అన్వేషించండి

హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?

కొత్త Ultraviolette X-47 Venom, పాత Ultraviolette X-47 మధ్య బరువు, రేంజ్, స్పీడ్, ఫీచర్లు, వారంటీ, ధరల్లో తేడాలు తెలుసుకోండి.

New Ultraviolette X-47 Venom Details: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ 'అల్ట్రావయొలెట్', తన కొత్త హై-వోల్టేజ్ VX-100 ప్లాట్‌ఫామ్‌ను ఇటీవల పరిచయం చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన తొలి మోడల్ X-47 Venom. పాత X-47తో పోలిస్తే ఈ కొత్త మోటార్‌సైకిల్‌ బరువు తగ్గడంతో పాటు పెర్ఫార్మెన్స్‌, రేంజ్ కూడా మెరుగయ్యాయని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త బైక్‌లో మార్పులు కేవలం బ్యాటరీ, మోటార్‌కే పరిమితం కాలేదు. కొన్ని కొత్త ఫీచర్లు వచ్చాయి. వేరియంట్లు, ధరల్లోనూ మార్పులు జరిగాయి.

డిజైన్, మెకానికల్ విభాగాల్లో పెద్దగా మార్పుల్లేవు

పాత X-47 మోడల్‌లో ఉన్న స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌నే X-47 Venomలోనూ కొనసాగించారు. స్ప్రింగ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ 41mm USD ఫ్రంట్ ఫోర్క్, మోనోషాక్ సస్పెన్షన్ కూడా యథాతథంగా ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు 320mm డిస్క్, వెనుక 230mm డిస్క్ అందించారు.

టైర్ల పరిమాణాల్లోనూ మార్పు లేదు. ముందు 110/70 R17, వెనుక 150/60 R17 టైర్లు ఉన్నాయి. బరువు మినహా బైక్ కొలతలన్నీ పాత మోడల్ మాదిరిగానే ఉన్నాయి. వీల్‌బేస్ 1,385mm, సీట్ ఎత్తు 820mm, గ్రౌండ్ క్లియరెన్స్ 200mm.

కొత్త ప్లాట్‌ఫామ్‌తో బరువు తగ్గింది.. రేంజ్ పెరిగింది

X-47 Venomలో ప్రధానమైన మార్పు 100V VX-100 ఆర్కిటెక్చర్. ఇదే ప్లాట్‌ఫామ్‌ను రాబోయే Shockwave, Tesseract మోడళ్లలోనూ ఉపయోగించనున్నారు.

కంపెనీ చెప్పిన ప్రకారం, కొత్త SRB-11 బ్యాటరీ ప్యాక్ పాత SRB-10తో పోలిస్తే 15 శాతం తేలికగా ఉంటుంది. మోటార్ బరువు 25 శాతం, మోటార్ కంట్రోలర్ బరువు 40 శాతం తగ్గాయి. అంతేకాదు, పాత బ్యాటరీ స్థానంలో లిథియం-అయాన్ ఆక్సిలరీ బ్యాటరీని ఉపయోగించారు. దీంతో మరో 3 కిలోల బరువు తగ్గింది.

ఈ మొత్తం మార్పుల ఫలితంగా 11kWh బ్యాటరీ ఉన్న వెర్షన్‌ బరువు 13 కిలోలు తగ్గింది. 7.5kWh బ్యాటరీ ఉన్న వెర్షన్‌ ఏకంగా 17 కిలోల తగ్గింది.

ఇది కూడా చదవండి: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

X-47 Venom, X-47.. రేంజ్, స్పీడ్ పోలిక

వివరాలు X-47 Venom పాత X-47
కర్బ్ వెయిట్ 180kg (7.5kWh), 195kg (11kWh) 197kg (7.1kWh), 208kg (10.3kWh)
IDC రేంజ్ 227km (7.5kWh), 343km (11kWh) 211km (7.1kWh), 323km (10.3kWh)
0-100kph 5.9 సెకన్లు (రెండు వెర్షన్లు) 8.2 సెకన్లు (7.1kWh), 8.1 సెకన్లు (10.3kWh)
గరిష్ఠ వేగం 155kph 145kph

కొత్త మోడల్‌లో IDC రేంజ్ కూడా పెరిగింది. 11kWh వెర్షన్‌లో 20km, 7.5kWh వెర్షన్‌లో 16km అదనపు రేంజ్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. బరువు తగ్గడంతో పాటు పవర్ డెలివరీ మరింత సమర్థంగా మారడం వల్ల యాక్సిలరేషన్, గరిష్ఠ వేగం కూడా మెరుగయ్యాయి.

ఇది కూడా చదవండి: సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!

కొత్త ఫీచర్లు ఏవి?

రెండు మోడళ్లలోనూ డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు స్టాండర్డ్‌గా కొనసాగుతున్నాయి.

అయితే X-47 Venom టాప్ వేరియంట్లలో మూడు ముఖ్యమైన ఫీచర్లు కొత్తగా వచ్చాయి. అవి.. క్రూయిజ్ కంట్రోల్, కెమెరా ఆధారిత పార్కింగ్ అసిస్టెన్స్, వెనుక ABSను ఆఫ్ చేసుకునే సదుపాయం. వీటితో పాటు పాత 5-అంగుళాల డిస్‌ప్లే స్థానంలో పెద్ద 7-అంగుళాల TFT స్క్రీన్ ఇచ్చారు. 

ఈ 7-అంగుళాల TFT డిస్‌ప్లే నాలుగు వేరియంట్లలోనూ స్టాండర్డ్‌గా ఉంటుంది. ఇది ఇప్పుడు Qualcomm సిస్టమ్, Android OS ఆధారంగా పనిచేస్తుంది. పాత మోడల్‌లో అల్ట్రావయొలెట్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. క్రూయిజ్ కంట్రోల్, కెమెరా పార్కింగ్ అసిస్టెన్స్, స్విచబుల్ రియర్ ABS మాత్రం టాప్ మూడు వేరియంట్లకే పరిమితం.

మరో ముఖ్యమైన మార్పు UV Hypersense రాడార్ టెక్నాలజీ విషయంలో కనిపిస్తుంది. పాత X-47లో ఆరు వేరియంట్లలో ఐదింటికి ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. కొత్త Venomలో మాత్రం టాప్-2 వేరియంట్లు Recon, Recon+లకు మాత్రమే పరిమితం చేశారు.

ఇతర ఫీచర్లలో పెద్దగా మార్పుల్లేవు. 7.5kWh, 11kWh వెర్షన్లలోని '+' వేరియంట్లకే ఆన్‌బోర్డ్ ఛార్జర్ లభిస్తుంది. టాప్ Recon+ వేరియంట్‌లో ముందు, వెనుక డాష్‌క్యామ్‌లు, Violette A.I, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) స్టాండర్డ్‌గా ఉంటాయి.

వారంటీ వివరాలు

ఎంట్రీ లెవల్ వేరియంట్‌కు బ్యాటరీ, డ్రైవ్‌ట్రెయిన్‌పై 3 ఏళ్లు లేదా 60,000km వారంటీ అందిస్తున్నారు. మిగతా వేరియంట్లకు 5 ఏళ్లు లేదా 1,00,000km వారంటీ ఉంటుంది. అదనంగా 8 ఏళ్లు లేదా 8,00,000km వారంటీని ఆప్షనల్ అప్‌గ్రేడ్‌గా పొందవచ్చు. వాహనానికి ఇచ్చే వారంటీ మాత్రం 3 ఏళ్లు లేదా 30,000kmగా మార్పులేకుండా కొనసాగుతోంది.

ధరలు

కొత్త X-47 Venom ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.65 లక్షలు. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త Venomలో టాప్ వేరియంట్ మినహా మిగతా వేరియంట్ల ధరలు రూ.16,000 వరకు పెరిగాయి.

కొత్త X-47 Venom వేరియంట్ పాత X-47 వేరియంట్
బేస్ వెర్షన్: అందుబాటులో లేదు X-47: రూ.2.49 లక్షలు
Venom: రూ.2.65 లక్షలు Original: రూ.2.64 లక్షలు
Venom+: రూ.3.15 లక్షలు Original+: రూ.3.09 లక్షలు
Venom Recon: రూ.3.75 లక్షలు Recon: రూ.3.59 లక్షలు
Venom Recon+: రూ.4 లక్షలు Recon+: రూ.4.09 లక్షలు
అందుబాటులో లేదు Desert Wing: రూ.4.59 లక్షలు

ప్రస్తుతం ప్రకటించిన ధరలు తొలి 5,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తించే పరిచయ ధరలు. ఆ తర్వాత ప్రతి వేరియంట్ ధరను రూ.35,000 పెంచుతామని కంపెనీ తెలిపింది.

ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ప్రకటించిన ధరలు Cosmic Black కలర్‌కు మాత్రమే వర్తిస్తాయి. Turbo Red కోసం అదనంగా రూ.4,500, Stellar White కోసం రూ.7,500, Afterburner Yellow కోసం రూ.12,500 చెల్లించాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget