అన్వేషించండి

Balakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

Telugu Movies Intresting Facts: ఒకే క‌థ‌తో బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ చేసిన సినిమాలు ఒకే రోజు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యాయి. అందులో ఎవరి సినిమా హిట్ అయ్యింది. ఆయా సినిమాలు ఏమిటి?రిజల్ట్ ఏమిటో తెలుసుకోండి.

Tollywood Flashback: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాల‌కృష్ణ‌, విక్టరీ వెంక‌టేష్‌... ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. రెండు తరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొన‌సాగుతోన్నారు. ఇద్ద‌రిలో బాల‌కృష్ణ మాస్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిస్తే... వెంక‌టేష్ ఫ్యామిలీ సినిమాలతో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. అయితే... వీళ్ళిద్దరూ ఒకే కథతో రెండు సినిమాలు చేశారు. ఆ రెండూ బాక్స్ ఆఫీస్ బరిలో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మరి, ఆయా సినిమాల రిజల్ట్ ఏమిటో తెలుసుకోండి. 

కథ ఒక్కటే... రిలీజ్ డేట్ కూడా!
బాక్సాఫీస్ బరిలో బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ త‌మ సినిమాల‌తో పోటీ ప‌డ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ క్లాష్‌లో ఇద్ద‌రూ విన్న‌ర్స్‌గా నిలిచిన సంద‌ర్భాలు సైతం ఉన్నాయి. అయితే ఓ సారి మాత్రం వీరిద్ద‌రి బాక్సాఫీస్ పోటీ కాస్త వివాదానికి దారి తీసింది. ఆ గొడవకు కారణం... ఇద్దరి సినిమాల్లో కథ ఒక్కటే కావడం! అందులో వెంక‌టేష్ సినిమా బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ అవ్వగా... బాల‌కృష్ణ మూవీ మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది.

ధ్రువ నక్షత్రం వర్సెస్ అశోక చక్రవర్తి!
బాల‌కృష్ణ హీరోగా న‌టించిన 'అశోక చ‌క్ర‌వ‌ర్తి' సినిమా జూన్ 29, 1989న విడుదల అయ్యింది. అదే రోజు వెంక‌టేష్ 'ధ్రువ‌ న‌క్ష‌త్రం' కూడా థియేట‌ర్ల‌లోకి వచ్చింది. విడుదలకు ముందు ఈ రెండు సినిమాల‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ మొదటి రోజు థియేట‌ర్ల‌లో 'అశోక చ‌క్ర‌వ‌ర్తి', 'ధ్రువ‌ న‌క్ష‌త్రం' సినిమాల‌ను చూసిన ఫ్యాన్స్ మాత్రం షాక్ అయ్యారు. అందుకు కారణం కథ. 

Also ReadHey Balwanth Review - 'హే బల్‌వంత్' రివ్యూ: సుహాస్ సినిమా హిట్టా? ఫట్టా? బిజినెస్ అంటూ చేసిన కామెడీ ఎలా ఉందంటే?

మలయాళ స్టార్ మోహ‌న్‌ లాల్ హీరోగా న‌టించిన 'ఆర్య‌న్' ఆధారంగా బాలయ్య 'అశోక చ‌క్ర‌వ‌ర్తి', వెంకటేష్ 'ధ్రువ‌ న‌క్ష‌త్రం' రూపొందాయి. అదీ అసలు సంగతి!

బాలయ్యది అఫీషియల్ రీమేక్...
వెంకటేష్ సినిమా మాత్రం స్ఫూర్తి!
మ‌ల‌యాళ సినిమా 'ఆర్యన్'కు బాలకృష్ణ 'అశోక చ‌క్ర‌వ‌ర్తి' అఫీషియ‌ల్ రీమేక్. 'ధ్రువ నక్షత్రం' రీమేక్ కాదు. 'ఆర్య‌న్' స్ఫూర్తితో తెర‌కెక్కించారు. ఓ సామాన్య యువ‌కుడు తాను చేయ‌ని నేరానికి జైలుకు వెళ్లి... అనుకోని ప‌రిస్థితుల్లో ముంబై మాఫియా  డాన్‌గా ఎలా మారాడు? అనేది రెండు సినిమాల్లో క‌థ‌.

ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో 'అశోక చ‌క్ర‌వ‌ర్తి' మొద‌లు అవుతుంది. సెంటిమెంట్‌కు ప్రాధాన్య‌ం ఇస్తూ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. ర‌విచంద్ర సినిమాను రూపొందించారు. 'ధ్రువ‌ న‌క్ష‌త్రం'ను స్టైలిష్ యాక్ష‌న్ సినిమాగా దర్శకుడు వై నాగేశ్వ‌ర‌రావు రూపొందించారు. కొన‌మెరుపు ఏమిటంటే... ఈ రెండు సినిమాల‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ, మాట‌లు అందించారు. రెండు సినిమాల కథ ఒక్కటేనని వాళ్లకు తెలిసినప్పటికీ బ‌య‌ట‌కు చెప్ప‌లేద‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వ‌చ్చాయి.

Also Read: Tollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

బాలకృష్ణ, వెంకటేష్ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా వస్తే బావుంటుందని అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చేస్తున్నారు. ఇటీవ‌ల బాల‌కృష్ణ‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వెంక‌టేష్ ప్ర‌క‌టించి స‌ర్‌ప్రైజ్ చేశారు. అయితే ఆ సినిమా ఏది? ఎప్పుడు వస్తుంది? అనేది మాత్రం వెంక‌టేష్ రివీల్ చేయ‌లేదు.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget