Honda Bikes ADAS: బైకుల్లో కూడా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. హోండా కొత్త Sensing Ride సిస్టమ్ ప్రత్యేకతలు ఇవే
హోండా తన మోటార్‌సైకిళ్ల కోసం హోండా సెన్సింగ్ రైడ్ ADAS టెక్నాలజీని పరిచయం చేసింది. ఇందులో, రైడర్‌కు అదనపు సాయం అందించే 10 అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.

ADAS For Honda Motorcycles: మోటార్‌సైకిళ్లలో కూడా కార్ల తరహా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు హోండా సిద్ధమైంది. EICMA 2026 ప్రదర్శనలో, హోండా సెన్సింగ్ రైడ్ (Honda Sensing Ride) అనే కొత్త ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ వ్యవస్థలో మొత్తం 10 రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ADAS టెక్నాలజీ.. బైక్ చుట్టూ ఉన్న ట్రాఫిక్‌ను రాడార్ సెన్సర్లతో పర్యవేక్షిస్తుంది. అవసరమైన సందర్భాల్లో రైడర్‌కు హెచ్చరికలు ఇవ్వడంతో పాటు కొన్ని పరిస్థితుల్లో బ్రేకింగ్‌కు కూడా సహాయం చేస్తుంది.
మొదటగా 2027 హోండా CRF1150L ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మోడల్‌లో ఈ టెక్నాలజీని అందించనున్నారు. ఈ బైక్‌ను కూడా EICMA 2026 వేదికపైనే హోండా ఆవిష్కరించింది. భవిష్యత్తులో మరిన్ని మోటార్‌సైకిళ్లకు ఈ టెక్నాలజీని విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే తర్వాత ఏ మోడళ్లలో అందిస్తారనే వివరాలను వెల్లడించలేదు.
Honda Sensing Ride ఎలా పనిచేస్తుంది?
ఈ ADAS వ్యవస్థలో మిల్లీమీటర్-వేవ్ రాడార్ యూనిట్లను ఉపయోగిస్తారు. వీటిని మోటార్‌సైకిల్ ముందు & వెనుక భాగాల్లో అమర్చుతారు. ఇవి బైక్ చుట్టూ ఉన్న ఇతర వాహనాలను గుర్తించి ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షిస్తాయి. ఇది కార్ల కోసం హోండా అభివృద్ధి చేసిన Honda Sensing టెక్నాలజీ ఆధారంగా రూపొందింది. అయితే, ద్విచక్ర వాహనాలకు అనుగుణంగా మార్పులు చేశారు.
ఇది కూడా చదవండి: High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
10 ప్రత్యేక ఫీచర్లు
ఈ సిస్టమ్‌లోఉన్న 10 ఫీచర్లు.. క్రూయిజ్ కంట్రోల్ నుంచి ప్రమాద హెచ్చరికల వరకు వివిధ అవసరాలను కవర్ చేస్తాయి.
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC): ముందున్న వాహనానికి తగిన దూరాన్ని కొనసాగిస్తూ రైడర్ సెట్ చేసిన వేగాన్ని నిర్వహించడంలో ఈ ఫీచర్ సహాయపడుతుంది.
స్టాప్ & గోతో కూడిన ACC: నెమ్మదిగా కదిలే ట్రాఫిక్‌లో కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అవసరమైనప్పుడు బైక్‌ను ఆపడంతో పాటు, ట్రాఫిక్ కదలడం ప్రారంభించినప్పుడు మళ్లీ ముందుకు వెళ్లేందుకు సహాయపడుతుంది.
గ్రూప్ రైడ్ అసిస్ట్: ఒకే గ్రూప్‌లో ప్రయాణించే మోటార్‌సైకిళ్ల మధ్య సరైన దూరాన్ని కొనసాగించడంలో ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఇది ACC టెక్నాలజీకి మరో విస్తరణగా పనిచేస్తుంది.
డిస్టెన్స్ అసిస్ట్: రైడర్ యాక్సిలరేటర్ ఇస్తున్న సమయంలో ముందున్న వాహనానికి బైక్ దగ్గరవుతుంటే, ఈ ఫీచర్ అనుసరించే దూరాన్ని సర్దుబాటు చేస్తుంది.
ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్: ముందున్న వాహనంతో ఢీకొనే ప్రమాదం ఉందని సిస్టమ్ గుర్తిస్తే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై హెచ్చరికను చూపిస్తుంది.
బ్రేక్ పల్స్: ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్‌తో కలిసి పనిచేస్తూ, రైడర్ ప్రమాద పరిస్థితిని మరింత స్పష్టంగా గుర్తించేలా సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ బ్లూలింక్ కస్టమర్లకు బీమా బెనిఫిట్స్... డ్రైవింగ్ స్కోర్ ఆధారంగా అదనపు ప్రయోజనాలు
ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్: ముందున్న వాహనంతో ఢీకొనే ప్రమాదం ఉందని సిస్టమ్ గుర్తించినప్పుడు, రైడర్ బ్రేకులు వేస్తే బ్రేకింగ్‌కు అదనపు సహాయం అందిస్తుంది.
రియర్ కొలిజన్ వార్నింగ్: వెనుక నుంచి వాహనాలు దగ్గరగా వస్తున్నప్పుడు బైక్ ఇండికేటర్లను ఫ్లాష్ చేస్తుంది. దీని ద్వారా వెనుక వచ్చే వాహనాలకు హెచ్చరిక అందుతుంది.
రియర్ డిస్టెన్స్ ఇన్ఫర్మేషన్: వెనుక నుంచి మరో వాహనం వేగంగా దగ్గరవుతున్నప్పుడు రైడర్‌కు హెచ్చరికను చూపిస్తుంది.
బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్: వెనుక రాడార్ సహాయంతో, బైక్ వెనుక పక్కవైపు ఉన్న బ్లైండ్ స్పాట్‌లోకి ఇతర వాహనాలు వస్తున్నాయా అని గుర్తిస్తుంది. అలా వాహనం గుర్తించినప్పుడు మిర్రర్‌పై వెలిగే లేదా ఫ్లాష్ అయ్యే ఇండికేటర్ ద్వారా రైడర్‌ను అప్రమత్తం చేస్తుంది.
DCT ట్రాన్స్‌మిషన్ కీలకం
Honda Sensing Ride వ్యవస్థలో DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్టాప్ & గోతో కూడిన ACC వంటి ఫీచర్లకు ఇది ఉపయోగపడుతుంది.
సాధారణ క్లచ్ లీవర్‌ను రైడర్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా DCT క్లచ్ ఆపరేషన్ & గేర్ మార్పులను నిర్వహిస్తుంది. గేర్లు మారుతున్న సమయంలో కూడా పవర్ డెలివరీ కొనసాగుతుందని హోండా పేర్కొంది.
మిగిలిన బైక్‌లకు ఎప్పుడు?
Honda Sensing Ride టెక్నాలజీని '2027 CRF1150L ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మోడల్'లో మొదట అందించనున్నారు. ఈ ADAS వ్యవస్థను కంపెనీ తన ఇతర మోటార్‌సైకిళ్లకు ఎప్పుడు విస్తరిస్తుందనే దానిపై ఇంకా స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించలేదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















