్పతనాన్ని రుద్ర ఎలా చాటిచెప్పారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















