అన్వేషించండి

Cockroach Telugu Movie: నేరస్తుడితో ప్రేమలో పడిన వేశ్య... బోల్డ్ కాన్సెప్ట్‌తో 'కాక్రోచ్' - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఏం చెప్పారంటే?

Director P Sunil Kumar Reddy: వాస్తవ కథలు తీసుకుని సహజత్వానికి దగ్గరగా సినిమాలు తెరకెక్కించే దర్శకులలో పి సునీల్ కుమార్ రెడ్డి ఒకరు. ఆయన తాజా సినిమా 'కాక్రోచ్' మార్చి 6న విడుదల కానుంది.

సమాజంలో జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనలే కథాంశాలుగా సినిమా తీసే దర్శకులు అరుదుగా ఉంటారు. అటువంటి ఫిల్మ్ మేకర్ పి సునీల్ కుమార్ రెడ్డి (Director P Sunil Kumar Reddy). 'సొంతూరు', 'గంగపుత్రులు', 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ', 'రొమాంటిక్ క్రిమినల్స్', 'ఒక రొమాంటిక్ ప్రేమ కథ', 'గల్ఫ్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కాక్రోచ్' (Cockroach Telugu Movie). మార్చి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి దర్శకుడు చెప్పిన విశేషాలు... 

  • నేను విశాఖలో విలేకరిగా పని చేసిన సమయంలో సొంతంగా ఓ పత్రిక నిర్వహించా. అప్పుడు పోలీసులు, నేరస్తులతో మాట్లాడేవాడిని. వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు ఎంతో ఆసక్తి కలిగించేవి. నేరస్తులతో కలిసి కొందరు పోలీసులు క్రైమ్స్ చేసేవారు. ఆ నేపథ్యంతో సినిమా రూపొందిస్తే బాగుంటుందని 'కాక్రోచ్' చేశా. నేరస్తులపై మనకు ఓ అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ జీవితాలను దగ్గరగా చూశాక నా అభిప్రాయం పూర్తిగా మారింది. ఎందుకంటే... డాక్టర్ చదివి వైద్య సేవ చేయాలనుకున్న వాళ్ళూ ఉన్నారు. కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో జరిగిన కొన్ని ఘటనల వల్ల నేరస్తులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తులే ఈ 'కాక్రోచ్'కు స్ఫూర్తి. 
  • సినిమాల్లో ఎక్కువగా మన సమాజంలోని పువ్వుల్లాంటి జీవితాలే చూపించారు. కానీ పూలమొక్క దగ్గర మట్టిని, పువ్వు చుట్టూ ఉండే ముళ్ళు లాంటి జీవితాలను ఎవరూ చూపించలేదు. 'కాక్రోచ్'లో వాటిని చూపించే ప్రయత్నం చేశా. కొందరు నేరస్తులు, వేశ్య మధ్య జరిగిన ప్రేమ కథతో 'కాక్రోచ్'ను బోల్డ్ & హార్డ్ హిట్టింగ్‌గా రూపొందించా. పిల్లలు, సున్నిత మనస్కుల కోసం సినిమా తీయలేదని ముందు నుంచి నేను, మా చిత్ర బృందం చెబుతున్నాం. సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది. మా మూవీని రివైజింగ్ కమిటీకి పంపించారు. అక్కడ నా దృక్పథం ఏమిటో స్పష్టంగా చెప్పాను. వేశ్య వృత్తిలో ఉన్న మహిళ తన ప్రొఫెషన్ గురించి గర్వంగా చెప్పుకుంటుందని నేను ఇచ్చిన వివరణ తర్వాత సర్టిఫికెట్ జారీ చేశారు.

Also ReadToxic Release Postponed: యశ్ 'టాక్సిక్' విడుదల వాయిదా... 'ధురంధర్ 2'కు లైన్ క్లియర్... అసలు రీజన్ ఏమిటంటే?

  • 'కాక్రోచ్'లో పాత్రలు భావోద్వేగాల పరంగా మాత్రమే కాదు... శారీరకంగా కూడా ధృడంగా ఉండాలి. అందుకని ఫైటర్లను నటులుగా పరిచయం చేస్తున్నా. ఫైటర్స్ అసోసియేషన్ నుంచి కొందరిని ఎంపిక చేసి మా సినిమాలో క్రిమినల్ పాత్రలకు ఎంపిక చేశాం. డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు చిన్న సినిమాల ముందున్న అతిపెద్ద సవాల్... థియేటర్లకు ప్రేక్షకుల రప్పించడం. అయితే కొన్ని సినిమాలు విజయాలు సాధించడంతో మాలో ధైర్యం వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందీ సినిమా. 
  • 'కాక్రోచ్' తర్వాత మరొక మూడు సినిమాలు లైనులో ఉన్నారు. మలయాళంలో నేను ఓ సినిమా చేశాను. అలాగే, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారికి మరో సినిమా చేశాను. అది విడుదలకు సిద్ధంగా ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ సినిమాకు వర్క్ చేశాను.

Also ReadChiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Embed widget