అన్వేషించండి

సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!

Kia Syros EV 51.4 kWh లాంగ్ రేంజ్ వెర్షన్ రియల్ వరల్డ్ టెస్ట్‌లో 400 కి.మీ. పైగా సగటు రేంజ్ ఇచ్చింది. సిటీ, హైవే సామర్థ్యం, ఛార్జింగ్ వివరాలు తెలుసుకోండి.

Kia Syros EV real range: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారికి, "సింగిల్‌ ఛార్జ్‌తో ఎంతదూరం ప్రయాణించగలదు" (రేంజ్) అనేది చాలా ముఖ్యమైన అంశం. కంపెనీలు ప్రకటించే రేంజ్‌కు, రోజువారీ ప్రయాణంలో వచ్చే నిజమైన రేంజ్‌కు మధ్య తేడా ఉండొచ్చు. అందుకే, ఎక్స్‌పర్ట్‌లు Kia Syros EV లాంగ్ రేంజ్ వెర్షన్‌ను రియల్ వరల్డ్ పరిస్థితుల్లో పరీక్షించారు. 51.4 kWh బ్యాటరీతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV నగరంలో ఎంత మైలేజ్ ఇచ్చింది? హైవేపై ఎంత దూరం ప్రయాణించింది? పూర్తి ఛార్జింగ్‌కు ఎంత సమయం పట్టింది? తెలుసుకుందాం.

Kia Syros EVలో 42 kWh, 51.4 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. రెండింటిలోనూ నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC) సెల్ టెక్నాలజీని ఉపయోగించారు. చిన్న బ్యాటరీ వెర్షన్ ధర రూ.13.50 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఉంది. పెద్ద బ్యాటరీతో వచ్చే లాంగ్ రేంజ్ వేరియంట్ల ధర రూ.17 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు.

 Kia Syros EV రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్

51.4 kWh బ్యాటరీతో వచ్చే Syros EVలో ముందు యాక్సిల్‌కు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 171 hp శక్తి, 255 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కిలోమీటర్ల MIDC రేంజ్ ఇస్తుందని Kia ప్రకటించింది.

ఈ కారులో Eco, Normal, Sport అనే మూడు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. రీజెనరేటివ్ బ్రేకింగ్ కోసం L0, L1, L2, L3, i-Pedal అనే ఐదు సెట్టింగులు అందించారు. i-Pedal మోడ్‌లో ఒకే పెడల్‌తో వేగాన్ని పెంచడం, తగ్గించడం సాధ్యమవుతుంది. ఎక్స్‌పర్ట్‌లు రేంజ్ పరీక్ష సమయంలో కారును పూర్తిగా Eco మోడ్‌లో నడిపారు.

ఇది కూడా చదవండి: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!

నగరంలో రీజెన్ సెట్టింగ్‌ను L3లో ఉంచినప్పుడు Syros EV సామర్థ్యం కిలోవాట్‌ అవర్‌కు ‍‌(kWh) 9.52 km ఇచ్చింది. ఈ సామర్థ్యం ఆధారంగా, పూర్తి ఛార్జ్‌పై సుమారు 489 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని అంచనా వేశారు. అదే హైవేపై రీజెన్ సెట్టింగ్‌ను L1లో ఉంచినప్పుడు సామర్థ్యం 6.14 km/kWhకు పడిపోయింది. దీంతో అంచనా రేంజ్ 316 కిలోమీటర్లుగా నమోదైంది. హైవేపై విద్యుత్ వినియోగం పెరగడానికి (రేంజ్‌ తగ్గడానికి) కారు బాక్సీ డిజైన్ ఒక కారణం కావచ్చని పరీక్ష నివేదిక పేర్కొంది.

నగరం, హైవే ప్రయాణాల సగటు సామర్థ్యం 7.83 km/kWhగా నమోదైంది. దీని ప్రకారం 51.4 kWh బ్యాటరీతో పూర్తి ఛార్జ్‌పై వాస్తవ పరిస్థితుల్లో సుమారు 402 కిలోమీటర్ల రేంజ్ ఆశించవచ్చు.

 Kia Carens Clavis EVతో పోలిస్తే ఎలా ఉంది?

Kia Carens Clavis EVలోనూ ఇదే 51.4 kWh బ్యాటరీ ఆప్షన్ ఉంది. అయితే Syros EV నగర ప్రయాణాల్లో మరింత మెరుగైన సామర్థ్యాన్ని చూపించింది. సిటీలో Carens Clavis EVతో పోలిస్తే సుమారు 100 కిలోమీటర్ల అదనపు రేంజ్ అందిస్తుంది. కానీ హైవేపై మాత్రం Syros EV వెనుకబడింది. అక్కడ Carens Clavis EVతో పోలిస్తే సుమారు 30 కిలోమీటర్ల తక్కువ రేంజ్ ఇస్తుంది. అంటే నగర ప్రయాణాలకు Syros EV మరింత సమర్థవంతంగా పనిచేస్తుండగా, హైవేపై పరిస్థితి భిన్నంగా ఉంది.

 ఛార్జింగ్‌కు ఎంత సమయం పడుతుంది?

100 kW DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి 39 నిమిషాలు పడుతుందని Kia చెబుతోంది.

పరీక్షలో 480 kW DC ఫాస్ట్ ఛార్జర్‌కు కారును కనెక్ట్ చేసి 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ సమయాన్ని పరిశీలించారు. ఈ పరీక్షలో 35 నిమిషాల్లో 60 శాతం ఛార్జింగ్ పూర్తయింది. గరిష్ఠ ఛార్జింగ్ వేగం సుమారు 75.2 kWగా నమోదైంది.

బ్యాటరీ ఛార్జ్ 68 శాతానికి చేరిన తర్వాత ఛార్జింగ్ వేగం గణనీయంగా తగ్గింది. 80 శాతం నుంచి 100 శాతానికి చేరుకోవడానికి మరో 49 నిమిషాలు పట్టింది. అందువల్ల చివరి 20 శాతం ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Scorpio N, Tata Safari, XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల పూర్తి పోలిక!

 రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్ ఎలా నిర్వహించారు?

పరీక్ష ప్రారంభించే ముందు కారును పూర్తిగా ఛార్జ్ చేశారు. టైర్లలో గాలి ఒత్తిడిని కంపెనీ సూచించిన స్థాయిలో ఉంచారు. ముంబై నగర రోడ్లు, సమీపంలోని రాష్ట్ర రహదారిపై నిర్ణీత మార్గంలో కారును నడిపారు. పరీక్ష సమయంలో సగటు వేగాన్ని కూడా స్థిరంగా ఉంచారు. ప్రతి ప్రయాణం ముగిసిన తర్వాత ఎంత శాతం బ్యాటరీ ఖర్చయిందో లెక్కించి రేంజ్‌ను అంచనా వేశారు.

క్లైమేట్ కంట్రోల్‌ను 22 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫుల్ ఆటో మోడ్‌లో ఉంచారు. ఆడియో సిస్టమ్, ఇండికేటర్లు వంటి ఇతర ఎలక్ట్రికల్ ఫీచర్లను సాధారణ వినియోగదారుడు ఉపయోగించినట్లుగానే అవసరమైనప్పుడు వాడారు.

మొత్తంగా చూస్తే.. Kia Syros EV లాంగ్ రేంజ్ వెర్షన్‌కు కంపెనీ ప్రకటించిన MIDC రేంజ్ 526 కిలోమీటర్లు. కానీ ఈ రియల్ వరల్డ్ పరీక్షల ఆధారంగా సగటున 402 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆశించవచ్చు. నగరంలో రేంజ్ మెరుగ్గా ఉండగా, హైవేపై గణనీయంగా తగ్గుతోంది. కాబట్టి ఎక్కువగా నగరంలో ప్రయాణించేవారికి ఈ కారు మంచి ఎంపికగా కనిపిస్తుంది. తరచూ హైవే ప్రయాణాలు చేసేవారు మాత్రం వాస్తవ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఛార్జింగ్ ప్రణాళిక చేసుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
Scorpio N, Tata Safari, XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల పూర్తి పోలిక!
Scorpio N వర్సెస్‌ Tata Safari వర్సెస్‌ XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీకు ఏది బెస్ట్?
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
Rodent Attacks: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? రూ.వేల రిపేర్‌ ఖర్చు తప్పించుకోవాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!
కారు ఇంజిన్‌లోకి ఎలుకలు వెళ్తున్నాయా? స్ప్రే నుంచి స్టీల్ మెష్ వరకు.. రక్షణకు 5 మార్గాలు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget