అన్వేషించండి

Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే

కారు ఇంజిన్ పనితీరు దెబ్బతినకుండా ఉండాలంటే మిస్‌ఫైరింగ్, పాత కూలెంట్, చెక్ ఇంజిన్ లైట్ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

Car Engine Problems Fixing: కారు కొన్న తర్వాత దాని నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా, ఇంజిన్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాహన కంపెనీ సూచించిన సర్వీస్ షెడ్యూల్‌ను పాటించడం ద్వారా చాలా ఇంజిన్ సమస్యలను ముందుగానే అడ్డుకోవచ్చు. రెగ్యులర్‌గా సర్వీస్‌ చేయిస్తున్నప్పటికీ, కారు వాడుతున్నకొద్దీ కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా, ఇంజిన్‌లో ఏదైనా లోపం కనిపిస్తే ఆలస్యం చేయకుండా "అధీకృత సర్వీస్ సెంటర్‌"లో మాత్రమే చెక్‌ చేయించుకోవడం మంచిది. ఇంజిన్ పనితీరును దెబ్బతీసే మూడు ముఖ్యమైన సమస్యలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంజిన్ మిస్‌ఫైరింగ్

కారు ఇంజిన్‌లో ఇంధనం సరిగ్గా మండకపోవడాన్ని మిస్‌ఫైరింగ్ అంటారు. ఇంజిన్ సక్రమంగా పని చేయడానికి గాలి, ఇంధనం సరైన నిష్పత్తిలో కలవాలి. ఈ మిశ్రమం సిలిండర్లలోకి వెళ్లి ఒత్తిడికి గురైన తర్వాత స్పార్క్ ప్లగ్ ద్వారా మండుతుంది. ఇలా నిర్ణీత సమయంలో ఇంధనం మండడం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ పవర్‌తోనే కారు ముందుకు కదులుతుంది.

అయితే స్పార్క్ ప్లగ్ సరిగ్గా పనిచేయకపోయినా, గాలి-ఇంధన మిశ్రమంలో తేడా వచ్చినా ఇంధనం సక్రమంగా మండదు. దీంతో ఇంజిన్ మిస్‌ఫైర్ అవుతుంది. ఈ సమస్య వల్ల ఇంధనం వృథా కావడంతో పాటు ఇంజిన్ నుంచి అసాధారణ శబ్దాలు రావచ్చు. సాధారణంగా, అరిగిపోయిన స్పార్క్ ప్లగ్స్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఇంజిన్‌లో ఇంధనం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లోనూ మిస్‌ఫైరింగ్ జరగవచ్చు. మెకానిక్‌లు స్పార్క్ ప్లగ్స్‌ను పరీక్షించి, ఇంజిన్‌ను తనిఖీ చేసి అసలు కారణాన్ని గుర్తిస్తారు. ఆ తర్వాత అవసరమైన మరమ్మతులు చేస్తారు.

ఇది కూడా చదవండి: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా

పాత కూలెంట్

ఇంజిన్ వేడెక్కకుండా చూసుకోవడంలో కూలెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. కూలింగ్ సిస్టమ్ ద్వారా కూలెంట్ ఇంజిన్‌లోకి ప్రవహిస్తూ అక్కడ ఉత్పత్తయ్యే వేడిని గ్రహిస్తుంది. వేడెక్కిన కూలెంట్ రేడియేటర్‌లోకి చేరుతుంది. అక్కడ వేడి బయటకు వెళ్లిపోయి కూలెంట్ తిరిగి చల్లబడుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అయితే, కాలక్రమేణా కూలెంట్‌లో దుమ్ము, ఇతర మలినాలు చేరతాయి. దీంతో దాని నాణ్యత తగ్గి, చిక్కగా మారే అవకాశం ఉంటుంది. పాతబడిన కూలెంట్‌లో యాసిడ్‌ లక్షణం కూడా పెరగవచ్చు. దీనివల్ల కూలింగ్ సిస్టమ్‌లో తుప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. పైపులు, ఇతర భాగాలు దెబ్బతిని కూలెంట్ లీకేజీలు కూడా ఏర్పడవచ్చు.

ఈ సమస్యలను ముందుగానే నివారించడానికి, వాహన తయారీ సంస్థ సూచించిన వ్యవధిలో కూలెంట్‌ను మార్చాలి. సర్వీస్ సెంటర్‌లో పాత కూలెంట్‌ను పూర్తిగా తొలగించి, కూలింగ్ సిస్టమ్‌ను శుభ్రం చేసిన తర్వాత కొత్త కూలెంట్ నింపుతారు. సరైన కూలెంట్‌ను ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం.

'చెక్ ఇంజిన్' లైట్ వెలగడం

కారు డ్యాష్‌బోర్డ్‌పై కనిపించే వార్నింగ్ లైట్లు వాహనంలో తలెత్తే సమస్యల గురించి ముందుగానే హెచ్చరిస్తాయి. ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు సాధారణంగా ఈ లైట్లు కొద్దిసేపు వెలిగి ఆ తర్వాత ఆరిపోతాయి. ఇది వాటి ప్రాథమిక తనిఖీ ప్రక్రియలో భాగం. అయితే ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా వార్నింగ్ లైట్ ఆగకుండా వెలుగుతూనే ఉంటే దాని కారణాన్ని తెలుసుకోవాలి.

వీటిలో 'చెక్ ఇంజిన్' లైట్ చాలా ముఖ్యమైనది. ఇంజిన్ లేదా దాని నియంత్రణ వ్యవస్థలో ఏదైనా లోపం ఉన్నప్పుడు ఈ లైట్ వెలగవచ్చు. ఇంజిన్‌లోని కీలక భాగాలకు అనుసంధానించిన సెన్సర్లు వాటి పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని కారు కంప్యూటర్‌కు పంపిస్తుంటాయి. ఏదైనా భాగం సరిగ్గా పనిచేయకపోతే సెన్సర్ల ద్వారా ఆ సమాచారం కంప్యూటర్‌కు చేరుతుంది. అప్పుడు 'చెక్ ఇంజిన్' లైట్ వెలుగుతుంది.

ఇది కూడా చదవండి: మారుతి కార్లపై నవంబర్ ఆఫర్లు.. Wagon R, Alto K10 సహా చాలా మోడళ్లపై రూ.1.51 లక్షల వరకు డిస్కౌంట్లు!

ఈ లైట్ వెలిగినప్పుడు సమస్య ఏమిటో తెలుసుకోవడానికి సర్వీస్ సెంటర్‌లో ఇంజిన్ డయాగ్నస్టిక్ పరీక్ష చేయించాలి. ప్రత్యేక పరికరాల సాయంతో లోపానికి సంబంధించిన ఎర్రర్ కోడ్‌ను గుర్తించి, సమస్య ఉన్న భాగాన్ని పరీక్షిస్తారు. ఆ తర్వాత అవసరమైన మరమ్మతులు చేస్తారు. లైట్ వెలిగిన ప్రతిసారీ ఒకే రకమైన సమస్య ఉంటుందని భావించకూడదు. కాబట్టి కారణం తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.

ఇలాంటి సమస్యలను సరైన సమయంలో అధీకృత సర్వీస్‌ సెంటర్‌లోనే తనిఖీ చేయించి మరమ్మతులు చేయిస్తే పెద్ద ఖర్చుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సాధారణ మెకానిక్‌ దగ్గరకు వెళ్తే సమస్య మరింత పెద్దదై మళ్లీ తిరిగొచ్చే రిస్క్‌ ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Engine Warm Up: పెట్రోల్, డీజిల్, CNG కార్లను నడిపే ముందు ఎంత సేపు ఆన్‌లో ఉంచాలి? కంపెనీలు ఏం చెబుతున్నాయి?
చలికాలంలో కారును స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ చేయొచ్చా? ఇంజిన్‌ వేడెక్కేవరకు వెయిట్‌ చేయాలా?
Electric Scooter Sales: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటారా? ప్రస్తుతం దేశంలో నంబర్‌ 1, నంబర్‌ 2 కంపెనీలు ఇవే!
25.5hp పవర్‌తో మార్కెట్‌లోకి దూసుకొచ్చిన Bajaj Pulsar NS200.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల కంపారిజన్‌
కొత్త ఫీచర్లతో వచ్చిన బజాజ్ పల్సర్ NS200.. ఇప్పుడు KTM డ్యూక్, TVS అపాచీ కంటే ఇదే బెస్ట్‌ బైకా?
Honda CBR1000RR-R Fireblade: 2026, 2027 మోడళ్ల మధ్య తేడాలేంటి? కొత్తగా ఏ మారింది?
కొత్త లుక్‌తో తిరిగొచ్చిన హోండా ఫైర్‌బ్లేడ్.. బరువు తగ్గించి, టార్క్ పెంచిన కంపెనీ!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget