అన్వేషించండి

LFP vs NMC Batteries: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?

Electric Car Battery: LFP, NMC ఈవీ బ్యాటరీల మధ్య తేడాలేంటి? వేసవి వేడి, ఛార్జింగ్, బ్యాటరీ జీవితకాలం, ధర పరంగా తెలుగు ప్రజలకు ఏది ఉత్తమమో తెలుసుకోండి.

Electric Vehical Battery: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే కారు ధర, ప్రయాణ పరిధి, ఛార్జింగ్ సమయం మాత్రమే కాదు.. అందులో ఉపయోగించిన బ్యాటరీ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ కారు పనితీరు, బ్యాటరీ జీవితకాలం, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలను బ్యాటరీ సాంకేతికత ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం భారత్‌లో విక్రయిస్తున్న చాలా ఎలక్ట్రిక్ కార్లలో ప్రధానంగా రెండు రకాల బ్యాటరీలు కనిపిస్తున్నాయి. అవే ఎల్‌ఎఫ్‌పీ (LFP), ఎన్ఎంసీ (NMC) బ్యాటరీలు. మరి ఈ రెండింటిలో ఏది మెరుగైనది? తెలుగు రాష్ట్రాల్లో వాతావరణానికి ఏది బాగా సరిపోతుంది?

LFP, NMC బ్యాటరీలంటే ఏమిటి?

LFP అంటే లిథియం ఫెర్రస్‌ (ఐరన్) ఫాస్ఫేట్. ఈ బ్యాటరీల్లో ఇనుము, ఫాస్ఫేట్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి తక్కువ ఖర్చుతో లభించడమే కాకుండా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బ్యాటరీ భద్రత, ఎక్కువ కాలం మన్నికకు ప్రాధాన్యత ఇచ్చే వాహనాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి. టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ వంటి చాలా మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కార్లలో ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు.

NMC అంటే నికెల్ మాంగనీస్ కోబాల్ట్. ఈ బ్యాటరీల్లో నికెల్, మాంగనీస్, కోబాల్ట్ ప్రధాన పదార్థాలుగా ఉంటాయి. తక్కువ బరువులో ఎక్కువ విద్యుత్ నిల్వ చేసుకునే సామర్థ్యం వీటి ప్రత్యేకత. అందువల్ల పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అమర్చినా కారు మొత్తం బరువు అదుపులో ఉంచుకోవచ్చు. ఎక్కువ ప్రయాణ పరిధి, మెరుగైన పనితీరుకు ఇవి ఉపయోగపడతాయి. హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా ఈవీ6 వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లలో ఈ బ్యాటరీ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల వేసవిలో ఏ బ్యాటరీ సురక్షితం?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వేసవి తీవ్రత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నడి వేసవిలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతుంటాయి. ఇలాంటి వాతావరణంలో ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పనితీరు కీలకంగా మారుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల బ్యాటరీలో థర్మల్ రన్‌అవే అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే బ్యాటరీలో ఉష్ణోగ్రత అదుపు తప్పి మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. 

ఇది కూడా చదవండి: రెట్రో లుక్‌, మోడ్రన్‌ టచ్‌తో Vespa ఆల్‌-న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు

ఇలాంటి సందర్భాల్లో ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలు కాస్త సురక్షితంగా ఉంటాయి. వీటి తయారీలో ఉపయోగించే పదార్థాలు సహజంగానే స్థిరంగా ఉంటాయి. ఇతర బ్యాటరీ రసాయనాలతో పోలిస్తే, వీటిలో అధిక వేడిలోనూ మంటలు వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

ఎన్ఎంసీ బ్యాటరీలు మాత్రం వీటికి విరుద్ధం, అధిక వేడికి త్వరగా స్పందిస్తాయి. అందుకే వీటిలో ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు లిక్విడ్ కూలింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తారు. అయితే బ్యాటరీ భద్రత అనేది కేవలం రసాయనాలపైనే ఆధారపడదు. వాహనంలోని శీతలీకరణ వ్యవస్థ, బీఎంఎస్, ఇతర రక్షణ ఏర్పాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

ఛార్జింగ్ విషయంలో ఏది మెరుగు?

రోజూ ఇంట్లో కారును ఛార్జింగ్ చేసే సమయంలో ఈ రెండు బ్యాటరీల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ఉన్న కార్లను అవసరమైనప్పుడు 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీ ఛార్జ్ స్థాయిని సరిగ్గా అంచనా వేసేందుకు వారానికి ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయాలని కొన్ని వాహన కంపెనీలు సూచిస్తాయి.

ఎన్ఎంసీ బ్యాటరీల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ప్రతిరోజూ 100 శాతం ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల దీర్ఘకాలంలో బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. అందుకే రోజువారీ ప్రయాణాలకు 80 శాతం వరకు ఛార్జింగ్ ఉంచాలని చాలా కంపెనీలు సూచిస్తాయి.

ఇది కూడా చదవండి: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు

బ్యాటరీ జీవితకాలం ఎంత?

బ్యాటరీ మన్నికను అంచనా వేయడానికి ఛార్జింగ్ సైకిళ్లను ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక పూర్తి ఛార్జింగ్ సైకిల్ అంటే బ్యాటరీలోని మొత్తం శక్తిని వినియోగించి మళ్లీ పూర్తిగా ఛార్జ్ చేయడం.

సాధారణంగా ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలు 2,500 నుంచి 3,500 కంటే ఎక్కువ ఛార్జింగ్ సైకిళ్లను తట్టుకోగలవు. ఎన్ఎంసీ బ్యాటరీలు సుమారు 1,000 నుంచి 1,500 సైకిళ్ల వరకు మన్నికను అందించవచ్చు. అయితే ఇవి సాధారణ అంచనాలు మాత్రమే. వినియోగం, ఉష్ణోగ్రత, ఛార్జింగ్ విధానం, బ్యాటరీ నిర్వహణ ఆధారంగా వాస్తవ జీవితకాలం మారుతుంది.

ధర విషయంలో ఏది చౌక?

ఎన్ఎంసీ బ్యాటరీల్లో ఉపయోగించే నికెల్, కోబాల్ట్ వంటి పదార్థాలు ఖరీదైనవి. వీటి సరఫరా కూడా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది. దీంతో తయారీ ఖర్చు పెరుగుతుంది.

ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీల్లో ఉపయోగించే ఇనుము, ఫాస్ఫేట్ వంటి పదార్థాలు సులభంగా లభిస్తాయి. అందువల్ల వీటి తయారీ ఖర్చు సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే టాటా మోటార్స్, ఎంజీ వంటి సంస్థలు అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొస్తున్నాయి.

తెలుగు ప్రజలకు ఏ బ్యాటరీ ఉత్తమం?

రోజువారీ ఆఫీసు ప్రయాణాలు, కుటుంబ అవసరాలు, నగర ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ కారు కొనేవారికి ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ మంచి ఎంపికగా చెప్పవచ్చు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం, ఎక్కువ ఛార్జింగ్ సైకిళ్లు, తక్కువ నిర్వహణ ఆందోళనలు దీని ప్రధాన ప్రయోజనాలు.

తరచూ నగరాల మధ్య సుదూర ప్రయాణాలు చేసేవాళ్లు, తక్కువ బరువుతో ఎక్కువ ప్రయాణ పరిధిని కోరుకునేవాళ్లు ఎన్ఎంసీ బ్యాటరీ ఉన్న కార్లను పరిశీలించవచ్చు. ప్రీమియం కార్లలో అధిక పనితీరు కోరుకునేవారికీ ఇవి అనుకూలంగా ఉంటాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు
ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌: కార్ ఇన్సూరెన్స్‌లో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
ఫ్యామిలీతో పిక్నిక్‌కు వెళ్లడానికి బెస్ట్ SUVలు.. రూ.8.57 లక్షల నుంచే 7 సీటర్ కార్లు!
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Embed widget