అన్వేషించండి

Hyundai Bluelink Insurance: హ్యుందాయ్ బ్లూలింక్‌ కస్టమర్లకు బీమా బెనిఫిట్స్‌... డ్రైవింగ్ స్కోర్ ఆధారంగా అదనపు ప్రయోజనాలు

హ్యుందాయ్ కంపెనీ, బ్లూలింక్‌ కనెక్టెడ్ కార్ల కస్టమర్ల కోసం యూసేజ్‌-బేస్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

Hyundai Usage Based Insurance: హ్యుందాయ్ ఇండియా, తన Bluelink కనెక్టెడ్ కార్ల కస్టమర్ల కోసం కొత్త 'యూసేజ్‌-బేస్డ్‌ ఇన్సూరెన్స్‌' (UBI) ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా.. కస్టమర్ల డ్రైవింగ్ అలవాట్ల ఆధారంగా, ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా.. Bluelink ప్లాట్‌ఫామ్ సేకరించే వాహన డేటాను ఉపయోగించి ప్రతి కస్టమర్‌కు వ్యక్తిగత డ్రైవింగ్ స్కోర్ కేటాయిస్తారు. ఈ స్కోర్‌ను ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ సమయంలో పాల్గొనే బీమా సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి.

ఈ కార్యక్రమం హ్యుందాయ్ మోడల్ పోర్ట్‌ఫోలియో అంతటా అందుబాటులో ఉంటుంది. అయితే, కస్టమర్లు నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అందుకోవాలి. అలాగే, ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయాన్ని బట్టి ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి.

హ్యుందాయ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ (HIIB) ఈ కార్యక్రమంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. కస్టమర్ల అనుమతితో, వారి డ్రైవింగ్ స్కోర్లను పాల్గొనే బీమా సంస్థలకు అందిస్తుంది. మొదటి దశలో.. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ & ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.

డ్రైవింగ్ స్కోర్ ఎలా లెక్కిస్తారు?

Bluelink ద్వారా గత మూడు నెలల్లో నమోదైన డ్రైవింగ్ ప్రవర్తన ఆధారంగా UBI స్కోర్‌ను లెక్కిస్తారు. రాబోయే 90 రోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ కావాల్సిన కస్టమర్లు తమ స్కోర్‌ను చూసుకోవచ్చు. అలాగే, ఈ ప్రోగ్రామ్ ద్వారా అదనపు ప్రయోజనాలు పొందేందుకు అర్హత ఉందో లేదో తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఇండియన్ మార్కెట్లోకి 3 ఇటాల్‌జెట్‌ స్కూటర్లు.. బ్రెంబో బ్రేక్స్, ట్విన్ సిలిండర్ ఇంజిన్లతో రంగప్రవేశం!

డ్రైవింగ్ స్కోర్‌ను లెక్కించేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలిస్తారు. వేగంగా యాక్సిలరేషన్ ఇవ్వడం, వేగంగా వేగం తగ్గించడం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వేగ నియంత్రణ, ఇంజిన్ ఐడ్లింగ్ వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఈ డేటా నేరుగా కారు నుంచే సేకరిస్తారు. కాబట్టి, కస్టమర్లు ప్రత్యేకంగా ఎలాంటి అదనపు పరికరాలు లేదా హార్డ్‌వేర్‌ను కారులో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు.

Bluelink యాప్‌లోనే స్కోర్ వివరాలు

కస్టమర్లు తమ డ్రైవింగ్ స్కోర్‌ను Bluelink యాప్‌లో చూడవచ్చు. అలాగే, ఈ ప్రోగ్రామ్‌కు తమ అర్హతను కూడా ట్రాక్ చేయవచ్చు. తమ అనుమతితో యాప్ ద్వారానే డ్రైవింగ్ స్కోర్‌ను భాగస్వామ్య బీమా సంస్థలతో పంచుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత, బీమా సంస్థలు ఈ స్కోర్‌ను తమ అండర్‌రైటింగ్ ప్రక్రియలో ఒక అంశంగా పరిగణిస్తాయి. దాని ఆధారంగా పాలసీకి వర్తించే అదనపు ప్రయోజనాలను నిర్ణయిస్తాయి.

70 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే బెనిఫిట్స్

UBI స్కోర్ 70 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కస్టమర్లు ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో అదనపు ప్రయోజనాలకు అర్హత పొందే అవకాశం ఉంది. అయితే, ఎంత ప్రయోజనం లభిస్తుంది అనేది పూర్తిగా సంబంధిత బీమా సంస్థ అండర్‌రైటింగ్ విధానం, నిబంధనలు & షరతులపై ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఆఫ్‌రోడింగ్‌ ఎస్‌యూవీల కోసం భారీగా ఖర్చు పెట్టే పనే లేదు! రూ.12.59 లక్షల నుంచే 5 సూపర్‌ మోడళ్లు!

70 కంటే తక్కువ స్కోర్ వచ్చిన కస్టమర్లు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తమ డ్రైవింగ్ అలవాట్లను మెరుగుపరుచుకోవడానికి Bluelink యాప్ ద్వారా వ్యక్తిగత డ్రైవింగ్ సూచనలు పొందవచ్చు. వాటిని పాటించడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన స్కోర్ సాధించి, అదనపు ఇన్సూరెన్స్ ప్రయోజనాలకు అర్హత పొందే అవకాశం ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyundai Bayon SUV రివ్యూ.. ప్రీమియం ఇంటీరియర్, 360 కెమెరా, ADAS.. కొన్ని లోపాలూ ఉన్నాయ్‌!
హ్యుందాయ్‌ బేయాన్‌ రివ్యూ: మారుతి విక్టోరిస్‌కు రైవల్‌.. పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Italjet Scooters: ఇండియన్ మార్కెట్లోకి 3 ఇటాల్‌జెట్‌ స్కూటర్లు.. బ్రెంబో బ్రేక్స్, ట్విన్ సిలిండర్ ఇంజిన్లతో రంగప్రవేశం!
భారత్‌లోకి పవర్‌ఫుల్ ఇటలీ స్కూటర్లు.. 700cc భారీ ఇంజిన్‌తో రచ్చ చేయనున్న డ్రాగ్‌స్టర్
Off-road SUVs: ఆఫ్‌రోడింగ్‌ ఎస్‌యూవీల కోసం భారీగా ఖర్చు పెట్టే పనే లేదు! రూ.12.59 లక్షల నుంచే 5 సూపర్‌ మోడళ్లు!
వరదైనా, బురదైనా, రాళ్ల దారైనా.. ఈజీగా దూసుకెళ్లే 5 SUVలు, రూ.12.59 లక్షల నుంచే!
పెట్రోల్ పవర్‌తో CNG మైలేజీ! Mahindra XUV 3XO CNGలో ఇన్ని ప్రత్యేకతలా? బుక్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
CNGలోనూ టర్బో పవర్! మహీంద్రా XUV 3XO ZNG కొనే ముందు మీకు తెలియాల్సిన విషయాలు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
KTR On RR Tax: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Telangana Cabinet Decisions: ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!
ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget