అన్వేషించండి

Volkswagen Virtus Facelift టీజర్ లాంచ్‌.. LED లైట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో అదిరిపోయే డిజైన్!

Volkswagen Virtus Facelift టీజర్ విడుదలైంది. కొత్త హెడ్‌లైట్లు, గ్రిల్, బంపర్లు, అల్లాయ్ వీల్స్‌తో పాటు 360 డిగ్రీ కెమెరా, కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వచ్చే అవకాశం ఉంది.

Volkswagen Virtus Facelift: భారత మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ సెడాన్ త్వరలోనే కొత్త రూపంలో ‍‌(ఫేస్‌లిఫ్ట్‌) రానుంది. కంపెనీ, తొలిసారిగా Virtus Facelift టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కొత్త డిజైన్ మార్పులను చూపించింది. 2022 జూన్‌లో భారత్‌లోకి వచ్చిన తర్వాత ఈ మోడల్‌కు వస్తున్న తొలి సమగ్ర అప్‌డేట్ ఇదే.

కొత్త టీజర్‌లో.. హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఫ్రంట్ గ్రిల్, బంపర్, అల్లాయ్ వీల్స్‌లో మార్పులు కనిపించాయి. Skoda Slavia Facelift తరహాలో కొత్త ఫీచర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించవచ్చని సమాచారం.

ఫ్రంట్ డిజైన్‌లో మార్పులు

Virtus Facelift ముందు భాగంలో కొత్త ఫ్రంట్ బంపర్ కనిపిస్తోంది. ఇందులో గ్లోస్ ఫినిష్‌తో కూడిన చిన్న డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌ను కూడా మార్చారు. ఇందులో చిన్న క్యూబ్ ఆకారపు లైట్లు కనిపిస్తున్నాయి.

ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇందులో వెలిగే Volkswagen లోగో, రెడ్ GT బ్యాడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. హెడ్‌లైట్ల డిజైన్ కూడా కొంత మారింది. ప్రధాన హెడ్‌లైట్ల కింద మాత్రమే LED DRLs ఉండేలా కనిపిస్తున్నాయి. అయితే రెండు హెడ్‌లైట్ల మధ్య ఉన్న క్రోమ్ స్ట్రిప్స్ పాత మోడల్‌లో మాదిరిగానే కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

కొత్త బ్లాక్ అల్లాయ్ వీల్స్

టీజర్‌లో కొత్త బ్లాక్ ఫినిష్ అల్లాయ్ వీల్స్ కనిపించాయి. పాత Virtus GT వేరియంట్‌లోనూ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉండేవి. ఇతర వేరియంట్లలో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ అందించే అవకాశం ఉంది.

వీల్ సైజు మాత్రం గతంలో మాదిరిగానే 16 అంగుళాలుగా ఉండవచ్చని అంచనా. ఔట్‌సైడ్‌ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVMs)పై కొత్త కెమెరా పాడ్స్ కనిపించాయి. వీటి ఆధారంగా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 360 డిగ్రీ కెమెరా సెటప్ వచ్చే అవకాశం స్పష్టమవుతోంది. మిగతా సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి: కొత్త వాహనానికే కాదు.. పాత బండికి కూడా BH సిరీస్ నంబర్ ప్లేట్! ఎలా అప్లై చేయాలంటే?

టెయిల్ లైట్లలో కొత్త LED ఎలిమెంట్లు

కారు వెనుక భాగంలో టెయిల్ లైట్ల LED ఎలిమెంట్లను మార్చినట్లు టీజర్‌లో కనిపిస్తోంది. అయితే టెయిల్ ల్యాంప్ హౌసింగ్ మాత్రం పాత మోడల్ తరహాలోనే ఉంది.

వెనుక బంపర్‌లోని బ్లాక్ లోయర్ సెక్షన్, బూట్ లిప్ స్పాయిలర్ వంటి అంశాలు కూడా ప్రస్తుత Virtus మోడల్‌లో ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి.

ఇంటీరియర్, ఇంజిన్ వివరాలు

Virtus Facelift ఇంటీరియర్ డిజైన్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని అంచనా. అయితే కొత్త ఫీచర్లు జోడించే అవకాశం ఉంది. ఇంజిన్ ఆప్షన్లు కూడా ప్రస్తుత మోడల్‌లో ఉన్నవే కొనసాగవచ్చని తెలుస్తోంది.

ప్రధానంగా 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించవచ్చని సమాచారం. ప్రస్తుతం ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో ఇది రానుంది. అయితే మిగతా స్పెసిఫికేషన్లపై కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినా కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. BH సిరీస్ నంబర్‌ ప్లేట్‌ పూర్తి వివరాలు ఇవే!

మొత్తంగా చూస్తే.. కొత్త Volkswagen Virtus Facelift‌లో డిజైన్ మార్పులతో పాటు 360 డిగ్రీ కెమెరా వంటి కొత్త ఫీచర్లు ఆకర్షణగా నిలవనున్నాయి. అధికారికంగా విడుదలయ్యే సమయంలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Rajiv Gandhi Security: రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
YS Sharmila Daughters Wedding: నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మార్చారు
నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మార్చారు
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
Embed widget