అన్వేషించండి

Driving Licence Rules: LLR ఉంది కదాని నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లలేరు.. లైసెన్స్‌ పొందాలంటే కొత్త నిబంధనలు ఇవే!

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆరు ఆన్‌లైన్ వీడియోలు చూడడం తప్పనిసరి. LLR నంబర్‌తో లాగిన్ అయి కోర్సు పూర్తి చేసే విధానం, స్లాట్ బుకింగ్ వివరాలు తెలుసుకోండి.

New Driving Licence Rules 2026: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని భావిస్తున్నారా? ఇప్పటికే లెర్నింగ్ లైసెన్స్ ‍‌(LLR) తీసుకున్నారా? అయితే మీకో ముఖ్యమైన విషయం. ఇకపై లెర్నింగ్ లైసెన్స్ నుంచి శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌కు వెళ్లడం అంత సులభం కాదు. డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యే ముందు మరో కీలక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆరు ప్రత్యేక వీడియోలను తప్పనిసరిగా చూడాలి. వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

తెలంగాణ వ్యాప్తంగా కొత్త విధానం

రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం, రాష్ట్ర రవాణా శాఖ వీడియో పాఠాల విధానాన్ని ప్రవేశపెట్టింది. తొలుత ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారు. అక్కడ వచ్చిన అనుభవాల ఆధారంగా ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు విస్తరించారు.

గతంలో లెర్నింగ్ లైసెన్స్ (LLR) పొందిన తర్వాత నిర్ణీత వ్యవధి పూర్తికాగానే డ్రైవింగ్ లైసెన్స్ కోసం నేరుగా స్లాట్ బుక్ చేసుకునేవారు. అనంతరం డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు ఆ విధానంలో మార్పు వచ్చింది. స్లాట్ బుకింగ్‌కు ముందే ఆన్‌లైన్ శిక్షణను (ఆరు వీడియోలు చూడడం) పూర్తి చేయడం తప్పనిసరి చేశారు.

ఆరు వీడియోల్లో ఏముంటాయి?

తెలంగాణ రవాణా శాఖ అందిస్తున్న ఈ ఆన్‌లైన్ కోర్సులో మొత్తం ఆరు వీడియోలు ఉంటాయి. వీటిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, రహదారి సూచికలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి అంశాలను వివరించారు. వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలు, రవాణా శాఖకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు కూడా ఇందులో ఉంటాయి.

ఒక్కో వీడియో నిడివి సుమారు 22 నుంచి 25 నిమిషాలు ఉంటుంది. వీడియో పూర్తయిన తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానాలు ఇవ్వాలి. మొత్తం ఆరు వీడియోలను పూర్తి చేయడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుంది.

ఇది కూడా చదవండి: యూజ్డ్ కార్ల ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ఈజీ.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

వీడియో కోర్సును ఎలా పూర్తి చేయాలి?

ఈ కోర్సును పూర్తి చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ద్వారా పూర్తి చేయవచ్చు.

ముందుగా తెలంగాణ రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ tgtransport.online ను తెరవాలి. అందులో మీ లెర్నింగ్ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. అనంతరం దరఖాస్తుదారుడి మొబైల్ ఫోన్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. ఆ కోడ్‌ను నమోదు చేసి లాగిన్ కావాలి.

లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్ కోర్సును ఎంచుకోవాలి. అందులో కనిపించే ఆరు వీడియోలను వరుసగా చూడాలి. ప్రతి వీడియో తర్వాత వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇలా ఒక్కో దశను పూర్తి చేసుకుంటూ కోర్సును ముగించాలి.

ఇది కూడా చదవండి: Honda Bikes ADAS: బైకుల్లో కూడా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. హోండా కొత్త Sensing Ride సిస్టమ్ ప్రత్యేకతలు ఇవే

ఒకేసారి చూడాల్సిన అవసరం లేదు

ఇక్కడ దరఖాస్తుదారులకు మరో వెసులుబాటు కూడా ఉంది. ఆరు వీడియోలను ఒకేసారి చూడాల్సిన అవసరం లేదు. మధ్యలో కోర్సును నిలిపివేయవచ్చు. మళ్లీ ఖాళీ సమయం దొరికినప్పుడు వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఎక్కడ ఆపారో అక్కడి నుంచి కొనసాగించవచ్చు. ఇప్పటికే చూసిన వీడియో/వీడియోలు, పూర్తి చేసిన భాగాల వివరాలు వెబ్‌సైట్‌లో భద్రంగా ఉంటాయి. దీంతో మళ్లీ మొదటి నుంచి కోర్సు చూడాల్సిన ఇబ్బంది ఉండదు.

కోర్సు పూర్తయితేనే స్లాట్ బుకింగ్

ఆరు వీడియోలు, వాటికి సంబంధించిన ప్రశ్నల ప్రక్రియ పూర్తయిన వెంటనే దరఖాస్తుదారుడి శిక్షణ పూర్తి చేసిన ధ్రువీకరణ వివరాలు ఎల్‌ఎల్‌ఆర్‌తో అనుసంధానమవుతాయి. ఆ తర్వాతే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.

అంటే ఇకపై డ్రైవింగ్ పరీక్షకు వెళ్లే ముందు ఈ ఆన్‌లైన్ కోర్సును తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షకు వచ్చే వారికి, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి సిబ్బంది వివరాలు తెలియజేస్తున్నారు. కార్యాలయాల్లో నోటీసులు సైతం ఏర్పాటు చేశారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pre-Owner Vehicle Transfer: యూజ్డ్ కార్ల ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ఈజీ.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు, అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్.. చివరి స్థానం ఏ రాష్ట్రానిదంటే?
Honda Bikes ADAS: బైకుల్లో కూడా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. హోండా కొత్త Sensing Ride సిస్టమ్ ప్రత్యేకతలు ఇవే
హోండా బైక్‌లో ADAS టెక్నాలజీ.. ఏకంగా 10 రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Hyundai Bluelink Insurance: హ్యుందాయ్ బ్లూలింక్‌ కస్టమర్లకు బీమా బెనిఫిట్స్‌... డ్రైవింగ్ స్కోర్ ఆధారంగా అదనపు ప్రయోజనాలు
మీ డ్రైవింగ్ అలవాట్లతో కారు ఇన్సూరెన్స్ ఖర్చు తగ్గించుకోవచ్చు.. హ్యుందాయ్ కొత్త UBI ప్రోగ్రామ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
CM Chandrababu: ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Bigg Boss Season 10 Today November 6th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
Lynn Cocaine Ban: డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
Embed widget