Maruti Car Diwali Offers: మారుతి కార్లపై నవంబర్ ఆఫర్లు.. Wagon R, Alto K10 సహా చాలా మోడళ్లపై రూ.1.51 లక్షల వరకు డిస్కౌంట్లు!
Maruti Car Diwali 2026 Offers: నవంబర్ 2026లో మారుతి కార్లపై రూ.1.51 లక్షల వరకు ఆఫర్లు. విక్టోరిస్, వ్యాగన్ ఆర్, ఆల్టో K10 సహా మోడళ్ల వారీగా డిస్కౌంట్లు తెలుసుకోండి.

Maruti Car Offers November 2026: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లు మారుతి సుజుకి అందిస్తున్న ఆఫర్లను ఓసారి పరిశీలించండి. ఆఫర్ల లిస్ట్‌లో విక్టోరిస్, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, ఆల్టో K10 వంటి పాపులర్ మోడళ్లు ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్లు, పాత వాహనాన్ని మార్చుకున్నప్పుడు ఇచ్చే బోనస్, తుక్కు వాహన ప్రయోజనం, ప్రత్యేక విక్రయ ఆఫర్లు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు (నవంబర్ 30, 2026) వరకు అందుబాటులో ఉంటాయి.
మారుతి విక్టోరిస్‌పై రూ.1.51 లక్షల వరకు ఆఫర్లు
మారుతి విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై అత్యధికంగా రూ.1.51 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.20,000 వరకు నగదు తగ్గింపు, నవంబర్ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉండే రూ.11,000 వరకు "దీపావళి బుకింగ్ ఆఫర్" ఉన్నాయి. వీటితో పాటు రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.30,000 వరకు లాయల్టీ బోనస్, రూ.15,000 వరకు ప్రత్యేక విక్రయ ఆఫర్ లభిస్తాయి.
హ్యుందాయ్ ఐ10, ఐ20, టాటా టియాగో, నెక్సాన్, మహీంద్రా XUV 3XO వాహనాలను మార్చుకుని కొత్త విక్టోరిస్ కొనేవారికి అదనంగా రూ.15,000 వరకు పోటీ సంస్థల వాహన మార్పిడి బోనస్ కూడా ఉంది. పాత వాహనాన్ని తుక్కుగా ఇచ్చేవారికి రూ.45,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. అయితే, ఎక్స్ఛేంజ్ బోనస్, తుక్కు వాహన బోనస్ రెండింటినీ కలిపి పొందలేరు.
పెట్రోల్, CNG వేరియంట్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. అయితే, వీటికి నగదు తగ్గింపు ఉండదు. ఎక్స్ఛేంజ్, తుక్కు వాహన బోనస్‌లు కూడా తక్కువగా ఉంటాయి. విక్టోరిస్ ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి.
వ్యాగన్ ఆర్‌పై రూ.64,600 వరకు ప్రయోజనాలు
మారుతి వ్యాగన్ ఆర్ 1.0 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్లపై రూ.54,600 వరకు ప్రయోజనాలు ప్రకటించారు. ఇందులో రూ.35,000 వరకు నగదు తగ్గింపు, రూ.7,100 వరకు దీపావళి బుకింగ్ ఆఫర్ ఉన్నాయి. పాత వాహనాన్ని మార్చుకుంటే రూ.15,000 వరకు బోనస్ లేదా తుక్కుగా ఇస్తే రూ.10,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. అదనంగా రూ.2,500 వరకు విక్రయ ఆఫర్ కూడా ఉంది. CNG వేరియంట్లపై నగదు తగ్గింపు రూ.20,000 వరకు మాత్రమే. వ్యాగన్ ఆర్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.86 లక్షల వరకు ఉంది.
ఇది కూడా చదవండి: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
ఆల్టో K10, సెలెరియోపై తగ్గింపులు
ఆల్టో K10 పెట్రోల్ వేరియంట్లపై రూ.54,600 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.25,000 వరకు నగదు తగ్గింపు, రూ.7,100 దీపావళి బుకింగ్ ఆఫర్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.10,000 వరకు తుక్కు వాహన ప్రయోజనం, రూ.2,500 విక్రయ ఆఫర్ ఉన్నాయి. CNG వేరియంట్లకు రూ.10,000 వరకు మాత్రమే నగదు తగ్గింపు ఉంటుంది. దీపావళి బుకింగ్ ఆఫర్ వర్తించదు. ఆల్టో K10 ధర రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంది.
సెలెరియో పెట్రోల్ వేరియంట్లపైనా ఆల్టో K10 తరహాలో రూ.54,600 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. CNG వేరియంట్లకు దీపావళి బుకింగ్ ఆఫర్ ఉండదు. దీంతో మొత్తం ప్రయోజనం రూ.47,500 వరకు పరిమితమవుతుంది. సెలెరియో ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.75 లక్షల వరకు ఉంది.
స్విఫ్ట్, ఈకో, ఎస్-ప్రెస్సోపై ఆఫర్లు
మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్లపై రూ.50,100 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. రూ.15,000 వరకు నగదు తగ్గింపు, రూ.5,100 దీపావళి బుకింగ్ ఆఫర్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.10,000 వరకు తుక్కు వాహన ప్రయోజనం, రూ.5,000 విక్రయ ఆఫర్ ఇందులో ఉన్నాయి. CNG వేరియంట్లకు నగదు తగ్గింపు, దీపావళి బుకింగ్ ఆఫర్ ఉండవు. వాటిపై రూ.30,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి.
మారుతి ఈకో పెట్రోల్ వేరియంట్లపై రూ.49,600 వరకు ఆఫర్లు ఉన్నాయి. రూ.15,000 వరకు నగదు తగ్గింపు, రూ.7,100 దీపావళి బుకింగ్ ఆఫర్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2,500 విక్రయ ఆఫర్ లభిస్తాయి. ఈ మోడల్‌కు తుక్కు వాహన బోనస్ లేదు. CNG వేరియంట్లపై రూ.32,500 వరకు ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: E20 పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం.. ఎక్కువ ఇథనాల్ కలుపుతున్నారని, రిపేర్లు పెరిగాయని ఆరోపణ
ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్లపై రూ.37,500 వరకు ఆఫర్లు ప్రకటించారు. ఇందులో రూ.10,000 వరకు నగదు తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.10,000 వరకు తుక్కు వాహన ప్రయోజనం, రూ.2,500 విక్రయ ఆఫర్ ఉన్నాయి. CNG వేరియంట్లకు నగదు తగ్గింపు ఉండదు. ఎస్-ప్రెస్సో ధర రూ.3.50 లక్షల నుంచి రూ.5.27 లక్షల వరకు ఉంది.
ఈ కార్లపై అధికారిక ఆఫర్లు లేవు
మారుతి డిజైర్, ఎర్టిగా, బ్రెజ్జా మోడళ్లపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రయోజనాలను కంపెనీ ప్రకటించలేదు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు. ఆఫర్లు డీలర్‌షిప్, నగరం, వాహన నిల్వలను బట్టి మారవచ్చు. కాబట్టి బుకింగ్ చేసే ముందు తుది తగ్గింపు వివరాలను డీలర్ వద్ద నిర్ధారించుకోవాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















