Volkswagen కారు కొనండి లేదా ఎక్సేంజ్ చేయండి.. Tiguan మీద రూ.6 లక్షలు, Taigun మీద రూ.2.7 లక్షల వరకు ఆఫర్లు!
ఈ నెలలో Volkswagen Taigun, Tiguan R-Line, Tayron & Virtus కార్లపై రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్, లాయల్టీ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

Volkswagen Discounts November 2026: వోక్స్‌వ్యాగన్ కంపెనీ తన కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. Taigun, Virtus, Tiguan R-Line & Tayron మోడళ్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలు అందిస్తోంది. మోడల్, వేరియంట్, తయారీ సంవత్సరం ఆధారంగా ఈ ఆఫర్లు మారతాయి. క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Tiguan R-Lineపై అత్యధికంగా రూ.6 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. Taigunపై రూ.2.7 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు (నవంబర్ 2026) వరకే వర్తిస్తాయి.
వోక్స్‌వ్యాగన్ ప్రకటించిన ప్రయోజనాల్లో.. లాయల్టీ బెనిఫిట్ లేదా కార్పొరేట్ ఆఫర్.. ఈ రెండింటిలో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాలి, రెండింటినీ కలిపి పొందలేరు.
Volkswagen Tiguan R-Lineపై రూ.6 లక్షల వరకు తగ్గింపు
నవంబర్ ఆఫర్లలో Volkswagen Tiguan R-Line పాత వేరియంట్‌పై అత్యధిక ప్రయోజనాలు అందిస్తున్నారు. ఈ మోడల్‌పై రూ.3.5 లక్షల నగదు తగ్గింపు ఉంది. అదనంగా రూ.2 లక్షల ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, మరో రూ.50,000 అదనపు ప్రయోజనం కలిపి మొత్తం రూ.6 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ అదనపు రూ.50,000 ప్రయోజనానికి సంబంధించిన అర్హత వివరాలు స్పష్టంగా లేవు. కాబట్టి కొనుగోలు చేసే ముందు డీలర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవాలి.
Volkswagen Taigunపై రూ.2.7 లక్షల వరకు డిస్కౌంట్
Volkswagen Taigun MY2025 Topline 1.0 TSI MT వేరియంట్‌పై ఈ నెలలో అత్యధికంగా రూ.2.7 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.2 లక్షల నగదు తగ్గింపు, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ & రూ.40,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం ఉన్నాయి.
MY2025 Topline 1.0 TSI AT వేరియంట్‌పై రూ.1.5 లక్షల నగదు తగ్గింపు అందిస్తున్నారు. ఇదే వేరియంట్ MY2026 మోడల్‌పై రూ.1 లక్ష తగ్గింపు ఉంది. GT Plus విభాగంలో MY2025 GT Plus Chrome 1.5 TSI DSG వేరియంట్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. GT Plus Chrome & GT Plus Sport మాన్యువల్ వేరియంట్లపై రూ.1.51 లక్షల చొప్పున తగ్గుతుంది. MY2025 GT Plus Sport 1.5 TSI DSG వేరియంట్‌పైనా రూ.1.51 లక్షల క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Force e-Traveller: ఫోర్స్ మోటార్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ ట్రావెలర్స్, అంబులెన్స్.. తుది పరీక్షల్లో EVలు
Comfortline 1.0 TSI MT, GT-Line సహా ఇతర వేరియంట్లపై రూ.50,000 నుంచి రూ.80,900 వరకు నగదు తగ్గింపులు ఉన్నాయి. ఇవి మోడల్ తయారీ సంవత్సరం, వేరియంట్ ఆధారంగా మారతాయి. అర్హత కలిగిన Taigun వేరియంట్లపై రూ.30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్ కూడా పొందవచ్చు. కస్టమర్ కేటగిరీని బట్టి కార్పొరేట్ ప్రయోజనాలు రూ.5,000 నుంచి రూ.40,000 వరకు ఉన్నాయి.
Volkswagen Tayronపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాలు
Volkswagen Tayron కొనేవాళ్లకు కూడా ఈ నెలలో మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ మోడల్‌పై రూ.1 లక్ష నగదు తగ్గింపు, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, మరో రూ.50,000 అదనపు ప్రయోజనం కలిపి మొత్తం రూ.2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
Volkswagen Virtusపై రూ.1.66 లక్షల వరకు తగ్గింపు
Volkswagen Virtus MY2025 Highline 1.0 TSI AT వేరియంట్‌పై అత్యధికంగా రూ.96,500 క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనికి రూ.30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, అర్హులైన వారికి రూ.40,000 కార్పొరేట్ ప్రయోజనం కూడా కలిస్తే మొత్తం రూ.1,66,500 వరకు ఆదా చేసుకోవచ్చు.
MY2025 Highline 1.0 TSI MT వేరియంట్‌పై రూ.61,000 నగదు తగ్గింపు లభిస్తుంది. Topline 1.0 TSI MT & AT వేరియంట్లపై MY2025 కార్లకు రూ.75,000 చొప్పున తగ్గింపు అందిస్తున్నారు. MY2026 Topline మాన్యువల్ వేరియంట్‌పై రూ.50,000, ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ.70,000 డిస్కౌంట్ వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు బెస్ట్ ఎలక్ట్రిక్ SUVలు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 478km వరకు ప్రయాణం!
1.5 TSI వేరియంట్ల విషయానికి వస్తే.. MY2025 GT Plus Chrome DSGపై రూ.75,000, GT Plus Sport DSGపై రూ.50,000 తగ్గింపు అందుబాటులో ఉంది. MY2026లో ఈ రెండు వేరియంట్లపై రూ.60,000 చొప్పున క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఎంపిక చేసిన Virtus వేరియంట్లపై రూ.30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్ కూడా ఉన్నాయి.
కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి
Volkswagen కార్లపై ప్రకటించిన డిస్కౌంట్లు నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యతను బట్టి మారవచ్చు. ముఖ్యంగా MY2025, MY2026 మోడళ్ల మధ్య ఆఫర్లలో తేడా ఉంది. కాబట్టి.. కారు తయారీ సంవత్సరం, వేరియంట్, ఎక్స్ఛేంజ్ అర్హత, కార్పొరేట్ లేదా లాయల్టీ ప్రయోజనాల వివరాలను ముందుగానే తెలుసుకోవాలి. తుది ధర, వర్తించే అన్ని ఆఫర్లను స్థానిక Volkswagen డీలర్ వద్ద నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















