అన్వేషించండి

Electric Car Sales: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు

భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2026లో తొలిసారి 3 లక్షలు దాటాయి. నవంబర్ 9 నాటికి 3,04,701 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Electric Car Sales 2026 India: భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో 2026 సంవత్సరం సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో తొలిసారిగా ఒక క్యాలెండర్ ఏడాదిలో EVల అమ్మకాలు 3 లక్షల యూనిట్ల మార్క్‌ను దాటాయి. Vahan డేటా ప్రకారం, 2026 జనవరి 1 నుంచి నవంబర్ 9 వరకు మొత్తం 3,04,701 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు కస్టమర్లకు డెలివరీ అయ్యాయి. గత ఏడాది కంటే ఇది 66 శాతం వృద్ధి.

2026 క్యాలెండర్ ఏడాది ముగియడానికి ఇంకా 52 రోజులు మిగిలి ఉండగానే, 2025లో నమోదైన 1,95,571 యూనిట్ల అమ్మకాలను ఈ ఏడాది విక్రయాలు దాటేశాయి. గత ఏడాది మొత్తం అమ్మకాల కంటే ప్రస్తుతం 56 శాతం ఎక్కువ వాహనాలు అమ్ముడయ్యాయి. మార్కెట్లో పెరిగిన EV మోడళ్లు, వాస్తవ వినియోగ పరిస్థితుల్లో మెరుగైన రేంజ్, పెట్రోల్ & డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువ నిర్వహణ ఖర్చులు ఈ వృద్ధికి కారణమని తెలుస్తోంది.

నెలవారీ అమ్మకాల్లో భారీ పెరుగుదల

2026లో ప్రతి నెలా EV అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాయి. జనవరిలో 21,568 యూనిట్లు అమ్ముడవగా, ఫిబ్రవరిలో 16,300 యూనిట్లు నమోదయ్యాయి. మార్చిలో అమ్మకాలు 25,502కు చేరాయి.

ఏప్రిల్‌లో 25,984 యూనిట్లు, మేలో 28,416 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూన్ నెలలో తొలిసారిగా నెలవారీ EV డెలివరీలు 30,000 మార్క్‌ను దాటి 33,640 యూనిట్లకు చేరాయి. ఆ తర్వాత వరుసగా ఐదు నెలల పాటు నెలవారీ అమ్మకాలు 30,000 యూనిట్లకు పైనే కొనసాగాయి.

జులైలో 34,717 యూనిట్లు, ఆగస్టులో 32,587 యూనిట్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌లో, ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధికంగా 38,440 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అక్టోబర్‌లో 37,516 యూనిట్లు అమ్ముడయ్యాయి. నవంబర్ మొదటి తొమ్మిది రోజుల్లోనే మరో 10,031 EVలు డెలివరీ అయ్యాయి.

ఇది కూడా చదవండి: ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు బెస్ట్ ఎలక్ట్రిక్ SUVలు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 478km వరకు ప్రయాణం!

బ్రాండ్‌ల వారీగా టాటా టాప్

కంపెనీల వారీగా చూస్తే టాటా మోటార్స్ 1,20,895 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉంది. మొత్తం మార్కెట్లో ఈ సంస్థకు 39.67 శాతం వాటా ఉంది.

మహీంద్రా 69,660 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. మార్కెట్ వాటా 22.86 శాతం. MG 56,988 యూనిట్ల అమ్మకాలతో 18.70 శాతం వాటాను సాధించి మూడో స్థానంలో ఉంది.

విన్‌ఫాస్ట్ 15,867 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉండగా, మారుతి సుజుకి 12,390 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. వీటి మార్కెట్ వాటాలు వరుసగా 5.20 శాతం & 4.06 శాతం.

కియా 7,612 యూనిట్లు, BYD 6,755 యూనిట్లు, హ్యుందాయ్ 6,013 యూనిట్లు అమ్మగలిగాయి. BMW 4,273 యూనిట్లు, మెర్సిడెస్ బెంజ్ 1,416 యూనిట్లను విక్రయించాయి. టెస్లా సేల్స్‌ 1,153 యూనిట్లుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Force e-Traveller: ఫోర్స్‌ మోటార్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ట్రావెలర్స్‌, అంబులెన్స్‌.. తుది పరీక్షల్లో EVలు

లగ్జరీ కార్ల సేల్స్‌

లగ్జరీ EV విభాగంలో లగ్జరీ EV విభాగంలో BMW తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది, 2026లో ఇప్పటివరకు ఈ సంస్థ 4,273 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. Mercedes-Benz 1,416 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో ఉంది. టెస్లా మూడో స్థానంలోకి వచ్చింది, ఈ ఏడాది ఇప్పటివరకు 1,153 యూనిట్లను విక్రయించింది. వోల్వో 383 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉంది. పోర్షే 83 యూనిట్లు, రోల్స్ రాయిస్ 6 యూనిట్లు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4 యూనిట్లు, లోటస్ 3 యూనిట్లు & ఆడి 2 యూనిట్ల అమ్మకాలు నమోదు చేశాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రెట్రో లుక్‌, మోడ్రన్‌ టచ్‌తో Vespa ఆల్‌-న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు
Vespa నుంచి మూడు గ్లోబల్‌ రేంజ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తాయంటే?
55hp పవర్, 63Nm టార్క్‌ ఉన్నా ఈజీ రైడ్‌ ఇచ్చిన Royal Enfield Himalayan 750.. ఫీచర్లు ఎలా ఉపయోగపడ్డాయి?
Royal Enfield Himalayan 750 నడుపుతుంటే ఎలా అనిపించింది? ప్లస్‌లు, మైనస్‌లు
TVS RTR 125 LC Bike: టీవీఎస్‌ నుంచి నాలుగు కొత్త టూవీలర్లు.. వాటిలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లే
TVS కొత్త 125cc బైక్‌ రెడీ అవుతోంది.. 14.7hp పవర్, 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో కొత్త మోడల్!
Best Selling Cars: గత నెలలో ఈ కార్ల కోసం జనం క్యూ కట్టారు.. టాప్ 10 లిస్ట్‌లో 7 మోడళ్లు మారుతి సుజుకీవే
దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్‌ డిమాండ్‌.. అక్టోబర్‌లో అమ్ముడైన టాప్ 10 కార్లు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget