అన్వేషించండి

E20 Petrol Dispute: E20 పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం.. ఎక్కువ ఇథనాల్‌ కలుపుతున్నారని, రిపేర్లు పెరిగాయని ఆరోపణ

పెట్రోల్‌లో 31.2% వరకు ఇథనాల్ ఉందన్న ఆరోపణలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఖండించాయి. శాంపిళ్ల పరీక్షలన్నీ E20 ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని వెల్లడించాయి.

Ethanol Blending In E20 Petrol: భారత్‌లో E20 పెట్రోల్ వినియోగంపై మరోసారి వివాదం మొదలైంది. కర్ణాటకలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో.. ఇంధనంలో ఇథనాల్ శాతం అనుమతించిన 20 శాతం కంటే ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. కొన్ని శాంపిళ్లలో ఇథనాల్ శాతం 31.2% వరకు నమోదైనట్లు వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన IOCL, BPCL, HPCL తీవ్రంగా ఖండించాయి.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల విధానం నిబంధనలకు అనుగుణంగా లేదని ఆ కంపెనీలు తెలిపాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన 893 E20 ఇంధన శాంపిళ్ల పరీక్షల్లో అన్ని నమూనాలు IS 17021 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని వెల్లడించాయి. కర్ణాటక నుంచి సేకరించిన 56 శాంపిళ్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించాయి.

E20 పెట్రోల్ అంటే ఏమిటి?

E20 అనేది 20 శాతం ఇథనాల్ & 80 శాతం పెట్రోల్ కలిపి తయారు చేసే ఇంధనం. ముడిచమురు దిగుమతులను తగ్గించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం & దేశీయంగా చక్కెర, ధాన్యాల రైతులకు మద్దతు ఇవ్వడం ఈ విధానం ముఖ్య ఉద్దేశాలు. అయితే, ఇథనాల్ మోతాదు నిర్ణీత పరిమితిని మించితే వాహనాల పనితీరు, ఇంజిన్‌లోని కొన్ని భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ ప్రతినిధులు గతంలోనూ ఆందోళనలు వ్యక్తం చేశారు.

కర్ణాటక ప్రభుత్వం ఆరోపణలు ఏమిటి?

Reuters నివేదిక ప్రకారం, కర్ణాటక ప్రభుత్వం ఏడు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల నుంచి 63 ఇంధన శాంపిళ్లను సేకరించి పరీక్షించింది. తాము కోరిన ఇథనాల్ డేటాను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) అందించకపోవడంతో ఈ విచారణ చేపట్టినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: యూజ్డ్ కార్ల ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ఈజీ.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

కర్ణాటక ఆహార, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ మీడియా సమావేశం నిర్వహించి, పరీక్షల ఫలితాలను వెల్లడించారు. OMCలు నిర్వహించే పెట్రోల్ బంకుల నుంచి సేకరించిన కొన్ని నమూనాల్లో ఇథనాల్ శాతం 26% నుంచి 31.2% వరకు నమోదైనట్లు చెప్పారు. భారత్‌లోని చాలా వాహనాలు పూర్తిగా E20 ఇంధనానికి అనుగుణంగా లేవని చెప్పిన మంత్రి.. E20కి అనుగుణంగా ఉన్న వాహనాల్లోనూ ఇథనాల్ శాతం నిర్ణీత పరిమితిని మించితే పనితీరు సమస్యలు రావచ్చని వెల్లడించారు.

వాహనదారులకు మైలేజ్ నష్టంతో పాటు రిపేర్ల ఖర్చు కూడా పెరుగుతోందని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అధిక ఇథనాల్ కలపడం వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.62,000 కోట్ల మైలేజ్ నష్టం, రూ.39,000 కోట్ల వాహన మరమ్మతుల ఖర్చు వస్తోందని అంచనా వేసింది. ఈ రెండు కలిపి రూ.1.01 లక్షల కోట్లుగా పేర్కొంది.

వాహనదారులకు పరిహారం అందించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, చమురు శుద్ధి సంస్థలు కూడా దీనికి బాధ్యత వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక కోరింది.

చమురు సంస్థల వాదన ఏమిటి?

కర్ణాటక ఆరోపణలను IOCL, BPCL, HPCL ఖండించాయి. దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న E20 పెట్రోల్ BIS నిర్దేశించిన IS 17021 ప్రమాణాలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం 2026 అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో తప్పనిసరి శాంప్లింగ్ విధానాలను పాటించలేదని సంస్థలు ఆరోపించాయి.  నిబంధనల ప్రకారం, OMC ప్రతినిధుల సమక్షంలో ఒక లీటర్ శాంపిళ్లను ఆరు సేకరించాలి. వాటిపై సంబంధిత వ్యక్తుల సంతకాలు తీసుకుని డీలర్లు, రిఫైనరీలు & గుర్తింపు పొందిన షెడ్యూల్‌ III ల్యాబొరేటరీలకు పంపాలి. కానీ కర్ణాటక పరీక్షల్లో ఇలాంటి విధానం పాటించలేదని, మరోసారి స్వతంత్రంగా పరీక్షించడానికి అవసరమైన శాంపిళ్లు, పెట్రోల్ బంకుల స్థాయి పూర్తి వివరాలు అందుబాటులో లేవని సంస్థలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: 204cc ఇంజిన్‌, 26hp పవర్‌తో Yamaha R2.. యూత్‌ స్పీడ్‌కు తగ్గ యాక్సిలరేషన్‌, బ్రేకింగ్‌ ఉన్నట్లేనా?

టెస్టింగ్‌ విధానంపైనా అభ్యంతరాలు

ఇథనాల్ శాతాన్ని పరీక్షించే విధానంలోనూ లోపాలున్నాయని చమురు సంస్థలు పేర్కొన్నాయి. IS 17021 ప్రకారం, గ్యాస్ క్రోమాటోగ్రఫీ పరీక్షలో ఆక్సిజనేట్ లేని పెట్రోల్‌తో 1:1 నిష్పత్తిలో డైల్యూషన్ చేయాలి. E10 సర్టిఫైడ్ రిఫరెన్స్ మెటీరియల్ ఆధారంగా ఫలితాలను సరిచూడాలి. కానీ, రాష్ట్రం సమర్పించిన టెస్ట్‌ సర్టిఫికెట్లలో “ఇథనాల్ % బై గ్యాస్ క్రోమాటోగ్రఫీ” అని మాత్రమే ఉందని, ఉపయోగించిన నిర్దిష్ట పరీక్షా ప్రమాణాలు, డైల్యూషన్ విధానం వివరాలు లేవని సంస్థలు తెలిపాయి.

893 శాంపిళ్ల పరీక్షల్లో ఏం తేలింది?

OMCలు.. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 893 శాంపిళ్లను పరిశీలించాయి. వీటిలో కర్ణాటకకు చెందినవి 56 ఉన్నాయి. కర్ణాటక శాంపిళ్లలో సగటు ఇథనాల్ శాతం 19.30గా నమోదైందని సంస్థలు వెల్లడించాయి. మొత్తం 893 శాంపిళ్లలో 100 శాతం నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రకటించాయి. అధికారికంగా అనుమతించిన పరిధి 19% నుంచి 21% మధ్య ఉంటుందని పేర్కొన్నాయి.

వాహనాల మైలేజ్‌పై E20 ప్రభావం

E20 ఇంధనం వాడుతున్న వాహనాల విషయంలోనూ చమురు సంస్థలు తమ వాదన వినిపించాయి. దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 4 కోట్లకు పైగా నాలుగు చక్రాల వాహనాలు ప్రతిరోజూ E20 ఇంధనంతో నడుస్తున్నాయని తెలిపాయి. అయితే, పెద్ద ఎత్తున యాంత్రిక సమస్యలు నమోదైనట్లు ఆధారాలు లేవని పేర్కొన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

204cc ఇంజిన్‌, 26hp పవర్‌తో Yamaha R2.. యూత్‌ స్పీడ్‌కు తగ్గ యాక్సిలరేషన్‌, బ్రేకింగ్‌ ఉన్నట్లేనా?
Yamaha R2పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌: 9 సెకన్లలోనే 0-100kph స్పీడ్‌, R15 కంటే బెటరేనా?
Driving Licence Rules: LLR ఉంది కదాని నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లలేరు.. లైసెన్స్‌ పొందాలంటే కొత్త నిబంధనలు ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఈ ఆరు వీడియోలు చూడకపోతే మీకు DL రాదు!
Pre-Owner Vehicle Transfer: యూజ్డ్ కార్ల ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ఈజీ.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు, అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్.. చివరి స్థానం ఏ రాష్ట్రానిదంటే?
Honda Bikes ADAS: బైకుల్లో కూడా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. హోండా కొత్త Sensing Ride సిస్టమ్ ప్రత్యేకతలు ఇవే
హోండా బైక్‌లో ADAS టెక్నాలజీ.. ఏకంగా 10 రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
CM Chandrababu: ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Bigg Boss Season 10 Today November 6th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
Lynn Cocaine Ban: డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
Embed widget