Toxic Release Postponed: యశ్ 'టాక్సిక్' విడుదల వాయిదా... 'ధురంధర్ 2'కు లైన్ క్లియర్... అసలు రీజన్ ఏమిటంటే?
Toxic New Release Date: మార్చి 19న థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేసిన రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' రిలీజ్ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వాయిదాకు గల కారణాన్ని వెల్లడించారు.

Yash Toxic New Release Date: పాన్ ఇండియా సక్సెస్ 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. మార్చి 19న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టు పబ్లిసిటీ కూడా స్టార్ట్ చేశారు. సినిమాలో మొదటి పాటను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడీ సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం.
మార్చి 19న కాదు... జూన్ 4న 'టాక్సిక్'
మార్చి 19న కాకుండా జూన్ 4వ తేదీన 'టాక్సిక్' సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ ఇవాళ అనౌన్స్ చేశాయి. దాంతో రణవీర్ సింగ్ 'ధురంధర్ 2'కు లైన్ క్లియర్ అయ్యింది.
'కేజీఎఫ్ '2 తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు 'ధురంధర్' విజయం తర్వాత ఆ సినిమా సీక్వెల్ 'ధురంధర్ 2' పైనా అంచనాలు ఉన్నాయి. మార్చి 19న రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో క్లాష్ అయితే ఏదో ఒక సినిమా కలెక్షన్స్ కాస్త తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావించాయి. ఇప్పుడు ఆ క్లాష్ తప్పింది. 'ధురంధర్ 2'కు లైన్ క్లియర్ అయ్యింది.
View this post on Instagram
'టాక్సిక్' వాయిదాకు కారణం ఏమిటి?
Reason For Toxic Release Postponement: ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ (ఇరాన్ - ఇజ్రాయెల్ కాన్‌ఫ్లిక్ట్ కారణంగా దుబాయ్, గల్ఫ్ వంటి దేశాల్లో) గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల, సినిమా మేజర్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ ఫారాస్ ఫిలిమ్స్ సినిమా విడుదలను వాయిదా వేయమని కోరడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు.
'టాక్సిక్' సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, తారా సుతారియా కథానాయికలు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాను ఆ రెండు భాషలతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















