Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
MS Dhoni IPL : కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీపై గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య తనదైన మార్క్ డైలాగ్స్‌తో ఇచ్చిన ఎలివేషన్ ట్రెండ్ అవుతోంది. మరి ఆ వీడియో మీరూ చూసెయ్యండి.

Balakrishna Elevation Dialogues About MS Dhoni : క్రికెట్ దిగ్గజం, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని... 45 ఏళ్ల వయసులో IPLకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ఐపీఎల్‌లో ఆయన జర్నీని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కెప్టెన్ కూల్‌ను ఉద్దేశించి మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. దీన్ని స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది.
బాలయ్య మార్క్ ఎలివేషన్
'15 ఏళ్ల క్రితం పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాల్లో ఓ సూర్యుడు ఉదయించాడు. ఆ నెంబర్ 7తో మనం కనెక్ట్ అయినప్పుడు మన జట్టులోకే కాదు. నేరుగా మన గుండెల్లోకే ప్రవేశించాడు. తన టాలెంట్ వల్లే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కూడా అతన్ని ఓడించలేకపోయింది. అతను వికెట్ల వెనుక మనం టీవీ సెట్స్ ముందు ఆటని నడిపించాం.
కొందరికి మహీ ఇంకొందరికీ కెప్టెన్ కూల్. తర్వాత మనందరికీ తలా అయ్యాడు. ఎవరు ఆటకు కొత్త ఊపిరి అందించారో, ఎవరు కోట్లాది మంది అభిమానుల్లో కొత్త క్రేజ్‌ను కలిగించారో ఆ కెప్టెన్ మన అభిమాన ఆటగాడు. మనందరికీ గర్వకారణమయ్యాడు. మనల్ని గెలిపించినవాడు, నవ్వించినవాడు. కానీ ఓటమిని అంగీకరించడం మాత్రం నేర్పలేదు. మన ప్రత్యర్థులు కూడా ఆయన అభిమానులే. ఈ లెక్కలేనన్ని క్షణాలు అందించినందుకు ధన్యవాదాలు తలా.' అంటూ ఎలివేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
Also Read : Chiranjeevi Kaaka : అనస్వర నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? - 'కాకా' నుంచి మరో చిరు లీక్
ట్రెండింగ్ వార్తలు




















