అన్వేషించండి

Electric Scooter Sales: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!

Meta Summary: అక్టోబర్ 2026లో TVS 60,490 ఎలక్ట్రిక్ టూ వీలర్లను విక్రయించి మొదటి స్థానంలో నిలిచింది. Bajaj రెండో స్థానంలో ఉండగా Ola అమ్మకాలు తగ్గాయి.

Electric Scooter Sales October 2026: భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ విభాగంలో, గత నెల (అక్టోబర్ 2026) అమ్మకాలలో టీవీఎస్‌ మోటార్‌ (TVS Motor) అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ ఒక్క నెలలోనే ఏకంగా 60,490 ఎలక్ట్రిక్ టూ వీలర్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి సేల్స్‌ 94.7 శాతం పెరిగాయి. అంటే దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. రెండో స్థానంలో బజాజ్‌ (Bajaj Electric Scooters) ఉంది.

మొత్తం ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి 48.5 శాతం వృద్ధి చెందింది. అక్టోబర్ 2026లో భారతదేశంలో మొత్తం 2,24,064 ఎలక్ట్రిక్ టూ వీలర్లు రిటైల్ అయ్యాయి. అయితే సెప్టెంబర్‌ 2026తో పోలిస్తే మాత్రం మొత్తం టూ వీలర్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా తగ్గింది.

TVS మొదటి స్థానం.. Bajaj రెండో స్థానం

ఈ జాబితాలో TVS Motor 60,490 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. Bajaj 49,126 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. Bajaj అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 51.3 శాతం పెరిగాయి.

Ather మూడో స్థానంలో ఉంది. ఈ కంపెనీ అక్టోబర్‌లో 31,833 ఎలక్ట్రిక్ టూ వీలర్లను సేల్‌ చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 5.3 శాతం వృద్ధి నమోదైంది.

Hero MotoCorp అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో ఈ కంపెనీ 29,923 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఇది 81.4 శాతం అధికం.

ఇది కూడా చదవండి: 25.5hp పవర్‌తో మార్కెట్‌లోకి దూసుకొచ్చిన Bajaj Pulsar NS200.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల కంపారిజన్‌

Ola Electric అమ్మకాలు తగ్గుముఖం

టాప్ 5 కంపెనీల్లో ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు తగ్గిన ఏకైక బ్రాండ్ Ola Electric. ఈ కంపెనీ అక్టోబర్ 2026లో 12,098 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే Ola అమ్మకాలు 26.4 శాతం తగ్గాయి. సెప్టెంబర్ 2026తో పోల్చినా 10.1 శాతం తక్కువగా నమోదయ్యాయి. మిగతా నాలుగు కంపెనీలు మాత్రం ఏడాది ప్రాతిపదికన వృద్ధిని సాధించాయి.

ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్ వాటా తగ్గింది

మొత్తం EV అమ్మకాలు పెరిగినప్పటికీ, ద్విచక్ర వాహనాల రిటైల్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా తగ్గింది. 2026 సెప్టెంబర్‌లో ఇది 11.6 శాతంగా ఉండగా, అక్టోబర్ మాత్రం 9.7 శాతానికి తగ్గింది.

దీనికి దీపావళి పండుగ తేదీల మార్పు ఒక కారణమై ఉండవచ్చని అంచనా. 2025లో దీపావళి అక్టోబర్‌లో వచ్చింది. కానీ 2026లో నవంబర్‌లో జరగనుంది. దీంతో పండుగ సీజన్‌లో వాహనాల కొనుగోళ్లలో గణనీయమైన భాగం అక్టోబర్ నుంచి నవంబర్‌కు మారినట్లు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Honda CBR1000RR-R Fireblade: 2026, 2027 మోడళ్ల మధ్య తేడాలేంటి? కొత్తగా ఏ మారింది?

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

25.5hp పవర్‌తో మార్కెట్‌లోకి దూసుకొచ్చిన Bajaj Pulsar NS200.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల కంపారిజన్‌
కొత్త ఫీచర్లతో వచ్చిన బజాజ్ పల్సర్ NS200.. ఇప్పుడు KTM డ్యూక్, TVS అపాచీ కంటే ఇదే బెస్ట్‌ బైకా?
Honda CBR1000RR-R Fireblade: 2026, 2027 మోడళ్ల మధ్య తేడాలేంటి? కొత్తగా ఏ మారింది?
కొత్త లుక్‌తో తిరిగొచ్చిన హోండా ఫైర్‌బ్లేడ్.. బరువు తగ్గించి, టార్క్ పెంచిన కంపెనీ!
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Vehicle VIP Number: 9999, 0001 వంటి ఫ్యాన్సీ నంబర్లు పొందడం ఎలా? Parivahan పోర్టల్‌లో అప్లై చేసుకునే విధానం ఇదిగో
మీ కారు లేదా బైక్‌కు VIP నంబర్ కావాలా? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget