అన్వేషించండి

Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

కారులో డాష్‌క్యామ్ హార్డ్‌వైరింగ్ చేస్తే వారంటీ రద్దవుతుందా? ఫ్యూజ్ ట్యాప్, ఓబీడీ కనెక్షన్, బ్యాటరీ సమస్యలు, సురక్షిత అమరిక పద్ధతుల గురించి తెలుసుకోండి.

A Dashcam Void Car Warranty: ప్రస్తుతం కార్లలో డాష్‌క్యామ్‌ల వినియోగం బాగా పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ట్రాఫిక్ పోలీసులతో వివాదాలు తలెత్తినప్పుడు ఇవి కీలకమైన ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రమాదానికి అసలు కారణం ఏమిటో వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. బీమా క్లెయిమ్‌ల సమయంలోనూ ఇవి ఉపయోగపడతాయి. దీంతో చాలామంది కారు యజమానులు తమ వాహనాల్లో డాష్‌క్యామ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

డాష్‌క్యామ్ కొనడం ఒక ఎత్తయితే.. దానిని కారుకు ఎలా అమర్చాలన్నది మరో సమస్య. సాధారణంగా యూఎస్‌బీ పోర్ట్ లేదా 12V పవర్ సాకెట్ ద్వారా డాష్‌క్యామ్‌ను ఉపయోగిస్తారు. కానీ ఇంజిన్ ఆఫ్ చేయగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో పార్కింగ్ సమయంలోనూ వీడియో రికార్డింగ్ కావాలనుకునేవారు నేరుగా కారు విద్యుత్ వ్యవస్థకు అనుసంధానం చేసే విధానాన్ని ఎంచుకుంటున్నారు. దీనినే హార్డ్‌వైరింగ్ అంటారు. అయితే.. డాష్‌క్యామ్‌ను ఇలా అమరిస్తే కారు కంపెనీ ఇచ్చే వారంటీ రద్దవుతుందా? విద్యుత్ వ్యవస్థలో సమస్యలు వస్తాయా? బ్యాటరీపై ప్రభావం పడుతుందా?.

డాష్‌క్యామ్ హార్డ్‌వైరింగ్ అంటే ఏమిటి?

సాధారణంగా డాష్‌క్యామ్‌తో పాటు ఒక విద్యుత్ కేబుల్ ఇస్తారు. దీనిని కారు యూఎస్‌బీ పోర్ట్ లేదా 12V పవర్ సాకెట్‌కు అనుసంధానం చేస్తే సరిపోతుంది. కారు స్టార్ట్‌ చేసినప్పుడు కెమెరా పనిచేస్తుంది. ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. హార్డ్‌వైరింగ్ విధానంలో మాత్రం డాష్‌క్యామ్‌ను నేరుగా కారు ఫ్యూజ్ బాక్స్‌కు అనుసంధానం చేస్తారు. ఇది సాధారణంగా డ్రైవర్ సీటు కింద ఉన్న డ్యాష్‌బోర్డు ప్రాంతంలో ఉంటుంది. ఈ విధానంతో ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కెమెరా పనిచేసేలా ఏర్పాటు చేయవచ్చు.

ఈ వ్యవస్థలో మూడు రకాల వైర్లు ఉంటాయి. మొదటిది ఏసీసీ వైర్. ఇది కారు ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు మాత్రమే విద్యుత్ అందిస్తుంది. రెండోది బ్యాటరీ నుంచి నిరంతరం విద్యుత్ పొందే వైర్. దీని ద్వారా పార్కింగ్ సమయంలోనూ కెమెరా పనిచేస్తుంది. మూడోది గ్రౌండ్ వైర్. దీన్ని కారు లోహపు భాగానికి అనుసంధానం చేస్తారు.

ఇది కూడా చదవండి: ఫుల్ ఛార్జింగ్‌తో కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారా? ఎలక్ట్రిక్‌ కారు డ్రైవర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం!

వైరింగ్ కట్ చేస్తే వారంటీకి ముప్పే!

డాష్‌క్యామ్ అమర్చే సమయంలో కొందరు మెకానిక్‌లు సులభమైన మార్గం కోసం కారు అసలు వైర్లను కట్ చేస్తారు. వాటి పైపొర తొలగించి కొత్త వైర్లను కలుపుతారు. అనంతరం టేప్‌తో చుట్టి కనెక్షన్లు ఏర్పాటు చేస్తారు. ఇదే అసలు సమస్యకు కారణమవుతుంది. కార్ల తయారీ సంస్థలు ప్రతి విద్యుత్ వైర్‌ను నిర్దిష్ట ప్రమాణాలతో రూపొందిస్తాయి. వాటిని కట్ చేయడం లేదా మార్చడం వల్ల విద్యుత్ వ్యవస్థలో లోపాలు వచ్చే అవకాశం ఉంది. సర్వీసింగ్ సమయంలో కంపెనీ సిబ్బంది ఇలాంటి మార్పులను గుర్తిస్తే వారంటీ క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు కారు టచ్‌స్క్రీన్ పనిచేయకపోయినా, పవర్ విండోస్‌లో సమస్య వచ్చినా, విద్యుత్ వ్యవస్థలో లోపం తలెత్తినా.. డాష్‌క్యామ్ కోసం చేసిన మార్పులే కారణమని కంపెనీ భావించవచ్చు. అయితే ప్రతి సందర్భంలోనూ మొత్తం కారు వారంటీ రద్దవుతుందని భావించకూడదు. ఏ భాగంలో సమస్య వచ్చింది? దానికి అమర్చిన బయటి పరికరమే కారణమా? అనే అంశాల ఆధారంగా కంపెనీ నిర్ణయం తీసుకుంటుంది.

ఫ్యూజ్ ట్యాప్‌తో సురక్షితంగా అమరిక

డాష్‌క్యామ్‌ను అమర్చేందుకు మరో మంచి మార్గం యాడ్- ఎ-సర్క్యూట్ ఫ్యూజ్ ట్యాప్. ఇది కారు ఫ్యూజ్ బాక్స్‌లోని ఖాళీ లేదా అనువైన ఫ్యూజ్ స్థానంలో అమరుతుంది. దీనికి రెండు ఫ్యూజ్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఒకటి కారు అసలు విద్యుత్ పరికరం కోసం, మరొకటి డాష్‌క్యామ్ కోసం ఉపయోగపడుతుంది. ఈ విధానంలో కారు అసలు వైర్లను కట్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే ఫ్యూజ్ ట్యాప్‌ను తొలగించి, పాత ఫ్యూజ్‌ను తిరిగి అమర్చవచ్చు. అందువల్ల సాధారణ వైర్లను కట్ చేసే విధానంతో పోలిస్తే ఇది మెరుగైన ఎంపిక.

అయితే ఫ్యూజ్ ట్యాప్ ఉపయోగించినంత మాత్రాన వారంటీ విషయంలో ఎలాంటి వివాదం ఉండదని చెప్పలేం. డాష్‌క్యామ్ వల్లే విద్యుత్ సమస్య వచ్చిందని సర్వీస్ సెంటర్ నిరూపిస్తే, సంబంధిత వారంటీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?

OBD పోర్ట్ ద్వారా మరో మార్గం

కారులో ఉండే OBD-II డయాగ్నస్టిక్ పోర్ట్ ద్వారా కూడా డాష్‌క్యామ్‌కు విద్యుత్ అందించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన పవర్ అడాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఇగ్నిషన్ స్థితిని గుర్తించడంతో పాటు పార్కింగ్ సమయంలోనూ కెమెరాకు విద్యుత్ అందించవచ్చు. బ్యాటరీ వోల్టేజ్ తగ్గినప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపివేసే సదుపాయం ఈ అడాప్టర్లలో ఉంటుంది. అవసరమైతే సులభంగా తొలగించవచ్చు. అలాగే కొన్ని కార్ల కంపెనీలు తమ అధికారిక ఉపకరణాల జాబితాలోనే డాష్‌క్యామ్‌లను అందిస్తున్నాయి. వారంటీ వివాదాలు వద్దనుకునేవారు కంపెనీ ఆమోదించిన ఉపకరణాలను ఎంచుకోవడం మంచిది.

బ్యాటరీ ఖాళీ అయ్యే ప్రమాదం

హార్డ్‌వైరింగ్‌లో వారంటీ కంటే ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అంశం కారు బ్యాటరీ. పార్కింగ్ సమయంలోనూ డాష్‌క్యామ్ పనిచేస్తుంటే అది నిరంతరం బ్యాటరీ నుంచి విద్యుత్ తీసుకుంటుంది. కారు ఎక్కువ రోజులు ఒకేచోట నిలిపి ఉంచితే బ్యాటరీ ఛార్జ్ తగ్గిపోవచ్చు. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బ్యాటరీపై ఇప్పటికే ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో డాష్‌క్యామ్ కూడా నిరంతరం విద్యుత్ తీసుకుంటే బ్యాటరీ త్వరగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయితే కారు స్టార్ట్ కాకపోవచ్చు. ఇలా పలుమార్లు జరిగితే బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గుతుంది.

ఈ సమస్యను నివారించేందుకు తక్కువ వోల్టేజ్ వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేసే సదుపాయం ఉన్న హార్డ్‌వైర్ కిట్‌ను ఎంచుకోవాలి. బ్యాటరీ వోల్టేజ్ నిర్దేశిత స్థాయికి తగ్గగానే అది డాష్‌క్యామ్‌కు విద్యుత్ సరఫరాను ఆపేస్తుంది. దీనివల్ల కారు బ్యాటరీకి కొంత రక్షణ లభిస్తుంది.

చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. డాష్‌క్యామ్ అమర్చినంత మాత్రాన కారు మొత్తం వారంటీ రద్దవుతుందని లేదు. అదే సమయంలో, బయట చేసిన విద్యుత్ మార్పుల వల్ల సమస్య వస్తే సంబంధిత వారంటీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి డాష్‌క్యామ్ కొనుగోలు చేయడమే కాదు.. దాన్ని ఎలా అమర్చిస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Kia Seltos సరికొత్త రికార్డ్‌.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
ఇండియాలో 7 లక్షల మంది కొన్న క్రేజీ SUV.. ధర మీ బడ్జెట్‌లోనే!
Denza Z9 GT: 3 సెకన్లలో 100km స్పీడ్‌, 670km రేంజ్‌, 1156hp పవర్‌.. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మరో సంచలనం!
దాదాపు రూ.2 కోట్ల కారు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే 'ఓయబ్బో' అంటారు!
TVS vs Bajaj vs Hero: లక్ష రూపాయల బడ్జెట్‌లో స్పోర్టీ బైక్.. 150-160cc సెగ్మెంట్‌లో ఈ మూడు బైకుల మధ్య టఫ్‌ ఫైట్‌!
టీవీఎస్ అపాచీ, బజాజ్ పల్సర్, హీరో ఎక్స్‌ట్రీమ్.. ప్రైస్‌, పవర్, ఫీచర్లలో ఏది బెస్ట్?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Hyderabad Cyber Fraud: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
Embed widget