అన్వేషించండి

Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్

Sibi Sathyaraj vs Divya Sathyaraj: తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ్ యాక్టర్ సత్యరాజ్. దళపతి విజయ్ విషయంలో ఆయన కుటుంబం రెండుగా చీలింది. బ్రదర్ & సిస్టర్ గొడవ మొదలైంది.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ సీనియర్ కథానాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ (Sathyaraj). ఆయన తనయుడు సిబి సత్యరాజ్ సైతం హీరోయే. తమిళంలో కొన్ని సినిమాలు చేశారు. తెలుగులో డబ్బింగ్ అయినా పెద్దగా ఆడలేదు. సిబి సత్యరాజ్ (Sibi Sathyaraj)కు ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడ పేరు దివ్య సత్యరాజ్ (Divya Sathyaraj). ఇప్పుడు సత్యరాజ్ సంతానం గురించి ఎందుకు? అంటే... వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. అదీ కుటుంబ ఆస్తులు లేదా పంపకాల విషయంలో కాదు! దళపతి విజయ్ విషయంలో! ఆ వివరాల్లోకి వెళితే... 

కట్టప్ప కుటుంబంలో గొడవ...
దళపతికి మద్దతుగా కొడుకు!
'బాహుబలి' సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిస కట్టప్పగా సత్యరాజ్ నటించారు. శివగామి, బాహుబలిపై అభిమానం చూపిస్తాడు కట్టప్ప. తమిళనాడులో దళపతి విజయ్ (Thalapathy Vijay)కు సిబి సత్యరాజ్ కూడా అంతే అభిమానం చూపిస్తున్నాడు. విజయ్ కోసం ఏకంగా సోదరిని విమర్శించారు. ఆ విషయంలోకి వెళితే... 

సత్యరాజ్ కుమార్తె దివ్య న్యూట్రిషనిస్ట్. అలాగే, సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందు నుంచి చురుగ్గా పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన దివ్య... గతేడాది (2025)లో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. టీవీకే పార్టీ స్థాపించిన విజయ్... రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెల్సిందే. డీఎంకే, టీవీకే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ తరుణంలో విజయ్ మీద విమర్శల వర్షం కురిపించారు దివ్య.

Also ReadShreyasi Sen - ABPDesam SmartED Conclave2026: సినిమాల్లో చూపించే ఆ రెండూ తప్పే - డాక్టర్ & యాక్టర్ శ్రేయాసి సేన్ ఇంటర్వ్యూ

విజయ్ విడాకుల గురించి వాడివేడి చర్చ జరుగుతోన్న నేపథ్యంలో వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడానని దివ్య సత్యరాజ్ తెలిపారు. అయితే... రాజకీయాల్లోకి వచ్చే ముందు ప్రజలకు విజయ్ ఏం చేశారో చెప్పాలని, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తన తల్లి పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి పేదలకు పోషకాహారం, టాబ్లెట్స్ వంటివి తాను అందించానని దివ్య సత్యరాజ్ చెప్పారు. విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు మహిళల గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నారని దుమ్మెత్తి పోశారు. 

Also ReadCockroach Telugu Movie: నేరస్తుడితో ప్రేమలో పడిన వేశ్య... బోల్డ్ కాన్సెప్ట్‌తో 'కాక్రోచ్' - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఏం చెప్పారంటే?

చెల్లికి కౌంటర్ ఇచ్చిన అన్నయ్య!
విజయ్ మీద దివ్య సత్యరాజ్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో... దళపతికి మద్దతుగా దివ్య అన్నయ్య, హీరో సిబి సత్యరాజ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేశారు. విజయ్ ఇచ్చిన విరాళాల గురించి ఓ వీడియో షేర్ చేశారు. దివ్య మాత్రమే కాదు... సత్యరాజ్ కూడా డీఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే... సిబి మాత్రం విజయ్ వీరాభిమాని. అందుకని, దళపతికి మద్దతు ఇస్తున్నారు.

Also Read: Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డీఎస్పీ?

టాప్ హెడ్ లైన్స్

Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget