అన్వేషించండి

Denza Z9 GT: 3 సెకన్లలో 100km స్పీడ్‌, 670km రేంజ్‌, 1156hp పవర్‌.. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మరో సంచలనం!

BYDకి చెందిన Denza Z9 GT ఎలక్ట్రిక్ కారు భారత్‌లో రూ.1.57 కోట్ల ఎక్స్‌షోరూమ్ ధరకు లాంచ్‌ అయింది. 1156 హెచ్‌పీ శక్తి, 670 కి.మీ. పరిధి, 9 నిమిషాల్లోనే ఛార్జింగ్ సహా ప్రత్యేకతలు ఉన్నాయి.

Denza Z9 GT launched: ఖరీదైన కార్ల మార్కెట్‌లో మరో సంచలనం నమోదైంది. అత్యాధునిక సాంకేతికత, అదిరిపోయే వేగం, విలాసవంతమైన ఫీచర్లు కలిపి తయారు చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అదే "డెంజా జెడ్9 జీటీ" (Denza Z9 GT). చైనాకు చెందిన బీవైడీ (BYD) కంపెనీలోని లగ్జరీ కార్ల విభాగమైన 'డెంజా' ఈ కారును భారత్‌లో లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.57 కోట్లు. టాక్స్‌లన్నీ కలిపి ఆన్‌రోడ్‌ ధర దాదాపు రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్నవారు రూ.10 లక్షలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. 

వేగంలో సూపర్ కార్లకు పోటీ!

Denza Z9 GT ప్రధాన ఆకర్షణ దాని పవర్‌ఫుల్‌ ఇంజిన్ వ్యవస్థ. ఇది పూర్తిగా విద్యుత్తుతో నడిచే కారు. ఇందులో అతి భారీగా 122.5kWh సామర్థ్యమున్న బ్యాటరీ ఉంది. మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ముందు భాగంలో ఒకటి, వెనుక భాగంలో రెండు మోటార్లను అమర్చారు.

ఈ మూడు మోటార్లు కలిపి గరిష్ఠంగా 1,156hp శక్తిని, 1,210Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. నాలుగు చక్రాలకు శక్తి అందుతుంది. దీంతో ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. గరిష్ఠ వేగం గంటకు 270 కిలోమీటర్లు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 670 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ప్రకటించింది.

9 నిమిషాల్లోనే 97% ఛార్జింగ్!

ఈ కారులో మరో ఆసక్తికరమైన ప్రత్యేకత ఛార్జింగ్ టెక్నాలజీ. డెంజా అందిస్తున్న 1,500 కిలోవాట్ల ఫ్లాష్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ వ్యవస్థకు ఇది మద్దతు ఇస్తుంది. ఈ సాంకేతికతతో బ్యాటరీని 10 శాతం నుంచి 97 శాతానికి కేవలం తొమ్మిది నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ జీవితకాలాన్ని దృష్టిలో ఉంచుకుని 97 శాతం వద్ద ఛార్జింగ్ నిలిపివేస్తారు. సాధారణ ఏసీ ఛార్జింగ్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకునే సదుపాయం ఉంది. దీనికి 11 కిలోవాట్ల వరకు మద్దతు ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?

అదిరిపోయే డిజైన్.. ప్రత్యేకమైన ఫీచర్లు!

డెంజా జెడ్9 జీటీని ఫాస్ట్‌బ్యాక్ తరహా ఆకర్షణీయమైన రూపంలో రూపొందించారు. కంపెనీ దీనిని నాలుగు తలుపులతో కూడిన షూటింగ్ బ్రేక్ కారుగా పరిచయం చేసింది. ముందు భాగంలో ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్స్, ప్రత్యేకమైన బానెట్ డిజైన్ ఉన్నాయి. పైకప్పు ముందు అంచులో లిడార్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కారు పొడవు సుమారు 5,180 మిల్లీమీటర్లు, వెడల్పు 1,990 మిల్లీమీటర్లు, ఎత్తు 1,490 మిల్లీమీటర్లు. వీల్‌బేస్ 3,125 మిల్లీమీటర్లు. 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, పిరెల్లీ టైర్లు దీని ప్రత్యేకతలు. వెనుక భాగంలో సన్నని LED టెయిల్ ల్యాంప్స్, ఆకర్షణీయమైన స్పాయిలర్‌ను అందించారు.

ఈ కారులో వెనుక చక్రాలు కూడా 15 డిగ్రీల వరకు తిరుగుతాయి. దీనివల్ల ఇరుకైన ప్రదేశాల్లో సులభంగా మలుపులు తీసుకోవచ్చు. అంతేకాదు, పక్కకు కదలగలదు, 360 డిగ్రీల మలుపు కూడా తీసుకోగలదు. పార్కింగ్ సమయంలో ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది.

లోపల విలాసవంతమైన ప్రపంచం!

ఈ కారులో ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ముందు సీట్లకు పవర్డ్‌ అడ్జస్ట్‌మెంట్‌, వెచ్చదనం, చల్లదనం, మసాజ్ సదుపాయాలు ఉన్నాయి. డ్రైవర్ సీటులో అదనంగా ప్రత్యేక సర్దుబాటు సౌకర్యం కల్పించారు. వెనుక సీట్లలోనూ వెచ్చదనం, చల్లదనం, మసాజ్, వెనక్కి వాలే సదుపాయాలు ఉన్నాయి.

డ్యాష్‌బోర్డుపై 17.3 అంగుళాల ప్రధాన టచ్‌స్క్రీన్ ఉంటుంది. ముందు ప్రయాణికుడి కోసం 13.2 అంగుళాల ప్రత్యేక తెరను ఇచ్చారు. డ్రైవర్‌కు మరో 13.2 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే అందించారు. 20 స్పీకర్ల డెవియలెట్ సౌండ్ సిస్టమ్, లెదర్ సీట్లు, విద్యుత్ ఆధారిత తలుపులు, సాఫ్ట్ క్లోజ్ సదుపాయం, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు

భద్రతకు పెద్దపీట.. ఆరేళ్ల వారంటీ!

సేఫ్టీ విషయంలోనూ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 9 ఎయిర్‌బ్యాగ్స్, ABS, 360 డిగ్రీల కెమెరా, TPMSను అందించింది. డ్రైవింగ్‌ను ఈజీగా మార్చే ADAS కూడా ఉంది. ముందు, వెనుక భాగాల్లో రాడార్ సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.

ఈ వాహనంపై ఆరేళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకు, విద్యుత్ డ్రైవ్ వ్యవస్థపై ఎనిమిదేళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ అందిస్తోంది. ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది.

పోర్షే టేకాన్‌కు పోటీ!

భారత్‌లో డెంజా బ్రాండ్‌ను BYD తన ప్రస్తుత కార్ల శ్రేణి కంటే పై స్థాయిలో నిలపనుంది. Z9 GTకి ప్రధాన పోటీదారుగా Porsche Taycan ను పరిగణిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు గురుగావ్‌, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రత్యేక డెంజా షోరూమ్‌ల ద్వారా విక్రయాలు జరగనున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

TVS vs Bajaj vs Hero: లక్ష రూపాయల బడ్జెట్‌లో స్పోర్టీ బైక్.. 150-160cc సెగ్మెంట్‌లో ఈ మూడు బైకుల మధ్య టఫ్‌ ఫైట్‌!
టీవీఎస్ అపాచీ, బజాజ్ పల్సర్, హీరో ఎక్స్‌ట్రీమ్.. ప్రైస్‌, పవర్, ఫీచర్లలో ఏది బెస్ట్?
Regenerative Braking In EVs: ఫుల్ ఛార్జింగ్‌తో కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారా? ఎలక్ట్రిక్‌ కారు డ్రైవర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం!
ఎలక్ట్రిక్‌ కారును 100 శాతం ఛార్జ్ చేస్తే రీజెనరేటివ్ బ్రేకింగ్ ఎందుకు ఆగిపోతుంది? కారణమిదే!
LFP vs NMC Batteries: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?
ఎలక్ట్రిక్ కారులో LFP లేదా NMC బ్యాటరీల్లో ఏది బెస్ట్? తెలుగు రాష్ట్రాల వాతావరణానికి ఏది సరిపోతుంది?
Car Insurance: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు
ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌: కార్ ఇన్సూరెన్స్‌లో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
OM Trailer Review : O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
Embed widget