Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Aadi Saikumar Son News: యంగ్ హీరో ఆది సాయికుమార్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య అరుణ శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చారు.

యువ కథానాయకుడు ఆది సాయి కుమార్ (Aadi Saikumar) కుటుంబం మరోసారి సంబరాలకు సిద్ధం అయ్యింది. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఆది కొత్త సినిమా 'శంబాల' ప్రశంసలతో పాటు వసూళ్లు సైతం సాధిస్తోంది. ఆ సినిమా సక్సెస్ ఆది కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు అంతకంటే సంతోషకరమైన వార్త ఆ కుటుంబానికి దక్కింది.
ఆది వారసుడు వచ్చాడు
'శంబాల' ప్రీ రిలీజ్ వేడుకలో ఆది తండ్రి, ప్రముఖ నటుడు సాయి కుమార్ ఒక మాట చెప్పారు. త్వరలో ఆది భార్య బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నారని, తమ ఇంట మరో చిన్నారి అడుగు పెట్టనుందని! జనవరి 2వ తేదీ శుక్రవారం ఆది భార్య అరుణ పండంటి మగ బిడ్డకు జన్మ ఇచ్చారు ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని సమాచారం అందింది.
'శంబాల' సినిమా విజయంతో సంతోషంగా ఉన్న సాయి కుమార్, ఆది కుటుంబానికి ఇప్పుడు తమ ఇంట వారసుడు అడుగు పెట్టిన విషయం మరింత సంతోషం ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆది - అరుణ దంపతులకు ఇప్పుడు జన్మించిన బిడ్డ రెండో సంతానం. ఇంతకు ముందు ఒక అమ్మాయి జన్మించింది.
View this post on Instagram
15 కోట్ల క్లబ్బులో సినిమా...
శంబాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
'శంబాల' సినిమాకు మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ లభించింది. ఆది రీసెంట్ సినిమాలలో చాలా బెటర్ ప్రొడక్ట్ అని విమర్శకులు తెలిపారు. ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ లభించింది. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా 16 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. 15 కోట్ల రూపాయల క్లబ్బులో చేరిన ఆది సినిమాగా రికార్డులకు ఎక్కింది. సంక్రాంతి వరకు ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.





















