అన్వేషించండి

Rodent Attacks: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? రూ.వేల రిపేర్‌ ఖర్చు తప్పించుకోవాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

Rat Damage Car Wiring: కారు ఇంజిన్‌లో ఎలుకలు వైర్లు, రబ్బర్ పైపులు కొరకకుండా ఉండేందుకు ర్యాట్ రిపెల్లెంట్ స్ప్రేలు, అల్ట్రాసోనిక్ పరికరాలు, స్టీల్ మెష్ వంటి చిట్కాలు తెలుసుకోండి.

Car Engine Protection From Rats: కారు స్టార్ట్ చేయగానే స్టార్టర్ నుంచి బలహీనమైన శబ్దం రావడం, డ్యాష్‌బోర్డుపై చెక్ ఇంజిన్ లైట్ వెలగడం, యాక్సిలరేటర్ సరిగా స్పందించకపోవడం.. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం రావచ్చు. కొన్ని సందర్భాల్లో, ఈ సమస్యలకు కారణం ఇంజిన్‌లో ఎలుకలు చేసిన పనై ఉండొచ్చు. కారు బానెట్ తెరిచి చూస్తే వైర్లపై ఉన్న ప్లాస్టిక్ కవరింగ్ కొరికేసి ఉండటం, రబ్బర్ పైపులు దెబ్బతినడం, బ్యాటరీ దగ్గర ఎలుకల రెట్టలు కనిపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి.

కారు ఇంజిన్ వైరింగ్ హార్నెస్ పూర్తిగా మార్చాల్సి వస్తే రూ.25,000 నుంచి రూ.1.20 లక్షలకు పైగా ఖర్చు కావచ్చని అంచనా. ఎలుకల వల్ల జరిగిన నష్టానికి మీ కారు బీమా పాలసీ వర్తిస్తుందా, లేదా అనే అంశంపైనా సందేహం రావచ్చు. అందుకే, సమస్య వచ్చిన తర్వాత సతమతమయ్యే కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఎలుకలు కారు వైర్లనే ఎందుకు కొరుకుతాయి?

ఎలుకల ముందు పళ్లు నిరంతరం పెరుగుతుంటాయి. ఆ పళ్లు మరీ పొడవుగా పెరగకుండా ఉండేందుకు అవి రబ్బర్, ప్లాస్టిక్, ఫోమ్ వంటి మెత్తని వస్తువులను తరచూ కొరుకుతుంటాయి. కారు ఇంజిన్‌లో ఉండే వైర్లపై ప్లాస్టిక్ కవరింగ్, రబ్బర్ గొట్టాలు వాటికి అనుకూలంగా కనిపిస్తాయి.

ఇంకో కారణం.. ఇంజిన్ నుంచి వచ్చే వేడి. సాయంత్రం కారు పార్క్ చేసిన తర్వాత కూడా ఇంజిన్ కొంతసేపు వెచ్చగా ఉంటుంది. ముఖ్యంగా చల్లని రాత్రివేళల్లో ఈ ప్రాంతం ఎలుకలకు సురక్షితమైన ఆశ్రయంగా మారుతుంది. అక్కడే గూడు ఏర్పాటు చేసుకుని, వైర్లు కొరకడం మొదలుపెడతాయి.

కారు వైర్లను ఎలుకల నుంచి కాపాడే 5 మార్గాలు

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులతో బైక్‌పై ప్రయాణిస్తున్నారా? వెనుక కూర్చునేవారికి సౌకర్యవంతమైన సీట్‌ ఉన్న 5 బైక్స్

1. చేదుగా ఉండే ర్యాట్ రిపెల్లెంట్ స్ప్రే

ఎలుకలు వైర్లు కొరకకుండా అడ్డుకోవడానికి ఆటోమోటివ్ ర్యాట్ రిపెల్లెంట్ స్ప్రేలు ఉపయోగపడతాయి. వీటిలో డెనటోనియం బెంజోయేట్ వంటి తీవ్రమైన చేదు రుచి కలిగించే పదార్థాలు ఉంటాయి. వైర్లు, రబ్బర్ పైపులు, ప్లాస్టిక్ భాగాలపై స్ప్రే చేసినప్పుడు పలుచని పొర ఏర్పడుతుంది. దానిని కొరకడానికి ప్రయత్నించిన ఎలుకలకు చేదు రుచి తగిలి వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది.

ఈ స్ప్రే వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా ఇంజిన్ బేలోని దుమ్ము, ఆయిల్ మరకలను శుభ్రం చేయాలి. ఇంజిన్ పూర్తిగా చల్లారిన తర్వాతే స్ప్రే చేయాలి. బయటకు కనిపించే వైర్లు, రబ్బర్ పైపులపై ఉపయోగించాలి. ఎలక్ట్రికల్ కనెక్షన్లు, సెన్సార్లు, వేడెక్కే భాగాలపై నేరుగా స్ప్రే చేయకూడదు. స్ప్రే పూర్తిగా ఆరిన తర్వాతే కారును స్టార్ట్ చేయాలి. సాధారణంగా రెండు, మూడు నెలలకు ఒకసారి లేదా భారీ వర్షాల తర్వాత మళ్లీ వాడాల్సి రావచ్చు. అయితే, తయారీ సంస్థ సూచనలకు కచ్చితంగా ప్రాధాన్యం ఇవ్వాలి.

2. అల్ట్రాసోనిక్ పరికరాలు, ఫ్లాషింగ్ లైట్లు

వర్షాకాలంలో స్ప్రేలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అల్ట్రాసోనిక్ ర్యాట్ రిపెల్లెంట్ పరికరాలను అదనపు రక్షణగా ఉపయోగించవచ్చు. ఇవి కారు 12V బ్యాటరీకి కనెక్ట్ అవుతాయి లేదా ప్రత్యేక రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తాయి.

సాధారణంగా 20 kHz నుంచి 65 kHz పరిధిలో అధిక ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలను విడుదల చేస్తాయి. ఇవి మనుషులకు వినిపించకపోయినా ఎలుకలను ఇబ్బంది పెడతాయని కంపెనీలు చెబుతుంటాయి. కొన్ని పరికరాల్లో LED ఫ్లాషింగ్ లైట్లు కూడా ఉంటాయి. అయితే వీటి ప్రభావం అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. కొంతకాలానికి, ఆ లైటింగ్‌కు ఎలుకలు అలవాటు పడే అవకాశం ఉంది.

పరికరం కొనేటప్పుడు 12V బ్యాటరీ రక్షణ ఫీచర్ ఉందో లేదో చూడాలి. బ్యాటరీ వోల్టేజ్ తగ్గినప్పుడు పరికరం ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే సదుపాయం ఉంటే మంచిది. కొన్ని మోడళ్లలో, 11.8V కంటే తక్కువకు పడిపోయినప్పుడు ఆఫ్ అయ్యే ఫీచర్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక

3. స్టెయిన్‌లెస్ స్టీల్ వైర్ మెష్ ఏర్పాటు

ఎలుకలు కారు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి భౌతిక రక్షణ కూడా అవసరం. ఏసీకి గాలి అందించే ఫ్రెష్ ఎయిర్ ఇన్‌టేక్, ఇంజిన్ ఎయిర్ ఇన్‌టేక్ వంటి ప్రాంతాల నుంచి ఎలుకలు లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత క్యాబిన్ ఫిల్టర్, ఎయిర్ డక్ట్స్, డ్యాష్‌బోర్డు వెనుక ఉండే వైర్లను కొరకవచ్చు.

ఈ ప్రవేశ మార్గాల వద్ద మంచి స్టెయిన్‌లెస్ స్టీల్ వైర్ మెష్ ఏర్పాటు చేయవచ్చు. దీనిని సాధారణంగా ర్యాట్ మెష్ లేదా వైర్ జాలి అంటారు. మెష్ అమర్చేటప్పుడు ఏసీ గాలి ప్రవాహం, ఇంజిన్‌కు అవసరమైన గాలి సరఫరా, డ్రైనేజ్ మార్గాలు అడ్డంకి కాకుండా చూసుకోవాలి.

4. సహజ నివారణ పద్ధతులు.. పొగాకు, పుదీనా నూనె

కొంతమంది కారు యజమానులు సహజ పద్ధతులను కూడా ప్రయత్నిస్తుంటారు. ముడి పొగాకు ఆకులను చిన్న గుడ్డ సంచుల్లో ఉంచి ఇంజిన్ బేలో ఎలుకలు తిరిగే ప్రాంతాలకు దగ్గరగా పెడతారు. అలాగే పుదీనా ఎసెన్షియల్ ఆయిల్‌ను దూది ఉండలపై వేసి ఇంజిన్ బే మూలల్లో ఉంచుతారు. వీటి వాసన ఎలుకలను కొంతకాలం దూరంగా ఉంచవచ్చని భావిస్తారు. అయితే వీటి ప్రభావంపై బలమైన శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. కొన్ని రోజులకు వాసన తగ్గిపోవడంతో మళ్లీ ఉపయోగించాల్సి రావచ్చు.

ముఖ్యంగా, నాఫ్తలీన్ బాల్స్‌ను మాత్రం ఇంజిన్ బేలో ఎక్కడపడితే అక్కడ వేయకూడదు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇవి కరిగే అవకాశం ఉండటంతో పాటు మండే ప్రమాదం, విషపూరిత వాయువుల సమస్యలు తలెత్తవచ్చు. ఏసీ గాలి ద్వారా ఆ వాసనలు క్యాబిన్‌లోకి చేరే ప్రమాదం కూడా ఉంది.

5. ఇంజిన్ బే శుభ్రత, పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు

ఎలుకల బెడద తగ్గించడంలో కారు పార్కింగ్ చేసే ప్రదేశం, శుభ్రత కూడా కీలకం. కారులో బిస్కెట్ ప్యాకెట్లు, తినుబండారాల ముక్కలు, చాక్లెట్ రేపర్లు వదిలేయకూడదు. ఫ్లోర్ మ్యాట్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

చెత్తకుండీలు, కూరగాయల మార్కెట్లు, మురుగు కాలువల దగ్గర కారు పార్క్ చేయకుండా ఉండటమే మంచిది. వీలైనంత వరకు.. వెలుతురు ఉండే, పరిశుభ్రమైన, కాస్త విశాలమైన ప్రదేశంలో పార్క్ చేయాలి. ఇంజిన్ బేలో ఎలుకల రెట్టలు లేదా అడుగుల గుర్తులు కనిపిస్తే వెంటనే శుభ్రం చేయించాలి. ఎలుకలు వదిలిన మూత్రం, వాసనలు వంటివి ఇతర ఎలుకలను కూడా ఆకర్షించే అవకాశం ఉంటుంది.

మీ కారుకు ఏ పద్ధతి మంచిది?

రోడ్డు పక్కన, ఆహార దుకాణాలు లేదా మురుగు కాలువల దగ్గర తరచూ కారు పార్క్ చేస్తుంటే ఒక్క నివారణ పద్ధతిపై ఆధారపడకూడదు. నిపుణుల సూచనతో రిపెల్లెంట్ స్ప్రేలు, అవసరమైన చోట స్టీల్ మెష్ వంటి పద్ధతులను కలిపి ఉపయోగించవచ్చు. అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ పార్కింగ్‌లో కారును ఉంచేవారు ఏసీ ఇన్‌టేక్ ప్రాంతాన్ని తనిఖీ చేయించుకోవాలి.

ఎలుకలు కొరికిన వైర్లు షార్ట్ సర్క్యూట్‌కు, ఆకస్మిక విద్యుత్ సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ప్రతి వారం బానెట్ తెరిచి ఇంజిన్ బేను ఒకసారి పరిశీలించండి. సమస్య కనిపిస్తే వైర్లను మీరే మరమ్మతు చేయకుండా నిపుణులైన మెకానిక్‌ను సంప్రదించండి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే భారీ రిపేర్ ఖర్చును తగ్గించుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Child Seat Mounts: ఫ్యామిలీ కార్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలోనే కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చే కార్ల లిస్ట్‌
కారు ప్రయాణంలో మీ పిల్లల భద్రతకు భరోసా.. తక్కువ ధరలోనే 6 ఎయిర్‌బ్యాగ్స్, ISOFIX ఉన్న కార్లు
EV Charger: ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్‌కు ఎంత కెపాసిటీ ఛార్జర్ కావాలి? కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఇంట్లోనే EV ఛార్జర్... 3.3 kW, 7.2 kW, 11 kWలో మీ కారుకు ఏది సరిపోతుందో తెలుసుకోండి
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
భారత్‌లో తిరిగే కార్లన్నీ మన దేశానికి చెందినవి కావు.. ఏ కారు ఏ దేశానిదో తెలుసా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Embed widget