అన్వేషించండి

Tollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

Telugu Movies Interesting Facts: దర్శకుడిగా తొలి సినిమా ఎవరికైనా స్పెషల్. ఆ ఛాన్స్ చేతి వరకు వచ్చి మిస్సయితే? బాధను మాటల్లో వర్ణించలేం. కానీ, ఓ టాప్ డైరెక్టర్ సగం సినిమా తీశాక ఛాన్స్ పోగొట్టుకున్నారు.

ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్... అంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే క్రియేటివ్ పర్సన్స్ ఎంతో మంది. నటుడిగా కావచ్చు లేదా దర్శకుడిగా కావచ్చు లేదా మరొక క్రాఫ్ట్ ఏదైనా కావచ్చు... మొదటి సినిమా ఎప్పటికీ మధురమే. ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరిగిన తర్వాత వచ్చిన తొలి అవకాశం గురించి తర్వాత జీవితం అంతా గుర్తుంటుంది. అందుకే తొలి సినిమాకు ప్రాణం పెట్టేస్తారు. ఓ దర్శకుడు అలాగే ప్రాణం పెట్టి చేశారు. కానీ, బడ్జెట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో సగం సినిమా తీశాక ఆయన్ను పీకి పక్కన పెట్టారు. దాంతో అదే సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ కహానీలోకి వెళితే...

శిష్యుడికి రామ్ గోపాల్ వర్మ ఛాన్స్...
చివరకు వర్మ దర్శకత్వంలో విడుదల!
రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన పలువురు తర్వాత కాలంలో అగ్ర దర్శకులుగా ఎదిగారు. తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేసిన ఘనత కూడా వర్మకు ఉంది. అయితే... ఓ శిష్యుడికి దర్శకత్వ అవకాశం ఇచ్చిన వర్మ, ఆ సినిమాను చివరకు తానే పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ శిష్యుడి పేరు క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశీ. ఆ సినిమా పేరు అనగనగా ఒక రోజు.

కృష్ణవంశీ దర్శకత్వంలో మొదలైన సినిమా...
మధ్యలో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన గురువు!
జేడీ చక్రవర్తి, ఊర్మిళ జంటగా నటించిన సినిమా 'అనగనగా ఒక రోజు'. ఈతరం యువతకు ఈ సినిమా తెలుసో లేదో? మీమ్స్ & ట్రోల్స్, సోషల్ మీడియాలో హల్ చల్ చేసే కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా సినిమాలో ఉన్నారు. వీడియో 'నెల్లూరు పెద్దా రెడ్డి ఎవరో తెలీదా మీకు? ఐ వాంట్ టు టాక్ నెల్లూరు పెద్దా రెడ్డి రైట్ నౌ' వీడియో ఈ సినిమాలోనిదే.

'అనగనగా ఒక రోజు' పోస్టర్లు, సినిమా చూస్తే... దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పేరు ఉంటుంది. కానీ, సినిమా మొదలైంది మాత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో. అప్పట్లో బడ్జెట్ మీద అవగాహన లేక... సగం సినిమా తీసేసరికి ఫుల్ బడ్జెట్ ఫినిష్ చేశారు. అంతే కాదు... ఒక్క ఛేజ్ సీక్వెన్స్ 12 రోజులు షూట్ చేశారు. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న వర్మ... మధ్యలో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి అసలు విషయం తెలుసుకున్నారు. ''నీకు బడ్జెట్ మీద అవగాహన లేదు. సగం సినిమాకు మొత్తం అయిపోతే ఎలా? తర్వాత ఏం చేస్తావు? నీకు నేనెంత చెప్పినా అర్థం కావడం లేదు. రేపట్నుంచి నువ్వు రాకు. మిగతా సినిమా నేనే పూర్తి చేసుకుంటా'' అని కృష్ణవంశీకి చెప్పేశారు.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

వర్మ మాటలకు మొదట షాక్ తిన్న కృష్ణవంశీ... తర్వాత 'మీరు రావద్దని అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరు డైరెక్షన్ చేస్తారు కాబట్టి నేను మళ్ళీ అసిస్టెంట్ అవుతా. నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు' అని అడిగారు. వర్మ ఓకే అనడంతో అప్పటి వరకు 'యాక్షన్ కట్' చెప్పిన కృషవంశీ... తర్వాత రోజు నుంచి సహాయ దర్శకుడి పనులతో పాటు ప్రొడక్షన్ పనులు చూసుకున్నారు. హీరో హీరోయిన్లకు కార్లు, భోజనాల నుంచి హోటల్స్ వరకు అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. 'వీడి తిక్క కుదిరింది' అని కొందరు హేళన చేసినా ఆయన తట్టుకుని నిలబడ్డారు.

ఆ కృషవంశీయే దర్శకుడు అయ్యాక 'ఒక్క ఛాన్స్' అంటూ హీరోయిన్లు, హీరోల కష్టాలను 'ఖడ్గం'లో చూపించారు. కానీ, సహాయ దర్శకుల కష్టాలను మాత్రం ఏ సినిమాలోనూ చూపించలేదు.

'మనీ మనీ' అసలు డైరెక్టర్ కృష్ణవంశీయే
'అనగనగా ఒక రోజు' కంటే ముందు కృష్ణవంశీ మరో సినిమా డైరెక్ట్ చేశారు. అదే 'మనీ మనీ'. అయితే... ఆయనకు ఇష్టం లేక ఆ సినిమాకు పేరు వేసుకోలేదు. ఆ సినిమా చూశాక 'నిన్ను చూస్తే గర్వంగా ఉంది' అని వర్మ కాంప్లిమెంట్ ఇచ్చినా పేరును పక్కన పెట్టారు. దాంతో 'మనీ' డైరెక్ట్ చేసిన శివనాగేశ్వరరావు పేరును 'మనీ మనీ'కి కూడా దర్శకుడిగా వేశారు వర్మ. తర్వాత 'గులాబీ'తో దర్శకుడిగా మారారు కృష్ణవంశీ. ఆ సినిమా వర్మ తీసినట్టు ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో 'నిన్నే పెళ్ళాడతా' నుంచి తన స్టైల్ మార్చారు. కుటుంబ కథలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. దేశభక్తి సినిమాలు చేశారు. పాటలు తెరకెక్కించడంలో తన స్టైల్ చూపించారు.

Also ReadViral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AA22xA6 Movie Update : బన్నీ, అట్లీ మూవీలో సాంగ్స్ ఎన్నో తెలుసా? - యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ వర్క్స్
బన్నీ, అట్లీ మూవీలో సాంగ్స్ ఎన్నో తెలుసా? - యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ వర్క్స్
Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Allu Arjun: అల్లు అర్జున్ భార్యకు అదిరిపోయే గిఫ్ట్... మ్యారేజ్ డే స్పెషల్... స్నేహారెడ్డికి బన్నీ సర్ప్రైజ్!
అల్లు అర్జున్ భార్యకు అదిరిపోయే గిఫ్ట్... మ్యారేజ్ డే స్పెషల్... స్నేహారెడ్డికి బన్నీ సర్ప్రైజ్!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20I World Cup Final: టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Embed widget