అన్వేషించండి

High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం

HSRP నంబర్ ప్లేట్ల ప్రయోజనాలు, ప్రత్యేకతలు, రంగుల వివరాలు, ధరలు & ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విధానం గురించి తెలుసుకోండి.

High-Security Number Plate: వాహనాల భద్రతను పెంచడం, వాహన దొంగతనాలను అరికట్టడం లక్ష్యంగా "హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌" (HSRP) విధానం అమల్లోకి వచ్చింది. 2019 జనవరి 1 నుంచి తయారైన అన్ని వాహనాలకు HSRP నంబర్ ప్లేట్లు తప్పనిసరి. అంతకంటే ముందు కొనుగోలు చేసిన వాహనాల యజమానులు కూడా తమ పాత నంబర్ ప్లేట్ల స్థానంలో HSRP ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలి.

HSRP నంబర్ ప్లేట్‌ అంటే ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత ఉంటుంది? ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

HSRP అంటే ఏమిటి?

HSRP అనేది వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఒకే విధమైన ప్రమాణాలతో ప్రదర్శించే ప్రత్యేక నంబర్ ప్లేట్. ఇవి బలమైన అల్యూమినియంతో తయారవుతాయి. వీటిపై రిఫ్లెక్టివ్‌ షీటింగ్ ఉంటుంది. దానిపై ‘IND’ గుర్తు & క్రోమియం ఆధారిత ‘చక్ర’ హోలోగ్రామ్‌ను హాట్‌ స్టాంపింగ్‌ ద్వారా ముద్రిస్తారు.

ప్రతి HSRP ప్లేట్‌పై కనీసం 10 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు నంబర్ ఉంటుంది. దీనికి ముందు రెండు ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. ఈ నంబర్‌ను ప్లేట్ దిగువ ఎడమవైపు లేజర్‌ బ్రాండింగ్‌ ద్వారా ముద్రిస్తారు.

వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌పై పైకి ఉబ్బినట్లు ఉంటుంది. అలాగే నల్లటి ఫాయిల్‌తో హాట్‌ స్టాంపింగ్‌ చేసిన ‘INDIA’ అనే అక్షరాలను ముద్రిస్తారు.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ బ్లూలింక్‌ కస్టమర్లకు బీమా బెనిఫిట్స్‌... డ్రైవింగ్ స్కోర్ ఆధారంగా అదనపు ప్రయోజనాలు

వాహన రకాన్ని బట్టి HSRP రంగులు

HSRP ప్లేట్ల రంగులు వాహనం రకం & ఇంధన విధానాన్ని బట్టి మారుతాయి.

- ప్రైవేట్ వాహనాలు: తెలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై నల్లటి అక్షరాలు.
- కమర్షియల్ వాహనాలు: పసుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై నల్లటి అక్షరాలు.
- ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలు: ఆకుపచ్చ రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెల్లటి అక్షరాలు.
- కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలు: ఆకుపచ్చ రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై పసుపు అక్షరాలు.
- పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే క్యాబ్‌లు: నల్లటి బ్యాక్‌గ్రౌండ్‌పై పసుపు అక్షరాలు.
- ఎలక్ట్రిక్ క్యాబ్‌లు: ఆకుపచ్చ బ్యాక్‌గ్రౌండ్‌పై నల్లటి అక్షరాలు.

HSRP నంబర్ ప్లేట్ల వల్ల ప్రయోజనాలు

గతంలో వాహన యజమానులు తమకు నచ్చిన ఫాంట్లు, స్టైల్స్‌తో నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. దీంతో, కొన్ని ప్లేట్లపై రిజిస్ట్రేషన్ నంబర్లు స్పష్టంగా కనిపించేవి కావు. HSRP ప్లేట్లలో అక్షరాలు, అంకెలకు ఒకే విధమైన ప్రమాణాలు ఉంటాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు & ఇతర అధికారులు వాహన నంబర్లను సులభంగా గుర్తించగలరు. వాహనం కదులుతున్నప్పుడు కూడా నంబర్‌ను చదవడం సులభమవుతుంది.

ఇది కూడా చదవండి: Hyundai Bayon SUV రివ్యూ.. ప్రీమియం ఇంటీరియర్, 360 కెమెరా, ADAS.. కొన్ని లోపాలూ ఉన్నాయ్‌!

అధికారిక డీలర్ల ద్వారానే ఏర్పాటు

HSRP ప్లేట్లను సంబంధిత రాష్ట్ర అధికారులు అనుమతించిన విక్రేతల ద్వారా మాత్రమే పొందాలి. బుకింగ్ సమయంలో వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్‌ నంబర్‌ & ఇంజిన్ నంబర్‌ వంటి వివరాలను అందించాలి. దీనివల్ల ప్రతి నంబర్ ప్లేట్ ఒక నిర్దిష్ట వాహనానికి అనుసంధానమవుతుంది.

తొలగించడం, మార్పులు చేయడం కష్టం

సాధారణ నంబర్ ప్లేట్లను సులభంగా తొలగించడం లేదా మార్చడం సాధ్యమయ్యేది. దొంగిలించిన వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండేది. HSRP ప్లేట్లలో ప్రత్యేక లాక్‌లు ఉపయోగిస్తారు. వీటిని సులభంగా తొలగించడం లేదా మళ్లీ ఉపయోగించడం సాధ్యం కాదు. దీంతో నంబర్ ప్లేట్లను తారుమారు చేయడం కష్టమవుతుంది. దొంగిలించిన వాహనాలను గుర్తించడంలో కూడా అధికారులకు సహాయపడుతుంది.

వాహనాల వివరాల నిర్వహణ

HSRP వ్యవస్థ ద్వారా వాహన రిజిస్ట్రేషన్, ఛాసిస్‌ నంబర్‌ & ఇంజిన్ నంబర్‌ వంటి వివరాలను కేంద్ర డేటాబేస్‌లో నిర్వహించేందుకు వీలుంటుంది. అవసరమైనప్పుడు వాహన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. వాహనాన్ని ట్రేస్ చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

HSRP కలర్ కోడెడ్ స్టిక్కర్ అంటే ఏమిటి?

HSRP నంబర్ ప్లేట్‌తో పాటు వాహనం విండ్‌షీల్డ్‌పై ప్రత్యేక స్టిక్కర్‌ను కూడా అతికిస్తారు. వాహనం పవర్‌ట్రెయిన్ & రకాన్ని బట్టి ఈ స్టిక్కర్ రంగు మారుతుంది.

ఈ స్టిక్కర్‌పై రిజిస్ట్రేషన్ చేసిన అధికార సంస్థ పేరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, లేజర్‌ బ్రాండింగ్‌ ద్వారా ముద్రించిన ప్రత్యేక గుర్తింపు నంబర్ & మొదటి రిజిస్ట్రేషన్ తేదీ వంటి వివరాలు ఉంటాయి. ఇంధన ఉద్గారాలకు సంబంధించిన నిబంధనలను అమలు చేయడంలో ట్రాఫిక్ అధికారులకు ఇవి సహాయపడతాయి.

HSRP నంబర్ ప్లేట్ ధర ఎంత?

HSRP ప్లేట్ల ధర రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. 

HSRP నంబర్ ప్లేట్ కోసం ఎలా అప్లై చేయాలి?

కొత్త వాహనం కొనుగోలు చేసినవాళ్లు HSRP ఏర్పాటు కోసం తమ వాహన డీలర్‌ను సంప్రదించవచ్చు. 2019 ఏప్రిల్‌కు ముందు తయారైన లేదా రిజిస్టర్ అయిన వాహనాలకు HSRP అవసరమైతే ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు.

1. ముందుగా [www.bookmyhsrp.com](https://bookmyhsrp.com/) వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
2. నంబర్ ప్లేట్ ఏర్పాటు చేయించుకునే ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
3. HSRP విత్ స్టిక్కర్ లేదా కేవలం స్టిక్కర్ అనే బుకింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
4. వాహనం రకాన్ని Private లేదా Commercialగా ఎంపిక చేయాలి.
5. ఇంధన రకాన్ని ఎంచుకోవాలి. ఇందులో Petrol, Diesel, EV, CNG & Petrol-CNG ఆప్షన్లు ఉంటాయి.
6. వాహన రకాన్ని ఎంచుకోవాలి. ఇందులో 2W, 3W, 4W, Heavy & Others ఆప్షన్లు ఉంటాయి.
7. వాహన తయారీ కంపెనీ పేరును ఎంపిక చేయాలి.
8. మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
9. HSRP ఏర్పాటు చేయించుకునే డీలర్ లొకేషన్ లేదా ఇంటి వద్ద ఏర్పాటు చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
10. అవసరమైన వివరాలు నమోదు చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను ఎంటర్ చేయాలి.
11. అందుబాటులో ఉన్న తేదీ & సమయాన్ని ఎంపిక చేయాలి.
12. GST రిజిస్ట్రేషన్ ఉంటే GST నంబర్‌ను నమోదు చేయాలి.
13. ఆన్‌లైన్‌లో చెల్లింపు పూర్తి చేయాలి.
14. బుకింగ్ నిర్ధారణ కోసం SMS లేదా ఈ-మెయిల్‌ను తనిఖీ చేయాలి.

ఫిట్‌మెంట్ సమయంలో ఏ పత్రాలు తీసుకెళ్లాలి?

HSRP ఏర్పాటు కోసం ఫిట్‌మెంట్ సెంటర్‌కు వెళ్లేటప్పుడు ఆన్‌లైన్ చెల్లింపు నిర్ధారణ రసీదు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అలాగే వాహనం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (RC) కూడా వెంట ఉంచుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyundai Bluelink Insurance: హ్యుందాయ్ బ్లూలింక్‌ కస్టమర్లకు బీమా బెనిఫిట్స్‌... డ్రైవింగ్ స్కోర్ ఆధారంగా అదనపు ప్రయోజనాలు
మీ డ్రైవింగ్ అలవాట్లతో కారు ఇన్సూరెన్స్ ఖర్చు తగ్గించుకోవచ్చు.. హ్యుందాయ్ కొత్త UBI ప్రోగ్రామ్
Hyundai Bayon SUV రివ్యూ.. ప్రీమియం ఇంటీరియర్, 360 కెమెరా, ADAS.. కొన్ని లోపాలూ ఉన్నాయ్‌!
హ్యుందాయ్‌ బేయాన్‌ రివ్యూ: మారుతి విక్టోరిస్‌కు రైవల్‌.. పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Italjet Scooters: ఇండియన్ మార్కెట్లోకి 3 ఇటాల్‌జెట్‌ స్కూటర్లు.. బ్రెంబో బ్రేక్స్, ట్విన్ సిలిండర్ ఇంజిన్లతో రంగప్రవేశం!
భారత్‌లోకి పవర్‌ఫుల్ ఇటలీ స్కూటర్లు.. 700cc భారీ ఇంజిన్‌తో రచ్చ చేయనున్న డ్రాగ్‌స్టర్
Off-road SUVs: ఆఫ్‌రోడింగ్‌ ఎస్‌యూవీల కోసం భారీగా ఖర్చు పెట్టే పనే లేదు! రూ.12.59 లక్షల నుంచే 5 సూపర్‌ మోడళ్లు!
వరదైనా, బురదైనా, రాళ్ల దారైనా.. ఈజీగా దూసుకెళ్లే 5 SUVలు, రూ.12.59 లక్షల నుంచే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
KTR On RR Tax: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Telangana Cabinet Decisions: ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!
ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget