అన్వేషించండి

Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06

Hero Vida UBX 06 Electric Bike: హీరో విడా UBX 06 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆ కంపెనీ రోడ్డుపై టెస్ట్‌ చేస్తుండగా కెమెరా కంటికి చిక్కింది. వివరాలు తెలుసుకోండి.

Hero Vida UBX 06 Electric Motorcycle: భారత్‌లో, Vida ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయిస్తున్న Hero MotoCorp.. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ, తన Vida బ్రాండ్ కింద తీసుకురానున్న తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ UBX 06. తాజాగా ఈ బండి రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. EICMA 2026లో ఈ బైక్‌కు సంబంధించిన నమూనాను ప్రదర్శించిన కొన్ని రోజులకే టెస్టింగ్ వెహికల్‌ బయటకు రావడం ఆసక్తి రేపుతోంది.

UBX 06 పేరును ‘యూబీ-ఎక్స్’గా పలుకుతారు. ఈ బైక్ ద్వారా Vida తన ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్‌ నుంచి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం కనిపించిన టెస్టింగ్ మోడల్ పూర్తిగా కవర్‌తో కప్పి ఉంది. అయినప్పటికీ దీని మొత్తం ఆకృతి, డిజైన్ EICMA 2026లో ప్రదర్శించిన మోడల్‌కు దగ్గరగా కనిపిస్తున్నాయి.

సూపర్‌మోటో స్టైల్ డిజైన్

Hero Vida UBX 06 డిజైన్‌లో సూపర్‌మోటో మోటార్‌సైకిళ్ల ప్రభావం కనిపిస్తోంది. నిటారుగా కూర్చునే రైడింగ్ పొజిషన్, ఎత్తుగా ఉండే ముందు భాగం, కాంపాక్ట్‌గా కనిపించే వెనుక భాగం దీని ప్రత్యేకతలు. రోడ్డు ప్రయాణాలతో పాటు కొంత స్పోర్టీ లుక్ కోరుకునే రైడర్లను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

EICMAలో ప్రదర్శించిన మోడల్‌లో ముందు భాగంలో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ ఉంది. దాని చుట్టూ వ్యూఫైండర్ ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు అమర్చారు. అయితే తాజాగా కనిపించిన టెస్టింగ్ బైక్‌లో, డిస్‌ప్లే మోడల్‌పై ఉన్న నకిల్ గార్డ్స్ కనిపించడం లేదు. ఉత్పత్తి దశలో ఈ ఫీచర్ ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

ఇది కూడా చదవండి: Bajaj Pulsar N250 SS ఫస్ట్ రైడ్ రివ్యూ: పవర్, టెక్నాలజీ.. కొత్త అప్‌డేట్స్‌తో ఈ బండి మరింత స్పెషల్!

TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో పెద్ద TFT డిస్‌ప్లే ఉండనుంది. టెస్టింగ్ మోడల్‌లోనూ ఈ స్క్రీన్ కనిపించింది. ఎడమవైపు హ్యాండిల్‌బార్‌పై కంట్రోల్ స్విచ్‌లను అమర్చారు. కుడివైపు కూడా ఇతర ఫంక్షన్ల కోసం ప్రత్యేక స్విచ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ఆసక్తికరమైన ఫీచర్.. క్రూయిజ్ కంట్రోల్. సాధారణంగా హైవే ప్రయాణాల్లో రైడర్‌కు ఉపయోగపడే ఈ సదుపాయం UBX 06లో కనిపించడం ప్రత్యేకత. అయితే ఈ ఫీచర్ ఏ వేరియంట్లో అందుబాటులో ఉంటుందనే వివరాలు కంపెనీ వెల్లడించలేదు.

డిస్క్ బ్రేకులు, USD ఫోర్క్

UBX 06లో ముందు, వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. టెస్టింగ్ బైక్‌లో సింగిల్ ఛానల్ ABS ఉన్నట్లు కనిపిస్తోంది. సస్పెన్షన్ బాధ్యతలను ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ నిర్వహిస్తాయి. ఇవి బైక్‌కు మెరుగైన హ్యాండ్లింగ్, రైడింగ్ స్థిరత్వం అందించడంలో సహాయపడతాయి.

అయితే బ్రేకింగ్ వ్యవస్థ, సస్పెన్షన్ సెటప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. తుది ఉత్పత్తి మోడల్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Affordable Gloves Boots: రూ.15 వేలల్లోనే పూర్తి రైడింగ్ గేర్.. CE Level 2 ఆర్మర్ అంటే ఏమిటి?

బ్యాటరీ, మోటార్ వివరాలు

UBX 06 బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, గరిష్ఠ వేగం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే వెళ్లగల దూరం వంటి కీలక వివరాలను Hero MotoCorp ఇప్పటివరకు ప్రకటించలేదు. EICMA 2026లో ప్రదర్శించిన మోడల్‌ను పరిశీలిస్తే, ఇందులో పెద్ద ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ముఖ్యమైన అంశం మిడ్-డ్రైవ్ మోటార్. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో కనిపించే హబ్ మోటార్ విధానానికి భిన్నంగా, ఈ బైక్‌లో మోటార్‌ను వాహనం మధ్య భాగానికి దగ్గరగా అమర్చారు. అక్కడి నుంచి చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి శక్తి అందుతుంది.

భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ప్రస్తుతం UBX 06 భారత రోడ్లపై టెస్టింగ్ దశలో ఉంది. కంపెనీ అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం 2027 మధ్యలో ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rodent Attacks: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? రూ.వేల రిపేర్‌ ఖర్చు తప్పించుకోవాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!
కారు ఇంజిన్‌లోకి ఎలుకలు వెళ్తున్నాయా? స్ప్రే నుంచి స్టీల్ మెష్ వరకు.. రక్షణకు 5 మార్గాలు!
Child Seat Mounts: ఫ్యామిలీ కార్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలోనే కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చే కార్ల లిస్ట్‌
కారు ప్రయాణంలో మీ పిల్లల భద్రతకు భరోసా.. తక్కువ ధరలోనే 6 ఎయిర్‌బ్యాగ్స్, ISOFIX ఉన్న కార్లు
EV Charger: ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్‌కు ఎంత కెపాసిటీ ఛార్జర్ కావాలి? కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఇంట్లోనే EV ఛార్జర్... 3.3 kW, 7.2 kW, 11 kWలో మీ కారుకు ఏది సరిపోతుందో తెలుసుకోండి
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Embed widget