25.5hp పవర్‌తో మార్కెట్‌లోకి దూసుకొచ్చిన Bajaj Pulsar NS200.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల కంపారిజన్
కొత్త బజాజ్ పల్సర్ NS200లో 1hp అదనపు పవర్‌తో పాటు TFT డిస్‌ప్లే, రైడ్ మోడ్‌లు వచ్చాయి. KTM 200 Duke, TVS Apache RTR 200 4Vతో ధర, ఫీచర్లు, పనితీరు పోలిక.

Pulsar NS200 vs Other Bike: బజాజ్ తన ప్రముఖ స్ట్రీట్ నేకెడ్ బైక్ Pulsar NS200కు కొత్త అప్‌డేట్ ఇచ్చింది. ఈ మార్పులతో బైక్‌కు అదనంగా 1hp పవర్ పెరిగింది. అంతేకాకుండా స్పోర్ట్ షిఫ్టర్, రైడ్ మోడ్‌లు, 5-అంగుళాల TFT డిస్‌ప్లే వంటి కొత్త ఫీచర్లు కూడా వచ్చాయి. గత ఆగస్టులో క్లాసిక్ పల్సర్ మోడళ్లకు వచ్చిన పెద్ద మార్పులతో పోలిస్తే ఇది పూర్తి స్థాయి డిజైన్ మార్పు కాకపోయినా, NS200పై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కొత్త Pulsar NS200ను దాని ప్రధాన ప్రత్యర్థులైన KTM 200 Duke & TVS Apache RTR 200 4Vతో పోల్చి, ఏది బెస్ట్ బైకో తెలుసుకుందాం.
ఇంజిన్, పవర్, టార్క్
కొత్త అప్‌డేట్ తర్వాత ఈ మూడు బైక్‌లలో Pulsar NS200 అత్యధిక పవర్ అందిస్తోంది.
ఇంజిన్ స్పెసిఫికేషన్లు
గతంలో Pulsar NS200లో 24.5hp పవర్ ఉండేది. ఇప్పుడు మరో 1hp పెరగడంతో 25.5hpకు చేరింది. దీంతో KTM 200 Duke కంటే 0.5hp ఎక్కువ పవర్ అందిస్తోంది. అయితే టార్క్ విషయంలో మాత్రం KTM ముందుంది. Apache RTR 200 4V ఈ రెండింటితో పోలిస్తే తక్కువ పవర్, టార్క్ అందిస్తోంది.
| వివరాలు | Bajaj Pulsar NS200 | KTM 200 Duke | TVS Apache RTR 200 4V |
|---|---|---|---|
| ఇంజిన్ | 199.5cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ | 199.5cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ | 197.8cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ & ఆయిల్ కూల్డ్ |
| పవర్ | 25.5hp @ 10,250rpm | 25hp @ 10,000rpm | 20.8hp @ 9,000rpm |
| టార్క్ | 18.7Nm @ 8,000rpm | 19.3Nm @ 8,000rpm | 17.3Nm @ 7,250rpm |
| గేర్‌బాక్స్ | 6-స్పీడ్ | 6-స్పీడ్ | 5-స్పీడ్ |
| పవర్ టు వెయిట్ రేషియో | 161.39hp/టన్ | 157.29hp/టన్ | 137.88hp/టన్ |
డైమెన్షన్లు & బరువు
సీట్ ఎత్తు విషయంలో TVS Apache RTR 200 4V ముందుంది. దీని సీట్ ఎత్తు 800mm మాత్రమే. అందువల్ల ఎక్కువ మంది రైడర్లకు అందుబాటులో ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ (180mm) కూడా ఈ బైక్‌లోనే ఎక్కువగా ఉంది.
Pulsar NS200 ఈ రెండు అంశాల్లో రెండో స్థానంలో నిలుస్తుంది. బరువు విషయంలో Apache 151kgతో తక్కువ బరువు కలిగి ఉంది. KTM 200 Duke బరువు 155kg కాగా, దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లు. మిగతా రెండు బైక్‌లలో 12 లీటర్ల ట్యాంక్ ఉంటుంది.
వీల్‌బేస్ విషయంలో NS200 1365mmతో ముందుంది. దీని వల్ల హైవేపై స్థిరత్వంలో స్వల్ప ప్రయోజనం ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Vehicle VIP Number: 9999, 0001 వంటి ఫ్యాన్సీ నంబర్లు పొందడం ఎలా? Parivahan పోర్టల్‌లో అప్లై చేసుకునే విధానం ఇదిగో
టైర్లు, బ్రేకులు, సస్పెన్షన్
కొత్త అప్‌డేట్‌లో NS200 వెనుక టైర్‌ను Radial Ply టైర్‌గా మార్చారు. అయితే టైర్ పరిమాణంలో మార్పు లేదు. KTM 200 Dukeలో ఈ మూడింటిలోనే పెద్ద టైర్లు ఉన్నాయి. ముందు, వెనుక రెండు వైపులా Radial Tyres అందించే ఏకైక బైక్ కూడా ఇదే.
ఫ్రంట్ బ్రేక్ పరిమాణం, సస్పెన్షన్ విషయంలోనూ KTMకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మరోవైపు Apache RTR 200 4Vలో టాప్ వేరియంట్‌కు USD ఫోర్క్‌లో అడ్జస్టబుల్ ప్రీలోడ్ సదుపాయం ఉంది. ఈ బైక్‌లో వెనుక డిస్క్ బ్రేక్ 240mmతో మిగతా రెండింటి కంటే పెద్దది. అయితే ఫ్రంట్ డిస్క్ మాత్రం 270mmతో చిన్నది. మూడు బైక్‌లలోనూ వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. వీటన్నింటిలో స్టాండర్డ్‌గా అడ్జస్టబుల్ ప్రీలోడ్ సదుపాయం లభిస్తుంది.
ఫీచర్లు
కొత్త అప్‌డేట్‌తో మూడు బైక్‌లలోనూ ఫీచర్లు మెరుగయ్యాయి.
Pulsar NS200లో ఇప్పుడు 5-అంగుళాల TFT డిస్‌ప్లే, రైడ్-బై-వైర్, రైడ్ మోడ్‌లు, గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, బజాజ్ స్పోర్ట్ షిఫ్టర్, క్రాల్ టెక్ & ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి. బజాజ్ స్పోర్ట్ షిఫ్టర్ అనేది రెండు దిశల్లో పనిచేసే Quickshifterకు తక్కువ ఖర్చుతో అందించే ప్రత్యామ్నాయంగా రూపొందించారు. తక్కువ వేగంతో బైక్‌ను నడపడం సులభం చేయడానికి Crawl Tech ఉపయోగపడుతుంది.
KTM 200 Dukeకు కూడా అప్‌డేట్ వచ్చింది. ఇందులో రెండు రైడ్ మోడ్‌లు, రైడ్-బై-వైర్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, క్రాల్ అసిస్ట్ & ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి. 2024లోనే ఈ బైక్‌కు 5-అంగుళాల TFT డిస్‌ప్లే వచ్చింది. అయితే Google Maps Mirroring సదుపాయం లేదు. కేవలం టర్న్-బై-టర్న్ నావిగేషన్ మాత్రమే అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
TVS Apache RTR 200 4V ఫీచర్ల విషయంలో ఎప్పటి నుంచో ముందుంది. సెప్టెంబర్ మధ్యలో వచ్చిన అప్‌డేట్‌తో 5-అంగుళాల TFT డిస్‌ప్లేకు గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, ట్రాక్షన్ కంట్రోల్ జోడించారు. అయితే ఇందులో ఇప్పటికీ సంప్రదాయ కేబుల్ థ్రాటిల్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ బైక్‌లో 2020 నుంచే రైడ్ మోడ్‌లు ఉన్నాయి. TVSకు చెందిన గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT) ఫీచర్ 2019 నుంచే అందుబాటులో ఉంది.
ధరలు
| బైక్ | ఎక్స్‌షోరూమ్ ధర |
|---|---|
| Bajaj Pulsar NS200 | రూ.1.60 లక్షలు |
| KTM 200 Duke | రూ.2.07 లక్షలు |
| TVS Apache RTR 200 4V | రూ.1.50 లక్షలు |
ఈ అప్‌డేట్‌తో NS200 ధరలోనే అత్యధిక పెరుగుదల నమోదైంది. గతంలో రూ.1.48 లక్షలుగా ఉన్న ధర ఇప్పుడు సుమారు రూ.12,000 పెరిగి రూ.1.60 లక్షలకు చేరింది. KTM 200 Duke ధర సుమారు రూ.1,500 పెరిగింది.
ఈ మూడు బైక్‌లలో TVS Apache RTR 200 4V అత్యంత చవకైన మోడల్. దీని ధర రూ.1.50 లక్షలు. అయితే తక్కువ ధరకు అనుగుణంగా పనితీరు విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. KTM 200 Duke రూ.2.07 లక్షలతో అత్యంత ఖరీదైన బైక్‌గా నిలిచింది.
ఇంకా ఎక్కువ పనితీరు కావాలనుకునేవారు Yamaha R2ను కూడా పరిశీలించవచ్చు. దీని ధర రూ.2.30 లక్షల నుంచి రూ.2.53 లక్షల వరకు ఉంది. ప్రస్తుతం 200cc విభాగంలో అత్యధిక పవర్ అందించే, అత్యంత ఖరీదైన బైక్ ఇదే.
మొత్తంగా చూస్తే, పవర్ విషయంలో కొత్త Pulsar NS200 ముందుంది. టార్క్, టైర్ల పరిమాణం విషయంలో KTM 200 Dukeకు ప్రయోజనం ఉంది. తక్కువ సీట్ ఎత్తు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ & తక్కువ ధర కోరుకునేవారికి Apache RTR 200 4V మరో ఎంపికగా నిలుస్తుంది. ఈ మూడింటిలో ఏది సరైనదో నిర్ణయించుకోవడానికి ప్రతి బైక్‌పై టెస్ట్ రైడ్ చేయడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















