అన్వేషించండి

Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!

టూ వీలర్ కంపెనీలు తమ వాహనాల నాణ్యతను పెంచుతున్నా, సర్వీస్ కేంద్రాల పనితీరు మాత్రం వెనుకబడుతోంది. శిక్షణ, సిబ్బంది & వర్క్‌షాప్‌లపై దృష్టి అవసరం.

Two Wheeler Service Quality: భారత్‌లో కొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయడం చాలామందికి ఒక ప్రత్యేకమైన సందర్భం. కోరుకున్న బండి కోసం ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా, తాము కొన్న వాహనం సురక్షితంగా, నమ్మకంగా, మంచి పనితీరుతో నడుస్తుందని తయారీ కంపెనీపై నమ్మకం ఉంచుతారు. వాహనం కొనుగోలుతో ఆ సంస్థతో దీర్ఘకాల సంబంధం కూడా మొదలవుతుంది. ముఖ్యంగా, ఇప్పుడు 3 ఏళ్ల వారంటీలు సాధారణమవుతున్నాయి. ఎక్స్‌టెండెడ్ వారంటీలు కూడా డిస్కౌంట్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

అయితే.. తమకు తగిన గౌరవం, సేవలు లభించడం లేదని చాలా మంది కస్టమర్లు భావిస్తున్నారన్నది ఆటో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయం. టూ వీలర్ కంపెనీలు తయారు చేస్తున్న బైక్‌లు, స్కూటర్ల నాణ్యత గత కొన్నేళ్లలో గణనీయంగా మెరుగుపడింది. కానీ అదే స్థాయిలో సర్వీస్ సపోర్ట్ మాత్రం అభివృద్ధి చెందలేదు. కొన్ని కంపెనీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. అధీకృత సర్వీస్ కేంద్రాల్లో నాసిరకం పనితనం, సాంకేతిక పరిజ్ఞానం లోపించడం వంటి సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి.

బైక్‌లు మారుతున్నాయ్‌.. సర్వీసింగ్ కూడా మారాలిగా?

ప్రస్తుతం మోటార్‌సైకిళ్లు గతంతో పోలిస్తే చాలా క్లిష్టంగా మారాయి. ఎలక్ట్రానిక్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. సాధారణ కమ్యూటర్ బైక్‌లలో కూడా ECUలు, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంపులు & ఫ్యూయల్ ఇంజెక్టర్లు ఉంటున్నాయి. 150cc ఆపై సామర్థ్యం కలిగిన బైక్‌లలో పనితీరు, టెక్నాలజీ & అదనపు ఫీచర్లు పెరుగుతున్నాయి.

ఇలాంటి ఆధునిక బైక్‌లను సరిగ్గా నిర్వహించాలంటే మెకానిక్‌లకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. పాత పద్ధతుల్లోనే సర్వీసింగ్ చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలో ఇప్పటికీ 'నడుస్తుందిలే', 'నాల్రోజులు నడిపి చూడండి సార్' అనే ధోరణి కనిపిస్తోంది. పని ఎంత బాగా చేశామన్నదానికంటే ఎంత త్వరగా పూర్తి చేశామనే దానికే కొందరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సరైన పరికరాలను ఉపయోగించడం కంటే తాత్కాలిక పరిష్కారాలు లేదా 'జుగాడ్' పద్ధతులపై ఆధారపడుతున్నారు.

ఇది కూడా చదవండి: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి

దీనికి ఒక ఉదాహరణగా KTM 790 Duke సర్వీసింగ్ అనుభవాన్ని చెప్పవచ్చు. కొంతకాలం క్రితం, ఒక అధీకృత సర్వీస్ కేంద్రంలో ఈ బైక్‌కు టార్క్ రెంచ్ ఉపయోగించాలని కస్టమర్‌ పట్టుబట్టినప్పుడు, దానిని తీసుకురావడానికి సిబ్బంది స్టూల్ తెచ్చి పైభాగంలోని క్యాబినెట్‌ను తెరవాల్సి వచ్చింది. అక్కడ దుమ్ము పట్టిన టార్క్ రెంచ్ కనిపించింది. ఆ పరికరాన్ని దాదాపుగా ఉపయోగించడం లేదని ఈ అనుభవం సూచిస్తోంది. నిజానికి భారత్‌లో చాలామంది మెకానిక్‌లు బోల్టులను బిగించేటప్పుడు అవసరమైన టార్క్‌ను కొలిచే పరికరాలపై కాకుండా తమ చేతి బలంపైనే ఆధారపడుతున్నారు.

సిబ్బంది కొరత, తక్కువ జీతాలు

సర్వీస్ నాణ్యతను ప్రభావితం చేస్తున్న మరో ప్రధాన అంశం ఖర్చు. వర్క్‌షాప్‌లో ఎక్కువ వాహనాలకు సర్వీసింగ్ చేస్తేనే ఆదాయం పెరుగుతుంది. అందుకే కొన్నిసార్లు పనిని త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెడుతున్నారు. జూనియర్ మెకానిక్‌లకు చాలా తక్కువ జీతాలు చెల్లించడం వల్ల ఉద్యోగులు తరచూ మారుతున్నారు. దీంతో డీలర్‌షిప్‌లకు తగినంత మంది శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకోవడం కష్టమవుతోంది. ప్రతి సర్వీస్ ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే అవసరమైన వర్క్‌షాప్ స్థలం, సిబ్బందిని నిర్వహించడం కూడా డీలర్లకు సవాలుగా మారుతోంది.

మరోవైపు దేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు తరచూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా సర్వీస్ నెట్‌వర్క్, మెకానిక్‌లు & వర్క్‌షాప్ సదుపాయాలు పెరగడం లేదు. దీంతో ఇప్పటికే ఉన్న సర్వీస్ కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: 278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి

సర్వీస్ నాణ్యత పెరగాలంటే ఏం చేయాలి?

పెద్ద నగరాల్లో మరిన్ని సర్వీస్ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలి. మెకానిక్‌లకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి. వర్క్‌షాప్ మేనేజర్లు కూడా సరైన ఆపరేటింగ్ విధానాలు అమలవుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలి. ముఖ్యంగా నాణ్యమైన సర్వీసింగ్ అందించాలంటే మెకానిక్‌లకు సరైన శిక్షణతో పాటు తగిన జీతాలు ఇవ్వాలి.

అయితే ఈ మార్పుల వల్ల కస్టమర్లకు సర్వీసింగ్ ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా లేబర్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. మన దేశంలో బైక్‌ల నాణ్యత, టెక్నాలజీ మెరుగుపడుతున్న కొద్దీ వాటి నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో సర్వీస్ ఖర్చులు పెరగడం సహజమే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి
ఇటలీ నుంచి వస్తున్న Italjet Dragster 300.. ఈ స్కూటర్ గురించి 6 ఆసక్తికర విషయాలు
Electric Car Sales: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు
జోరుగా హుషారుగా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌.. అప్పుడే 3 లక్షల మార్క్ దాటిన అమ్మకాలు
రెట్రో లుక్‌, మోడ్రన్‌ టచ్‌తో Vespa ఆల్‌-న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు
Vespa నుంచి మూడు గ్లోబల్‌ రేంజ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తాయంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
Embed widget