అన్వేషించండి

ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు బెస్ట్ ఎలక్ట్రిక్ SUVలు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 478km వరకు ప్రయాణం!

లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లేవాళ్లకు 400kmకు పైగా రియల్ వరల్డ్ రేంజ్ ఇచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ SUVల ధరలు, బ్యాటరీ సామర్థ్యం & రేంజ్ వివరాలు తెలుసుకోండి.

Top Electric SUVs With Highest Range: ఎలక్ట్రిక్ కారు (Electric Car) కొనాలనుకునేవారికి వాటి రేంజ్ చాలా కీలకం. అప్పుడుప్పుడు లేదా తరచూ లాంగ్ డ్రైవ్‌లు వెళ్లేవాళ్లు.. ఎక్కువ దూరం ప్రయాణించే SUVల కోసం చూస్తుంటారు. EV కొనే ముందు, కంపెనీలు ప్రకటించే క్లెయిమ్డ్ రేంజ్ కంటే వాస్తవ పరిస్థితుల్లో వచ్చే రేంజ్ తెలుసుకోవడం ముఖ్యం.

భారత్‌లో రూ.30 లక్షల లోపు ధరతో లభించే, 400kmకు పైగా రియల్ వరల్డ్ రేంజ్ ఇచ్చే ఐదు ఎలక్ట్రిక్ SUVలు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌ల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా, తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు ఈ జాబితాను రూపొందించారు.

 5. టాటా సియెర్రా EV AWD

రియల్ వరల్డ్ రేంజ్: 437km

టాటా సియెర్రా EV AWD ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ఇందులో 75kWh LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీ రెండు ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తిని అందిస్తుంది. ముందు మోటార్ 140hp, వెనుక మోటార్ 209hp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. మొత్తం టార్క్ 504Nmగా ఉంది.

ఈ SUVకి కంపెనీ ప్రకటించిన MIDC రేంజ్ 624km. ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన వాస్తవ ప్రపంచ పరీక్షల్లో.. సిటీ ట్రాఫిక్‌లో 438km, హైవేపై 437km ప్రయాణించింది. కలిపి చూస్తే, రియల్ వరల్డ్ సగటు రేంజ్ 437kmగా నమోదైంది. దీని సగటు సామర్థ్యం 5.83km/kWh.

సియెర్రా EV AWD టాప్-స్పెక్ Empowered A వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.25.99 లక్షలు.

ఇది కూడా చదవండి: Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి

 4. MG హెక్టర్ తోమాహాక్ EV

రియల్ వరల్డ్ రేంజ్: 446km

ఈ కారులో 69.2kWh LFP బ్యాటరీ ప్యాక్‌ అందించారు. ముందు భాగంలో ఒకే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 204hp పవర్ & 310Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ మోడల్‌కు కంపెనీ ప్రకటించిన MIDC రేంజ్ 517km. ఎక్స్‌పర్ట్‌ల పరీక్షల్లో నగరంలో 495km, హైవేపై 397km ప్రయాణించింది. సగటు రియల్ వరల్డ్ రేంజ్ 446kmగా నమోదైంది. దీని సగటు సామర్థ్యం 6.44km/kWh.

ఈ జాబితాలో ఉన్న SUVలలో నగర రేంజ్ & కలిపిన సామర్థ్యం విషయంలో MG హెక్టర్ తోమాహాక్ EV ముందుంది. దీని ధరలు రూ.20.25 లక్షల నుంచి రూ.24.25 లక్షల వరకు ఉన్నాయి.

 3. మహీంద్రా BE 6

రియల్ వరల్డ్ రేంజ్: 449km

మహీంద్రా BE 6 ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇందులో XEV 9e & XEV 9S మోడళ్లలో ఉన్న 79kWh బ్యాటరీ ప్యాక్, 286hp ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు.

పరీక్షించిన BE 6 Pack Three వేరియంట్‌కు అప్పట్లో ప్రకటించిన ARAI రేంజ్ 682km. వాస్తవ పరీక్షల్లో.. సిటీలో 439km, హైవేపై 459km ప్రయాణించింది. దీంతో కలిపిన రియల్ వరల్డ్ రేంజ్ 449kmగా నమోదైంది. దీని సగటు సామర్థ్యం 5.68km/kWh.

మహీంద్రా ప్రస్తుతం ఈ మోడల్‌ను BE 6 Sporteq పేరుతో పిలుస్తోంది. గతంలో Pack Threeగా ఉన్న వేరియంట్ పేరును Pack Three+గా మార్చింది. 79kWh బ్యాటరీతో వచ్చే BE 6 Pack Three+ ధర రూ.24.95 లక్షలు.

 2. మహీంద్రా XEV 9e

రియల్ వరల్డ్ రేంజ్: 456km

XEV 9S మాదిరిగానే ఈ కారులోనూ 79kWh బ్యాటరీ ప్యాక్ & వెనుక ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి. కంపెనీ ప్రకటించిన MIDC రేంజ్ 656km.

పరీక్షల్లో XEV 9e Pack Three నగరంలో 425km, హైవేపై 488km ప్రయాణించింది. ఈ ఫలితాల ఆధారంగా కలిపిన రియల్ వరల్డ్ రేంజ్ 456kmగా నమోదైంది. దీని సగటు సామర్థ్యం 5.78km/kWh.

79kWh బ్యాటరీతో వచ్చే Pack Three వేరియంట్ ధర రూ.30.50 లక్షలు.

ఇది కూడా చదవండి: Skoda Slavia vs Honda City: కంపెనీ ప్రకటించిన మైలేజ్‌ ఈ కార్లు నిజంగా ఇస్తున్నాయా? ఒరిజినల్‌ కెపాసిటీ ఎంత?

 1. మహీంద్రా XEV 9S

రియల్ వరల్డ్ రేంజ్: 478km

ఈ జాబితాలో మొదటి స్థానాన్ని మహీంద్రా మూడు వరుసల ఎలక్ట్రిక్ SUV XEV 9S దక్కించుకుంది. ఈ మోడల్ 59kWh, 70kWh & 79kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే రేంజ్ పరీక్షల కోసం 79kWh బ్యాటరీతో వచ్చే టాప్ వేరియంట్ Pack Three Aboveను ఉపయోగించారు.

ఇందులో వెనుక అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 286hp పవర్ & 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకటించిన MIDC రేంజ్ 679km.

పరీక్షల్లో XEV 9S నగరంలో 478km, హైవేపై 477km ప్రయాణించింది. దీంతో కలిపిన రియల్ వరల్డ్ రేంజ్ 478kmగా నమోదైంది. ఈ మూడు మహీంద్రా EVలలో దీని కలిపిన సామర్థ్యం 6.05km/kWhతో అత్యధికంగా ఉంది.

79kWh బ్యాటరీతో వచ్చే Pack Three Above ధర 6-సీటర్ లేదా 7-సీటర్ ఆప్షన్‌ను బట్టి రూ.29.95 లక్షల నుంచి రూ.30.15 లక్షల వరకు ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో ప్రస్తావించిన రేంజ్‌ లెక్కలన్నీ ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన టెస్ట్‌ల్లో నమోదైన రియల్ వరల్డ్ రేంజ్ నంబర్లు. ప్రయాణ వేగం, రోడ్డు పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా ఈ రేంజ్‌లు ఒక్కొక్కరికి ఒక్కోలా మారవచ్చు. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BMW F 450 GS లో Base నుంచి GS Trophy వరకు నాలుగు వేరియంట్లు.. ఏ వేరియంట్‌ బెటర్‌?
BMW అడ్వెంచర్ బైక్ F 450 GSలో 4 వేరియంట్లు.. ఏ మోడల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. యూత్‌ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
Skoda Slavia vs Honda City: కంపెనీ ప్రకటించిన మైలేజ్‌ ఈ కార్లు నిజంగా ఇస్తున్నాయా? ఒరిజినల్‌ కెపాసిటీ ఎంత?
స్కోడా స్లావియా vs హోండా సిటీ: ఏ కారు మైలేజ్ ఎక్కువ? రియల్ వరల్డ్ ఫలితాలు ఇవే!
Renault Duster, Kiger, Triber, Kwid కార్లపై రూ.2.10 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?
రెనాల్ట్‌ డస్టర్‌ మీద రూ.2.10 లక్షలు, క్విడ్‌ మీద రూ.40,000 వరకు తగ్గింపు.. ఇంకొన్ని రోజులే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Sonia Gandhi Book: మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. యూత్‌ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
Ravi Shastri Recall: వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Embed widget