అన్వేషించండి

Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'

Denza D9 ఎలక్ట్రిక్ లగ్జరీ ఎంపీవీ భారత్‌లో రూ.90 లక్షలకు విడుదలైంది. 730 కి.మీ. రేంజ్, 7 సీట్లు, 115.07 kWh బ్యాటరీ, విలాసవంతమైన ఫీచర్ల వివరాలు.

Denza D9 launched: లగ్జరీ కార్ల మార్కెట్‌లో మరో కొత్త పేరు అడుగుపెట్టింది. చైనా కంపెనీ BYDకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Denza, భారత్‌లోకి తన తొలి మోడళ్లుగా D9 ఎలక్ట్రిక్ MPV, Z9 GTలను తీసుకొచ్చింది. వీటిలో D9 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విలాసవంతమైన ప్రయాణం కోరుకునే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీని డిజైన్‌ చేసింది. ఇండియాలో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.90 లక్షలు. పూర్తిగా తయారైన యూనిట్‌గా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ కారును ఒకే ఒక్క ఫుల్ లోడెడ్ వేరియంట్‌లో అందిస్తున్నారు. దీనిలోని విలాసవంతమైన ఫీచర్ల గురించి తెలుసుకుంటే, కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి కారు అని అనిపిస్తుంది.

ఈ కారులో, 115.07 kWh భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 730 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.10 లక్షల టోకెన్ మొత్తంతో కారును బుక్ చేసుకోవచ్చు.

 Denza D9లో ప్రధాన ఆకర్షణలు ఇవే

ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీలో ముందు యాక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 462 hp శక్తి, 365 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 8.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది.

రెండో, మూడో వరుస ప్రయాణికుల కోసం పవర్డ్ స్లైడింగ్ డోర్లు ఉన్నాయి. ఒక్క బటన్ నొక్కి ద్వారా లేదా సెన్సార్ సాయంతో వీటిని తెరవవచ్చు. వెనుక భాగంలో మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ టెయిల్‌గేట్ కూడా ఉంది. ఒకసారి తెరిచిన ఎత్తును గుర్తుంచుకునే సదుపాయం ఇందులో ఇచ్చారు. యాంటీ పించ్ ఫీచర్ కూడా ఉంది.

 బయటి డిజైన్ ఎలా ఉంది?

Denza D9 ముందు భాగం నిటారుగా, భారీగా కనిపిస్తుంది. పెద్ద గ్రిల్‌పై నిలువు క్రోమ్ పట్టీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. U ఆకారపు LED DRLsతో హెడ్‌ల్యాంప్స్‌ను రూపొందించారు. గ్రిల్‌కు ఇరువైపులా సన్నని లైటింగ్ స్ట్రిప్స్ ఉంటాయి. బంపర్ దిగువ భాగంలోనూ LED లైటింగ్ ఎలిమెంట్స్ ఇచ్చారు.

సైడ్ ప్రొఫైల్‌లో.. స్ట్రెట్‌గా ఉండే రూఫ్‌లైన్, బెల్ట్‌లైన్ కనిపిస్తాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. వెనుక భాగం మొత్తంలో వెడల్పుగా విస్తరించిన LED టెయిల్‌ల్యాంప్ ఉంది. టెయిల్‌గేట్‌పై Denza పేరును ప్రత్యేకంగా పొందుపరిచారు.

ఈ కారు పొడవు 5,250 మి.మీ., వెడల్పు 1,960 మి.మీ., ఎత్తు 1,900 మి.మీ. వీల్‌బేస్ 3,110 మి.మీ. బూట్ స్పేస్ 689 లీటర్లు. కర్బ్ వెయిట్ 2,915 కిలోలు. 

వేల్ సీ బ్లూ, కాస్మోస్ బ్లాక్, స్టారీ నైట్ గ్రే, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక

 లోపల విలాసవంతమైన ఫీచర్లు

Denza D9లో మొత్తం ఏడు సీట్లు ఉన్నాయి. 2+2+3 లేఅవుట్‌లో మూడు వరుసల సీట్లు ఉంటాయి. అన్ని వరుసల్లోనూ నప్పా లెదర్ అప్హోల్స్టరీ ఇచ్చారు. బ్లాక్ అండ్ బ్రౌన్, బ్లాక్ అండ్ బీజ్, ఆల్ బ్లాక్ అనే మూడు ఇంటీరియర్ రంగుల ఎంపికలు ఉన్నాయి.

ముందు సీట్లు 8-వే పవర్ అడ్జస్టబుల్‌గా ఉంటాయి. మసాజ్ ఫంక్షన్, 4-వే పవర్ లంబర్ సపోర్ట్ ‍‌(నడుముకు ఆధారం) కూడా ఉన్నాయి. డ్రైవర్ సీటుకు వెంటిలేషన్ సదుపాయం ఇచ్చారు. కో-డ్రైవర్ సీటులో బాస్ మోడ్ ఉంటుంది. రెండో వరుస సీట్లలో పవర్ అడ్జస్ట్మెంట్, ఒట్టోమన్, మెమరీ, వెంటిలేషన్ ఫీచర్లు ఉన్నాయి. మూడో వరుస సీట్లను కూడా 4-వే ఎలక్ట్రిక్ విధానంలో సర్దుకోవచ్చు.

డ్యాష్‌బోర్డ్‌పై 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌లో ఫిజికల్ బటన్లు, 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కప్ హోల్డర్లు ఉన్నాయి. రెండో వరుస ప్రయాణికుల కోసం ఆర్మ్‌రెస్ట్‌లో ఫ్రిజ్ ఏర్పాటు చేశారు. సీట్ల మసాజ్, వెంటిలేషన్, రిక్లైన్ వంటి ఫంక్షన్లను నియంత్రించేందుకు ఆర్మ్‌రెస్ట్‌లలో ప్రత్యేక టచ్‌స్క్రీన్లు ఉన్నాయి.

ఇతర ఫీచర్లలో 16 స్పీకర్ల Devialet ఆడియో సిస్టమ్, రెండు సన్‌రూఫ్‌లు, మూడు జోన్ల క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. భద్రత కోసం 9 ఎయిర్‌బ్యాగులు, ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, TPMS అందించారు.

 బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్ వివరాలు

Denza D9లో 115.07 kWh సామర్థ్యం ఉన్న LFP బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 730 కిలోమీటర్ల NEDC రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీని ద్వారా బ్యాటరీని 10 శాతం నుంచి 97 శాతానికి కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. 11 kW AC ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఉంది.

ముందు భాగంలో మాక్‌ఫెర్సన్ స్ట్రట్స్, వెనుక భాగంలో మల్టీ లింక్ సస్పెన్షన్ ఏర్పాటు చేశారు. డ్యూయల్ వాల్వ్ DiSus-C సెమీ యాక్టివ్ డ్యాంపర్లు ఉన్నాయి. రెండు వైపులా వెంటిలేటెడ్ డిస్క్ బ్రేకులు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Denza Z9 GT: 3 సెకన్లలో 100km స్పీడ్‌, 670km రేంజ్‌, 1156hp పవర్‌.. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మరో సంచలనం!

 ధర, వారంటీ, పోటీ

Denza D9 వాహనానికి 6 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటితో వారంటీ ముగుస్తుంది.

హైదరాబాద్‌తోపాటు గురుగావ్‌, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ప్రత్యేక Denza డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కారును విక్రయించనున్నారు.

భారత్‌లో.. రూ.79.95 లక్షల ధరతో లభించే MG M9కు Denza D9 ప్రత్యర్థిగా నిలుస్తుంది. అలాగే Toyota Vellfire, Mercedes-Benz V-Class వంటి ఖరీదైన MPVలకు ప్రత్యామ్నాయం అవుతుంది. టయోటా వెల్‌ఫైర్ ధర రూ.1.20 కోట్ల నుంచి రూ.1.30 కోట్ల వరకు ఉండగా, మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ ధర రూ.1.40 కోట్లుగా ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
భారత్‌లో తిరిగే కార్లన్నీ మన దేశానికి చెందినవి కావు.. ఏ కారు ఏ దేశానిదో తెలుసా?
Bajaj Pulsar N250 SS ఫస్ట్ రైడ్ రివ్యూ: పవర్, టెక్నాలజీ.. కొత్త అప్‌డేట్స్‌తో ఈ బండి మరింత స్పెషల్!
పాత పల్సర్‌కు కొత్త హంగులు.. కొత్త పల్సర్‌ N250 SSలో వచ్చిన 5 కీలక మార్పులేవో మీకు తెలుసా?
Affordable Gloves Boots: రూ.15 వేలల్లోనే పూర్తి రైడింగ్ గేర్.. CE Level 2 ఆర్మర్ అంటే ఏమిటి?
రూ.15 వేలల్లోనే బైక్ పూర్తి రైడింగ్ గేర్.. జాకెట్, గ్లౌజులు, బూట్లను ఎలా ఎంచుకోవాలి?
2026 KTM 200 Duke Review: కేవలం రూ.1,500 అదనపు ధర.. కేటీఎం 200 డ్యూక్‌లో 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
2026 కేటీఎం 200 డ్యూక్ రివ్యూ: ఈ బైక్‌లో వచ్చిన 5 కొత్త అప్‌డేట్స్, ప్రత్యేకతలు ఇవిగో!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget